AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea: 2 సెంట్ల స్థలం ఉంటే చాలు.. నెలకు రూ.50 వేలు వచ్చే బిజినెస్‌ చేయొచ్చు!

తక్కువ స్థలంలో ఎక్కువ ఆదాయం కోరుకునే యువత, రైతులకు నాటు కోళ్ల పెంపకం అద్భుత అవకాశం. కేవలం రెండు సెంట్ల స్థలంలో రూ.80 వేల నుండి 1.5 లక్షల పెట్టుబడితో ఈ వ్యాపారం ప్రారంభించి, నెలకు రూ.20 వేల నుండి రూ.50 వేల వరకు సంపాదించవచ్చు.

Business Idea: 2 సెంట్ల స్థలం ఉంటే చాలు.. నెలకు రూ.50 వేలు వచ్చే బిజినెస్‌ చేయొచ్చు!
Country Chicken Farming
SN Pasha
|

Updated on: May 12, 2026 | 3:34 PM

Share

తక్కువ స్థలంలో ఎక్కువ ఆదాయం వచ్చే వ్యాపారాల కోసం చూస్తున్న యువత, రైతులు ఇప్పుడు నాటు కోళ్ల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కేవలం రెండు సెంట్ల స్థలంలోనే చిన్న స్థాయిలో నాటు కోళ్ల వ్యాపారం ప్రారంభించవచ్చని పశుసంవర్ధక నిపుణులు చెబుతున్నారు. సరైన ప్రణాళికతో ప్రారంభిస్తే ఈ వ్యాపారం అదనపు ఆదాయ వనరుగా మారే అవకాశం ఉందని వారు సూచిస్తున్నారు. రెండు సెంట్ల స్థలంలో సుమారు 80 నుంచి 120 నాటు కోళ్ల వరకు పెంచుకునే అవకాశం ఉంటుంది. ప్రారంభ దశలో షెడ్ నిర్మాణం, కోళ్ల కొనుగోలు, ఫీడ్, నీటి సదుపాయాలు, మందులు వంటి ఖర్చులకు సుమారు రూ.80 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి అవసరమవుతుంది.

సాధారణంగా బాంబూ, మెష్, టిన్ షీట్లతో తక్కువ ఖర్చులో షెడ్ నిర్మించుకోవచ్చు. స్థానిక వాతావరణానికి తట్టుకునే నాటు కోళ్లు ఎక్కువగా వ్యాధులను ఎదుర్కొనే సామర్థ్యం కలిగి ఉండటంతో నిర్వహణ ఖర్చులు బ్రాయిలర్ కోళ్లతో పోలిస్తే కొంత తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. నాటు కోళ్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లో కూడా ఆరోగ్యకరమైన ఆహారంగా నాటు కోడి మాంసాన్ని చాలా మంది ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం ఒక్క నాటు కోడి ధర బరువు, జాతిని బట్టి రూ.700 నుంచి రూ.1,500 వరకు పలుకుతోంది. గుడ్లకు కూడా మంచి ధర లభిస్తోంది. సరైన నిర్వహణతో నెలకు రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు ఆదాయం పొందే అవకాశం ఉందని వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు.

అయితే ఈ వ్యాపారంలో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. కోళ్లకు వైరల్ వ్యాధులు వస్తే భారీ నష్టాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు, వర్షాకాలంలో తేమ వల్ల కోళ్ల ఆరో్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఫీడ్ ధరలు పెరగడం కూడా లాభాలపై ప్రభావం చూపుతుంది. అందువల్ల శుభ్రత, వ్యాక్సినేషన్, సరైన ఆహారం, గాలి వెలుతురు ఉండే షెడ్ వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం తక్కువ పెట్టుబడితో స్వయం ఉపాధి కోరుకునే వారికి నాటు కోళ్ల పెంపకం ఒక మంచి వ్యాపార అవకాశంగా మారుతోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us