
ప్రపంచ కుబేరుల్లో ఒకరు, రియలన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ ఏది చేసినా సంచలనమే. రూ. లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన ముకేష్ అంబానీ ఇప్పుడు మరో భారీ డీల్ సెట్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏకంగా రూ. 4000 కోట్ల పెట్టుబడితో కొత్త ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ముకేష్ అంబానీకి సంబంధించిన వ్యాపారాల్లో రియలన్స్ జియో ఒక అద్భుతమనే విషయం తెలిసిందే. టెలికం ఇండస్ట్రీ రంగంలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టిన సంస్థ జియో. భారత దేశంలో ప్రస్తుతం జియో మొదటి స్థానంలో దూసుకుపోతోంది. అత్యంత తక్కువ సమయంలో ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్లను సొంతం చేసుకుంది. ఇదిలా భారత్‌లో అగ్రగామిగా నిలిచిన జియ సేవలను ఇప్పుడు పొరుగు దేశంలో విస్తరించే ఆలోచనలో ముకేష్ అంబానీ ఉన్నట్లు తెలుస్తోంది.
అతి త్వరలోనే జియో సేవలు పొరుగున ఉన్న శ్రీలంకకు విస్తరించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో జియో ప్లాట్‌ఫారమ్‌లు ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికమ్యూనికేషన్ కంపెనీ అయిన శ్రీలంక టెలికాం పిఎల్‌సిలో వాటాను కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపిస్తోంది. శ్రీలంక టెలికాం పీఎల్‌సీలో వాటాను కొనుగోలు చేయడానికి ఆసక్ఇతి చూపించిన మొదటి మూడు బిడర్స్‌లో ముకేష్ అంబానీకి చెందిన జియో ప్లాట్‌ఫామ్ కూడా ఉంది. శ్రీలంక ప్రభుత్వం జనవరి 12వ తేదీన విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది.
శ్రీలంక టెలికం సంస్థ పీఎల్సీ ప్రస్తుత మార్కెట్ విలువ ఏకంగా రూ. 4000 కోట్లుగా ఉంది. ఇదిలా ఉంటే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న శ్రీలంక ప్రభుత్వం డబ్బులను సేకరించే పనిలో పడింది. ఇందులో భాగంగానే ఆర్థిక వ్యవస్థలోని పలు రంగాలను ప్రైవేటీకరించాలని చూస్తోంది. కొలంబో కేంద్రంగా పెట్టుబడిదారుల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానించింది. ఇప్పటి వరకు శ్రీలంక పీఎల్‌సీలో వాటాను కొనుగోలు చేయడానికి జియో ప్లాట్‌ఫారమ్‌లు, Gortune ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ హోల్డింగ్ లిమిటెడ్, Pettigo Comercio International సంస్థలు తమ బిడ్ లను దాఖలు చేశాయి. ప్రస్తుతం ఇవి పరిశీలనలో ఉన్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..