Oil Price Down: వంట నూనెల ధరలు మరింత తగ్గనున్నాయా? ముఖ్యంగా మస్టర్డ్ ఆయిల్ చౌకగా మారనుందా? అంటే అవుననే హింట్ ఇస్తున్నాయి గ్లోబల్ మార్కెట్ ధరలు. అంతర్జాతీయ మార్కెట్‌లో నూనెల ధరలు తగ్గుముఖం పట్టాయి. చికాగో ఎక్స్ఛేంజ్ గత రాత్రి దాదాపు మూడు శాతం బలపడింది. ఈ ట్రేడింగ్ ప్రకారం ఆవనూనె, పామాయిల్ ధరలు మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి.
తగ్గనున్న పామాయిల్ ధర..
ఒకటిన్నర, రెండు నెలల క్రితం, కండ్లా క్రూడ్ పామాయిల్ డెలివరీ ధర టన్నుకు 2,040 డాలర్లుగా ఉంది. ఇప్పుడు అది టన్నుకు సుమారు 1,000 డాలర్లకు పడిపోయింది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్‌లో దీని(క్రూడ్ పామాయిల్) ధర కిలో రూ.86.50గా ఉంది. ఇది మరింత తగ్గే ఛాన్స్ ఉంది.
తగ్గనున్న ఆవ నూనె ధరలు..
మరోవైపు ఆవాల నూనె ధర కూడా తగ్గనుంది. ఈసారి ఆవాల కనీస మద్దతు ధర (MSP) క్వింటాల్‌కు రూ. 5,050 ఉంది. ఇది నెక్ట్స్ 200 నుంచి 300 పెరుగనుందనా అంచనా. దీని ప్రకారం ఆవనూనె ధర వచ్చే పంట తర్వాత కిలో రూ.125-130 వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు నిపుణులు
క్రూడ్ పామ్ ఆయిల్(CPO) ధర..
ప్రస్తుతం మార్కెట్లో CPO ధర కిలో రూ. 86.50 ఉంది. ఆవ నూనె రూ. 125-130గా ఉంది. దేశంలోని ప్రధాన నూనె ఉత్పత్తి సంస్థలు.. ప్రభుత్వం నుంచి ట్యాక్స్ రహితంగా ఎడిబుల్ ఆయిల్‌లను దిగుమతి చేసుకోవాలని డిమాండ్ చేసే బదులు, తగిన సలహాలు ఇవ్వడం ద్వారా నూనెగింజల ఉత్పత్తిని పెంచి స్వయం సమృద్ధి సాధించేలా చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. దేశంలోని నూనె గింజల ఉత్పత్తిదారులకు ఏ నిర్ణయం మేలు చేస్తుందో, ఏది నష్టమో ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు చెప్పాల్సిన బాధ్యత కూడా వారిదే.
విదేశాల్లో చౌకగా ఆయిల్..
ప్రభుత్వం సిపిఓ దిగుమతి సుంకం ధర క్వింటాల్‌కు రూ.100 తగ్గించగా, సోయా డెగం దిగుమతి సుంకం క్వింటాల్‌కు రూ. 50, పామోలిన్ ఆయిల్ క్వింటాల్‌కు రూ. 200 తగ్గింది. ఒకవైపు విదేశాల్లో నూనె గింజల మార్కెట్లు పతనమవుతుండగా.. దిగుమతి సుంకాన్ని కూడా తగ్గించాయి. ఈ పరిస్థితులన్నీ పూర్తిగా దిగుమతులపై ఆధారపడే దిశగా దేశాన్ని నడిపిస్తాయని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..