ప్రస్తుత తరుణంలో ధరలు పెరిగిపోతున్నాయి. నిత్యవసర సరుకులతో పాటు అన్నింటి ధరలు ఎగబాకుతున్నాయి. ఇక తాజాగా సహజవాయువు ధరలకు రెక్కలొచ్చాయి. విద్యుత్ ఉత్పత్తికి, ఎరువుల తయారీకి ఉపయోగించే సహాజవాయువు ధరలను (నాచురల్ గ్యాస్) కేంద్ర సర్కార్ 40 శాతం మేరకు పెంచింది. అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగా ఈ పెంపు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖకు చెందిన పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ (పీపీఏసీ) తెలిపింది.
ఈ ధరల పెంపు అమలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు పేర్కొంది. అయితే వాహనాల్లో సీఎన్‌జీగానూ, ఇళ్లల్లో వంట కోసం ఉపయోగించే పైప్‌లైన్ గ్యాస్‌నూ సహజ వాయువుగా వినియోగిస్తుంటారు. ఢిల్లీ, ముంబాయి వంటి ప్రధాన నగరాల్లో ఈ ధరలు పెరగనున్నాయి. అయితే ఈ సీఎన్‌జీ ధరలు పెరిగితే వాహనదారులపై భారం పడనుంది. అయితే ఈ సహజ వాయువు ధర 2019 ఏప్రిల్ నుంచి మూడోసారి పెరిగింది. విద్యుత్ ఉత్పత్తి, ఎరువుల తయారీ, ఆటోమొబైల్స్ నడపడానికి.. సీఎన్‌జీగా మార్చబడే సహజ వాయువు. అదే సమయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, దాని భాగస్వామి బీపీ పీఎల్సీ మాత్రం కేజీ బేసిన్‌లో డీ6 బ్లాక్ నుంచి గ్యాస్ ధరను 9.92 డాలర్ల నుంచి 12.6 డాలర్లకు పెంచేసింది. అడ్మినిస్ట్రేటివ్, రెగ్యులేటెడ్ ఫీల్డ్‌లలో ఈ ధర ఎక్కువ.
గత సంవత్సరం సీఎన్‌జీ గ్యాస్ పెరగడంతో.. పైప్డ్ గ్యాస్ ధరల పెరుగుల ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏడాదికి రెండుసార్లు గ్యాస్ ధరలపై సమీక్ష జరుపుతుంది. అమెరికా, కెనడా, రష్యాలో గ్యాస్ ధరలు ఎక్కువగా ఉండటం వల్ల.. మిగతా దేశాల్లో ధర నిర్ణయించడం ఆలస్యం అవుతుంది. ప్రస్తుతం ఉన్న 6.10 డాలర్ల నుంచి 8.57 డాలర్లకు పెంచారు. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్, బీపీ కలిసి సముద్రంలో అత్యంత లోతైన కేజీ డి6 బ్లాక్‌లో వెలికి తీస్తున్న గ్యాస్‌కు ప్రస్తుతం చెల్లిస్తున్న 9.92 డాలర్లకు బదులు ఇకపై 12.6 డాలర్లు చెల్లించనున్నారు. ధరల పెరుగుదలపై ఫోకస్ గత 8 నెలల నుంచి ధరల నియంత్రణపై ఆర్బీఐ మరింత దృష్టి సారించింది. లేదంటే ద్రవ్యోల్బణం ఏర్పడే అవకాశం ఉంది. ధరల నిర్ణయించడానికి ప్రభుత్వం ఒక కమిటీని కూడా వేసింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి