AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Multibagger Stocks: కేవలం 18 నెలల్లోనే బంపర్ రిటర్న్స్.. రూ. 1లక్షను రూ.18 లక్షలుగా మార్చిన పెన్నీ స్టాక్..

ఏడాదిన్నర క్రితం బీఎస్ఈలో ఈ స్టాక్ విలువ కేవలం 0.29 పైసలు మాత్రమే. ప్రస్తుతం దీని విలువ రూ.4.97గా నిలిచింది. గత వారం ఏప్రిల్ 12న ఈ స్టాక్ రూ.5.25 వద్ద ముగిసింది. ఈ విధంగా, గత 18 నెలల్లో, ఈ స్టాక్ 1,700 శాతం పెరిగి విపరీతమైన రాబడిని..

Multibagger Stocks: కేవలం 18 నెలల్లోనే బంపర్ రిటర్న్స్.. రూ. 1లక్షను రూ.18 లక్షలుగా మార్చిన పెన్నీ స్టాక్..
Stock Market
Venkata Chari
|

Updated on: Apr 16, 2022 | 7:59 AM

Share

Multibagger Stocks: షేర్ మార్కెట్‌(Share Market)లో రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం నిరంతరం పెరుగుతోంది. ముఖ్యంగా కరోనా కాలంలో డీమ్యాట్(Dmat) ఖాతాలు ఓపెన్ చేయడం చాలా ఈజీగా మారింది. రిటైల్ పెట్టుబడిదారులు తరచుగా మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి మంచి రాబడిని అందించగల పెన్నీ స్టాక్‌(Penny Stock)ల కోసం చూస్తుంటారు. తక్కువ ధర ఉన్న కొన్ని పెన్నీ స్టాక్‌లు ఆశ్చర్యపోయేలా అద్భుతమైన రాబడిని అందించిన రికార్డును కలిగి ఉన్నాయి. ఇలాంటి వాటిలో అడ్విక్ క్యాపిటల్ కూడా ఒకటి. ఇది పెట్టుబడిదారులకు మల్టీబ్యాగర్ రాబడిని అందించింది. ఏడాదిన్నర క్రితం, ఈ స్టాక్ విలువ బీఎస్‌ఈలో 0.29 పైసలు మాత్రమే. ప్రస్తుతం దీని విలువ రూ.4.97గా నిలిచింది. గత వారం ఏప్రిల్ 12న ఈ స్టాక్ రూ.5.25 వద్ద ముగిసింది. ఈ విధంగా, గత 18 నెలల్లో, ఈ స్టాక్ ఏకంగా 1,700 శాతం పెరిగి విపరీతమైన రాబడిని అందించింది. ఒక ఇన్వెస్టర్ 18 నెలల క్రితం ఈ మల్టీబ్యాగర్ స్టాక్‌లో కేవలం రూ. లక్ష మాత్రమే పెట్టుబడి పెట్టి ఉంటే, ప్రస్తుతం అతని పెట్టుబడి విలువ రూ.18 లక్షలకు పెరిగి ఉండేది.

ఆరు నెలల నుంచి ఏడాదిలోపే..

ఈ షేరు ఇటీవలి కాలంలో కూడా మంచి రాబడిని ఇచ్చింది. గత వారంలో ఈ షేరు 1.22 శాతం లాభపడింది. ఒక నెల గురించి మాట్లాడితే, ఈ కాలంలో అద్విక్ క్యాపిటల్ వాటా సుమారు 31 శాతం పెరిగింది. గత ఆరు నెలల్లో, ఇది దాదాపు 46 శాతం లాభపడగా, ఈ సంవత్సరం ఇప్పటివరకు, ఈ స్టాక్ ధర 71 శాతం పెరిగింది. ఇది గత ఏడాది కాలంలో కూడా మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చింది. ఈ సమయంలో దాని ధర దాదాపు 340 శాతం పెరిగింది.

వెనుకంజలోనే బీఎస్‌ఈ సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ..

గత 18 నెలల్లో, ఈ స్టాక్ సుమారు 1,700 శాతం లాభపడగా, అదే సమయంలో NSE నిఫ్టీ 50 ఇండెక్స్ 50 శాతం మాత్రమే పెరిగింది. అదేవిధంగా, ఈ 18 నెలల్లో BSE సెన్సెక్స్ దాదాపు 48 శాతం పెరిగింది. ప్రస్తుతం అద్విక్ క్యాపిటల్ మార్కెట్ క్యాప్ దాదాపు రూ.110 కోట్లుగా నిలిచింది. డిసెంబర్ 2021తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ లాభం రూ. 15 లక్షలు కాగా, ఆదాయం రూ. 6.13 కోట్లుగా మారింది.

గమనిక: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం చాలా రిస్క్‌‌తో కూడి ఉంటుంది. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టే ముందు, మీరు మీ స్వంత పరిశోధన చేయాలి. అలాగే మీ వ్యక్తిగత ఆర్థిక సలహాదారుని కచ్చితంగా సంప్రదించి, సరైన నిర్ణయం తీసుకోండి.

Also Read: Senco Gold IPO: ఐపీఓ కోసం సెబీకి దరఖాస్తు చేసుకున్న సెన్కో గోల్డ్.. రూ. 525 కోట్లు సమీకరించనున్నట్లు వెల్లడి..

Kim Jong-un: కిమ్ మామూలోడు కాదు.. హ్యాకర్స్‌తో క్రిప్టో కరెన్సీ దోపిడీ.. FBI సంచలన ప్రకటన..