Air India New CEO: ఎయిర్‌ ఇండియాకు కొత్త బాస్‌.. ప్రకటించిన టాటా సన్స్‌

|

Feb 14, 2022 | 10:02 PM

Air India New CEO: ఎయిర్‌ ఇండియా కు కొత్త చీఫ్‌ ఎగ్జిక్యూటీవ్‌ ఆఫసర్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా నియమిస్తూ టాటా సన్స్‌ నిర్ణయం తీసుకుంది. 2022 ఫిబ్రవరి 14న జరిగిన బోర్డు..

Air India New CEO: ఎయిర్‌ ఇండియాకు కొత్త బాస్‌.. ప్రకటించిన టాటా సన్స్‌
Follow us on

Air India New CEO: ఎయిర్‌ ఇండియా కు కొత్త చీఫ్‌ ఎగ్జిక్యూటీవ్‌ ఆఫసర్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా నియమిస్తూ టాటా సన్స్‌ నిర్ణయం తీసుకుంది. 2022 ఫిబ్రవరి 14న జరిగిన బోర్డు మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త సీఈవోగా ఐకెర్‌ అయ్‌సీని నియమిస్తున్నట్లు వెల్లడించింది. అయితే ఇప్పటి వరకు ఇప్పటి వరకు టర్కీ ఎయిర్‌వేస్‌కి చీఫ్‌గా ఐకెర్‌ ఆయ్‌సీ కొనసాగారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి ఆయన ఎయిరిండియా చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్లు టాటా వెల్లడించింది. అయితే ఒక దిగ్గజ విమానయాన సంస్థకు నాయకత్వం వహించే టాటా గ్రూప్‌లో చేరినందుకు సంతోషిస్తున్నానని, ఎయిర్‌ ఇండియా సహోద్యోగులతో, టాటా గ్రూప్‌ నాయకత్వంతో సన్నిహితంగా పని చేస్తానని ఐకెర్ అయ్‌సి తెలిపారు.

ఆయన 1994లో బిల్‌కెంట్‌ యూనివర్సిటీ నుంచి పబ్లిక్‌ అడ్మినిస్టేషన్‌ పట్టాను పొందారు. అనంతరం యూకేలోని లీడ్స్‌ యూనివర్సిటీ నుంచి పొలిటికల్‌ సైన్స్‌లో పట్టా పొందారు. అయితే అప్పుల్లో కూరుకుపోయిన ఎయిర్‌ ఇండియాను కేంద్రం వేలం వేయగా, ఇటీవల టాటా సన్స్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇందుకు సంబంధించిన చర్యలు చేపడుతోంది టాటా. ఈ నేపథ్యంలో కొత్త సీఈవో, ఎండీగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది టాటాసన్స్‌.

ఇవి కూడా చదవండి:

iPhone 13: గుడ్‌న్యూస్‌.. ఐఫోన్‌పై ఫ్లిప్‌కార్టులో అదిరిపోయే ఆఫర్‌.. భారీ డిస్కౌంట్‌..!

Jeep India: జీప్‌ ఇండియా నుంచి సరికొత్త కారు.. 7 సీట్ల ఎస్‌యూవీ మెరిడియన్‌..!