Mukesh Ambani Net Worth: భారీగా తగ్గిన ముఖేష్‌ అంబానీ సంపద.. కారణం ఏంటో తెలుసా..?

|

Mar 10, 2023 | 7:39 PM

గత కొన్ని రోజులుగా గౌతమ్ అదానీ, అదానీ గ్రూప్ చర్చలు పెరుగుతున్నాయి. ఈ చర్చలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్‌ అంబానీ చాలా వెనుకబడి ఉన్నారు. అయితే రిలయన్స్..

Mukesh Ambani Net Worth: భారీగా తగ్గిన ముఖేష్‌ అంబానీ సంపద.. కారణం ఏంటో తెలుసా..?
Mukesh Ambani
Follow us on

గత కొన్ని రోజులుగా గౌతమ్ అదానీ, అదానీ గ్రూప్ చర్చలు పెరుగుతున్నాయి. ఈ చర్చలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్‌ అంబానీ చాలా వెనుకబడి ఉన్నారు. అయితే రిలయన్స్, ముఖేష్ అంబానీ చర్చలు కొనసాగుతున్నాయి. నిజానికి రెండు రోజుల్లోనే రిలయన్స్ షేర్లు 4 శాతం పడిపోయాయి. నేడు దాదాపు ఒకటిన్నర శాతం క్షీణత కనిపించగా, ముఖేష్ అంబానీ సంపద రూ.27 వేల కోట్లకు పైగా తగ్గింది. దీంతో పాటు రెండు రోజుల పతనం కారణంగా రిలయన్స్ గ్రూప్ మార్కెట్ క్యాప్ కూడా దాదాపు 64 వేల కోట్ల రూపాయలు తగ్గింది. ఈ రోజు స్టాక్ మార్కెట్‌లో రిలయన్స్ ఎలాంటి గణాంకాలు కనిపించాయి.. ముఖేష్ అంబానీ సంపదపై ఎలాంటి ప్రభావం కనిపించిందో తెలుసుకుందాం.

రిలయన్స్‌ దాదాపు ఒకటిన్నర శాతం నష్టపోయింది:

ఈరోజు స్టాక్ మార్కెట్లో 670 పాయింట్ల క్షీణత నమోదైంది. ఇందులో రిలయన్స్ స్టాక్ దాదాపు ఒకటిన్నర శాతం క్షీణించింది. డేటా ప్రకారం.. రిలయన్స్ స్టాక్ ఒకటిన్నర శాతం పతనంతో రూ. 2323.15 వద్ద ముగిసింది. ఈరోజు కంపెనీ షేరు రూ.2343.30 పతనంతో ప్రారంభమైంది. ట్రేడింగ్ సెషన్‌లో కంపెనీ స్టాక్ రూ.2315.20కి చేరుకుంది. ఒక రోజు క్రితం కంపెనీ షేరు రూ.2360.15 వద్ద ముగిసింది.

రిలయన్స్‌కు 25 వేల కోట్ల నష్టం:

రిలయన్స్ షేర్ల పతనం కారణంగా కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.25 వేల కోట్లకు పైగా నష్టపోయింది. డేటా ప్రకారం.. కంపెనీ మార్కెట్ క్యాప్ ఒక రోజు క్రితం రూ.15,96,756.56 కోట్లుగా ఉంది. అది నేడు రూ.15,71,724.26 కోట్లకు తగ్గింది. అంటే కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.25,032.3 కోట్లు తగ్గింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రాబోయే రోజుల్లో రిలయన్స్ షేర్లలో మరింత క్షీణత, కంపెనీ మార్కెట్ క్యాప్ మరింత పడిపోయే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి