IINA Awards 2025: మై హోమ్‌కు ఉత్తమ HSE, ESG అవార్డులు!

మై హోమ్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్, ఇన్ఫ్రా స్ట్రక్చర్ స్కిల్ డెవలప్‌మెంట్ అకాడమీ ప్రకటించిన IINA (ISDA ఇన్ఫ్రాకం నేషనల్ అవార్డులు) 2025లో మూడు అవార్డులను గెలుచుకుంది. ఉత్తమ HSE, ESG, గ్రీన్ బిల్డింగ్ విభాగాలలో గోల్డ్, ప్లాటినం అవార్డులు దక్కాయి.

IINA Awards 2025: మై హోమ్‌కు ఉత్తమ HSE, ESG అవార్డులు!
Iina 2025

Edited By:

Updated on: Jun 18, 2025 | 11:49 AM

ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ కంపెనీ అయిన హై హోం పలు ప్రతిష్టాత్మక అవార్డులను అందుకుంది. హైదరాబాద్‌ మహానగరంలో గృహ కొనుగోలుదారుల అవసరాలను తీరుస్తూ.. భారీ భారీ ప్రాజెక్టులు, లగ్జరీ అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలు నిర్మిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కిల్‌ డెవలప్‌మెంట్ అకాడమీ ప్రకటించిన IINA (ISDA ఇంఫ్రాకం నేషనల్ అవార్డ్స్) 2025 అవార్స్‌లో మై హోమ్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ మూడు అవార్డులను గెలుచుకుంది. ఉత్తమ HSE (Health, Security and Environment), ఉత్తమ ESG (Environmental, Social, and Governance) విభాగాలలో గోల్డ్, ప్లాటినం అవార్డులు దక్కాయి. మై హోమ్ HSE హెడ్ D.B.V.S.N. రాజు, నిర్మాణ భద్రతా హెడ్ విభాగంలో గోల్డ్ గెలుచుకున్నారు. గ్రావా బిజినెస్ పార్క్ (కోకాపేట) ప్రాజెక్ట్ ఉత్తమ HSE ప్రాజెక్ట్ కోసం ప్లాటినం అవార్డును గెలుచుకుంది.

అదే ప్రాజెక్ట్ గ్రీన్ బిల్డింగ్, సస్టైనబిలిటీ విభాగంలో గోల్డ్ అవార్డును కూడా గెలుచుకుంది. ఈ సందర్భంగా ఎస్. వేణుగోపాల్ రావు (అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్, ప్రాజెక్ట్, సస్టైనబిలిటీ) కూడా మై హోమ్‌ గ్రీన్ బిల్డింగ్, సస్టైనబుల్ డెవలప్‌మెంట్‌పై ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రెజెంటేషన్‌లో అతను సస్టైనబిలిటీ రోడ్ మ్యాప్, గ్రీన్ విజన్, స్టేజ్‌వైజ్ డెవలప్‌మెంట్ ప్లాన్, ఇయర్‌వైజ్ గోల్ ప్లాన్‌ను వివరించారు. కాగా ఈ అవార్డులు మై హోం సంస్థ కృషికి ఫలితంగా వచ్చాయని, పర్యావరణం, స్థిరమైన అభివృద్ధి కోసం మై హోం చేస్తున్న కృషికి ఈ అవార్డులు ప్రోత్సాహకంగా నిలుస్తాయని ఆ సంస్థ పేర్కొంది.

 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి