AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Senco Gold IPO: ఐపీఓ కోసం సెబీకి దరఖాస్తు చేసుకున్న సెన్కో గోల్డ్.. రూ. 525 కోట్లు సమీకరించనున్నట్లు వెల్లడి..

జ్యువెలరీ రిటైలర్ సెన్కో గోల్డ్(Senco Gold ) లిమిటెడ్ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO) ద్వారా రూ . 525 కోట్లను సమీకరించేందుకు మార్కెట్ నియంత్రణ సంస్థ SEBI నుంచి అనుమతి కోరింది...

Senco Gold IPO: ఐపీఓ కోసం సెబీకి దరఖాస్తు చేసుకున్న సెన్కో గోల్డ్.. రూ. 525 కోట్లు సమీకరించనున్నట్లు వెల్లడి..
Ipo
Srinivas Chekkilla
|

Updated on: Apr 16, 2022 | 7:00 AM

Share

జ్యువెలరీ రిటైలర్ సెన్కో గోల్డ్(Senco Gold ) లిమిటెడ్ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO) ద్వారా రూ . 525 కోట్లను సమీకరించేందుకు మార్కెట్ నియంత్రణ సంస్థ SEBI నుంచి అనుమతి కోరింది. సెన్కో గోల్డ్ IPOకి సంబంధించిన ప్రారంభ పత్రాలను సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI)కి సమర్పించింది. రూ. 325 కోట్ల విలువైన కొత్త ఈక్విటీ షేర్లను జారీ చేయడంతో పాటు, ప్రస్తుత వాటాదారు SAIF పార్టనర్స్ ఇండియా వద్ద ఉన్న రూ. 200 కోట్ల విలువైన షేర్లను కూడా విక్రయిస్తుంది. ఇది కాకుండా ఐపీఓకు ముందు 65 కోట్ల రూపాయల విలువైన ఈక్విటీ షేర్లను కూడా కేటాయించాలని కంపెనీ యోచిస్తోంది.

సెన్కో తన వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను తీర్చడానికి IPO నుంచి రూ.240 కోట్లను ఉపయోగించనుంది. అదే సమయంలో మిగిలిన మొత్తం సాధారణ కంపెనీ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తామని పేర్కొంది. సెన్కో గోల్డ్‌కు దేశవ్యాప్తంగా 89 నగరాలు, పట్టణాలలో 127 అవుట్‌లెట్‌లు ఉన్నాయి, వాటిలో 57 ఫ్రాంచైజీ మోడల్‌లో నిర్వహిస్తున్నారు. ఇది కాకుండా, LIC IPO గురించి ఇటీవల పెద్ద వార్తలు వచ్చాయి. సమాచారం ప్రకారం, IPO తీసుకురావడానికి ముందు, ప్రభుత్వం 50-60 యాంకర్ పెట్టుబడిదారులను షార్ట్‌లిస్ట్ చేసింది. వీటిలో బ్లాక్‌రాక్, సాండ్స్ క్యాపిటల్స్, ఫిడెల్టీ ఇన్వెస్ట్‌మెంట్స్, స్టాండర్డ్ లైఫ్, జెపి మోర్గాన్ వంటి వెటరన్ ఇన్వెస్టర్లు ఉన్నారు.

యాంకర్ ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టేందుకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వాల్యుయేషన్‌ను రూ.7 లక్షల కోట్లుగా నిర్ణయించారు. మే 12 ప్రస్తుతం IPOకి గడువు. ఈ ఐపీఓకు సంబంధించి ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి వాల్యుయేషన్‌కు సంబంధించిన సమాచారాన్ని తీసుకుంది. ఈ కమిటీలో ప్రభుత్వ ఉన్నతాధికారులు ఉన్నారు. ఈ వాల్యుయేషన్‌కు సంబంధించి మర్చంట్ బ్యాంకర్‌తో చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వం 50-60 మంది యాంకర్ పెట్టుబడిదారులను షార్ట్‌లిస్ట్ చేసినప్పటికీ, వారిలో 25 శాతం మందిని తీసుకోవచ్చని సంబంధిత అధికారి తెలిపారు.

Read Also..  Olectra Electric Truck: త్వరలోనే రోడ్లపైకి ఒలెక్ట్రా హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్‌ ట్రక్స్‌.. ఫీచర్లేంటో తెలుసా?