Zelio Eeva EV Scooter: ఒక్కసారి చార్జ్ చేస్తే అన్నవరం టూ వైజాగ్ సింపుల్‌గా చెక్కెయ్యచ్చు.. చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రయ్..రయ్

|

Mar 13, 2023 | 7:15 PM

ఇప్పుడు జెలియో కంపెనీ తన సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్, ఈవాను విడుదల చేసింది. కంపెనీ అందించే అత్యుత్తమ స్కూటర్ అని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతేకాదు అతి తక్కువ ధరకు ఇది వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నాయి. ఈవా స్కూటర్ మార్కెట్‌లో ఏ కంపెనీ ఇవ్వలేనంత తక్కువ ధరకు అందుబాటులో ఉంది.

Zelio Eeva EV Scooter: ఒక్కసారి చార్జ్ చేస్తే అన్నవరం టూ వైజాగ్ సింపుల్‌గా చెక్కెయ్యచ్చు.. చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రయ్..రయ్
Zelio Eeva
Follow us on

ఎలక్ట్రిక్ స్కూటర్‌ల కోసం మార్కెట్‌లో పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి ఆటోమొబైల్ తయారీదారులు నిరంతరం కొత్త మోడళ్లను విడుదల చేస్తున్నారు. ఈ-స్కూటర్లు ఇప్పుడు గొప్ప తగ్గింపులతో పాటు అత్యాధునిక ఫీచర్లతో అందిస్తున్నారు. ఇప్పుడు జెలియో కంపెనీ తన సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్, ఈవాను విడుదల చేసింది. కంపెనీ అందించే అత్యుత్తమ స్కూటర్ అని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతేకాదు అతి తక్కువ ధరకు ఇది వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నాయి. ఈవా స్కూటర్ మార్కెట్‌లో ఏ కంపెనీ ఇవ్వలేనంత తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఈ స్కూటర్ ధర కేవలం రూ.54,000 మాత్రమే. అంతే కాదు ఈ స్కూటర్‌ను ఓ సారి చార్జ్ చేస్తే 60 నుంచి 120 కిలో మీటర్ల పరిధి అందిస్తుంది. అంటే ఈ స్కూటర్‌ను ఓ సారి చార్జి చేసి అన్నవరం నుంచి విశాఖపట్టణం ఈజీగా వెళ్లిపోవచ్చని అని మాట. ఈ స్కూటర్ గురించి మరిన్ని విశేషాలను ఓ సారి తెలుసుకుందాం.

రెండు వేరియంట్లల్లో అందుబాటులోకి

ఈ స్కూటర్ కంపెనీ నుంచి రెండు వేరియేషన్లలో అందుబాటులో ఉంది. ఈవా మొదటి వెర్షన్ 28 ఏహెచ్, 48 వీ బ్యాటరీ ప్యాక్‌తో అందుబాటులో ఉంది. రెండో వెర్షన్ 60 వీ బ్యాటరీ ప్యాక్‌తో అందుబాటులో ఉంది. కంపెనీ ప్రతినిధులు వెల్లడించిన దాని ప్రకారం ఈస్కూటర్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120 కిలో మీటర్ల మైలేజ్ వస్తుంది. అయితే మినిమం మైలేజ్ 60 కిలోమీటర్లుగా ఉంది. ఈ స్కూటర్‌లో ఫాస్ట్ చార్జింగ్ ఆప్షన్ లేదు. ఈ స్కూటర్‌కను ఫుల్‌గా చార్జ్ చేయాలంటే 4-5 గంటల సమయం పడుతుంది. 

ఈవా స్కూటర్ ఫీచర్లు ఇవే

బీఎల్‌డీసీ మోటర్‌తో వచ్చే ఈ స్కూటర్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌తో వస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్‌తో వస్తుంది. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, యాంటీ థెఫ్ట్ అలారం, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, ఎల్ఈడీ డీఆర్ఎల్, డిజిటల్ ట్రిప్ మీటర్, పుష్ బటన్ స్టార్ట్, ఫ్రంట్ స్టోరేజ్, రివర్స్ పార్కింగ్ మోడ్ వంటి కొన్ని ప్రత్యేక ఫీచర్లు ఈ స్కూటర్‌లో ఉన్నాయి. 

ఇవి కూడా చదవండి

రూ.1600తో బుకింగ్

జెలియో ఈవా చాలా తక్కువ ధరలో వినియోగదారులకు అందనుంది. ఈవా స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర 54 వేల రూపాయలు మాత్రమే. కేవలం రూ. 1600 చెల్లించి మీరు ఈ స్కూటర్‌ను ప్రీ బుక్ చేసుకోవచ్చు. ఈవా మార్కెట్‌లోకి ప్రవేశించడం వల్ల హోండా, బజాజ్, ఓలా, ఏథర్‌తో సహా అనేక పెద్ద కంపెనీలు గణనీయమైన సవాలును ఎదుర్కొంటాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..