Tollywood: ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి ఫొటోలు, వీడియోలు డిలీట్.. విడాకుల బాటలో మరో టాలీవుడ్ హీరోయిన్!
ఈ మధ్యన సెలబ్రిటీల కాపురాలు ఇట్టే కూలిపోతున్నాయి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలోని పలువురు సెలబ్రిటీలు తమ భాగస్వాములతో కలిసి ఉండలేకపోతున్నారు. విడిపోవడమే మేలంటూ విడాకులు కోసం కోర్టు మెట్లెక్కుతున్నారు. ఇప్పుడీ విడాకుల జాబితాలోకి మరో ఫేమస్ హీరోయిన్ చేరిందని ప్రచారం జరుగుతోంది.

సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు విడాకులు సర్వసాధారణమైపోయాయి. ప్రేమించి లేదా పెద్దల కుదిర్చిన పెళ్లి చేసుకున్న కొందరు హీరోలు/ హీరోయిన్లు పట్టుమని కొన్నేళ్లయినా సంసార బంధాన్ని నిలుపుకోలేకపోతున్నారు. తమ భాగస్వాములతో కలిసుండలేమంటూ విడాకుల కోసం కోర్టు మెట్లెక్కుతున్నారు. ఇప్పుడు అలాగే ఓ ప్రముఖ హీరోయిన్ కూడా విడాకులు తీసుకునేందుకు రెడీ అయినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ విషయమే హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఈ మధ్యన విడాకులు తీసుకునే సెలబ్రిటీలు ముందుగా ఓ హింట్ ఇస్తున్నారు. అదేంటంటే.. ముందుగా సోషల్ మీడియాలో ఒకరు మరొకరిని అన్ ఫాలో చేయడం, పెళ్లి ఫొటోలు, వీడియోలు డిలీట్ చేయడం, అలాగే భర్తతో కలిసున్న ఫొటోలను సైతం తొలగించడం వంటి పనులు చేస్తున్నారు. ఇప్పుడు ఓ హీరోయిన్ లైఫ్ లోనూ ఇదే జరుగుతుంది. ఆమె మరెవరో కాదు ‘నాగిని’ సీరియల్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మౌనీరాయ్.
బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది మౌనీరాయ్. ముఖ్యంగా నెగెటివ్ పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకుందీ అందాల తారు.ఆ మధ్యన నాగార్జున, రణ్ బీర్ కపూర్, అలియా భట్ నటించిన బ్రహ్మస్త్ర సినిమాలో మౌనీ రాయ్ విలనిజం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులోనూ ఓ సినిమా చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న విశ్వంభరలో ఓ స్పెషల్ సాంగ్ చేస్తోందీ అందాల తార. దీంతో పాటు ఈ ముద్దుగుమ్మ నటించిన మరో రెండు సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. అయితే ఇంతలోనే మౌనీరాయ్ వ్యక్తిగత జీవితంలో కలకలం రేగింది. సినిమా కెరీర్ పరంగా బిజీగా ఉన్న ఆమె ఇప్పుడు విడాకులు తీసుకోబోతుందని ప్రచారం జరుగుతోంది. ఇన్ స్టా గ్రామ్ లో భర్తని అన్ ఫాలో చేయడమే ఈ రూమర్స్‌కి కారణం.
మౌనీరాయ్ లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
మౌనీ రాయ్ దుబాయి్ కు చెందిన వ్యాపారవేత్త సూరజ్ నంబియార్ తో 2022 జనవరిలో వివాహం జరిగింది. మలయాళీ, బెంగాలీ సంప్రదాయ పద్ధతుల్లో వీరి వివాహం అట్టహాసంగా జరిగింది. గోవా వేదికగా జరిగిన వీరి వివాహ వేడుక అప్పట్లో ఒక సంచలనం. అయితే ఇటీవల ఈ జంట మధ్య విభేదాలు తలెత్తాయని, విడిపోనున్నారనే వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. ఈ రూమర్లకు బలం చేకూర్చేలా మౌనీరాయ్ ఇన్ స్టా గ్రామ్ లో తన భర్త సూరజ్ ను అన్ ఫాలో చేసింది. అలాగే అతనితో కలిసి ఉన్న ఫొటోలన్నింటినీ డిలీట్ చేసింది. అయితే పెళ్లి ఫొటోలను మాత్రం అలాగే ఉంచింది. ఈ విషయంపై మౌనీ రాయ్ క్లారిటీ ఇస్తే కానీ నిజాలు బయటకు రావు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




