AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Money9: బిజినెస్ ఇన్వెస్ట్‌ గ్రూపులతో జాగ్రత్త.. జస్ట్.. సలహా అంటూ సర్వం కోల్పోయేలా చేస్తారు..

బిజినెస్ ఇన్వెస్టర్లు.. నిపుణులైనట్లుగా ప్రజలకు ఏవేంటో సలహాలు, సూచనలు ఇస్తారు. ఫలానా స్టాక్‌లో డబ్బు పెట్టుబడి పెట్టమంటూ వారికి సూచిస్తుంటారు.

Money9: బిజినెస్ ఇన్వెస్ట్‌ గ్రూపులతో జాగ్రత్త.. జస్ట్.. సలహా అంటూ సర్వం కోల్పోయేలా చేస్తారు..
Investment Club
Shaik Madar Saheb
|

Updated on: Aug 05, 2022 | 8:29 PM

Share

Money9: పెట్టుబడి, సలహాలు ఇచ్చే వ్యక్తులతో సోషల్ మీడియా మొత్తం నిండిపోయింది. ముఖ్యంగా ఈ ప్లాట్‌ఫాంలలో పెద్ద సంఖ్యలో వ్యక్తులు చురుకుగా ఉన్నారు. వారు నిపుణులైనట్లుగా ప్రజలకు ఏవేంటో సలహాలు, సూచనలు ఇస్తారు. ఫలానా స్టాక్‌లో డబ్బు పెట్టుబడి పెట్టమంటూ వారికి సూచిస్తుంటారు. ప్రారంభంలో ఈ వ్యక్తులు ఉచితంగా చిట్కాలను ఇస్తారు. తరువాత వారు రుసుము వసూలు చేయడం ప్రారంభిస్తారు. కొందరు వచ్చిన లాభంలో 40 శాతం వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. కానీ.. నష్టం జరిగితే మాత్రం కన్నెత్తి కూడా చూడరు.. వెంటనే అదృశ్యమవుతారు.

భారతదేశంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై theglobalstatistics.com నివేదిక ప్రకారం దేశంలో 53 మిలియన్ల మంది WhatsApp వినియోగదారులు, 370 మిలియన్ల మంది టెలిగ్రామ్ వినియోగదారులు ఉన్నారు. ఈ ఫోరమ్‌లలో పెద్ద సంఖ్యలో వ్యక్తులు చురుకుగా ఉన్నారు. ఈ కన్సల్టెంట్లలో ఎక్కువ మంది వినియోగదారుల నుంచి డబ్బు వసూలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాంటి వారిపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ క్రమం తప్పకుండా చర్యలు తీసుకుంటోంది. కొంతమంది వ్యక్తులు రూ. 1-2 విలువైన పెన్నీ స్టాక్‌లను పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి, ధరలను తారుమారు చేసి, బుకింగ్ ప్రాఫిట్‌ల తర్వాత నిష్క్రమిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. అటువంటి పరిస్థితిలో కొత్త పెట్టుబడిదారులు.. నష్టాల ఊబిలో చిక్కుకుపోతారు. ఇంకా మరింత గందరగోళానికి కూడా గురయ్యే అవకాశం ఉంది.

పెట్టుబడిదారులను దోచుకోవడానికి సోషల్ మీడియా ఎలా ఉపయోగించబడుతుందనే దాని గురించి మరింత తెలుసుకోవడానికి Money9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి. మీరు ఈ లింక్ ద్వారా Money9 యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు .

ఇవి కూడా చదవండి

మనీ9 అంటే ఏమిటి?

Money9 OTT యాప్ ఇప్పుడు Google Play, iOSలో అందుబాటులో ఉంది. వ్యక్తిగత ఫైనాన్స్‌కు సంబంధించిన ప్రతి సమాచారం ఇందులో ఏడు భాషల్లో అందుబాటులో ఉంటుంది. ఇదొక ప్రత్యేకమైన ప్రయోగం. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఆస్తి, పన్ను, ఆర్థిక విధానాలు మొదలైన వాటిలో సమాచారాన్ని వివరంగా అందించడం జరుగుతుంది. ఇది మీ ఆదాయ, వ్యయాలను ప్రభావితం చేస్తుంది. కావున ఆలస్యం చేయవద్దు.. Money9 యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.. మీ ఆర్థిక అవగాహనను సులభంగా పెంచుకోండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..