AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లైఫ్‌ ఇన్సూరెన్స్‌.. రెండు ప్రీమియంలు కట్టకపోతే ఏమవుతుంది? పాలసీదారులు తెలుసుకోవాల్సిన నిజం!

జీవిత బీమా పాలసీల్లో ప్రీమియంలను సమయానికి చెల్లించడం అత్యంత కీలకం. అయితే కొన్ని సందర్భాల్లో ప్రీమియం చెల్లింపులు మిస్ అయితే పాలసీ వెంటనే రద్దు కావడం కాదు. బీమా కంపెనీలు ముందుగా గ్రేస్ పీరియడ్‌ను అందిస్తాయి. ఈ సమయంలో పాలసీ చెల్లుబాటులోనే ఉంటుంది.

లైఫ్‌ ఇన్సూరెన్స్‌.. రెండు ప్రీమియంలు కట్టకపోతే ఏమవుతుంది? పాలసీదారులు తెలుసుకోవాల్సిన నిజం!
Life Insurance Policy Premi
SN Pasha
|

Updated on: May 23, 2026 | 7:37 AM

Share

జీవిత బీమా పాలసీ తీసుకున్న తర్వాత చాలా మంది ప్రీమియంలను క్రమం తప్పకుండా చెల్లిస్తూ ఉంటారు. అయితే ఉద్యోగ మార్పులు, ఆర్థిక ఒత్తిడులు లేదా సాధారణ నిర్లక్ష్యం కారణంగా కొన్నిసార్లు ప్రీమియం చెల్లింపులు ఆలస్యమవుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో పాలసీ వెంటనే రద్దవుతుందా? రెండు ప్రీమియంలు మిస్ అయితే బీమా ప్రయోజనాలు పూర్తిగా పోతాయా? అనే సందేహాలు చాలామందిలో కనిపిస్తున్నాయి. నిపుణులు చెబుతున్నదేమిటంటే బీమా కంపెనీలు వెంటనే పాలసీని రద్దు చేయకుండా ముందుగా గ్రేస్ పీరియడ్ అనే వెసులుబాటు ఇస్తాయి.

సాధారణంగా నెలవారీ ప్రీమియం చెల్లింపులకు 15 రోజుల గడువు, త్రైమాసికం, అర్ధవార్షికం లేదా వార్షిక చెల్లింపులకు 30 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఈ సమయంలో ప్రీమియం చెల్లించకపోయినా పాలసీ అమలులోనే ఉంటుంది. అయితే ఈ గడువు ముగిసిన తర్వాత కూడా చెల్లింపులు జరగకపోతే పాలసీ లాప్స్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీల్లో ఇది చాలా కీలకం. పాలసీ లాప్స్ అయిన తర్వాత ఏదైనా అనూహ్య సంఘటన జరిగినా బీమా క్లెయిమ్ సాధ్యం కాకపోవచ్చు.

సాంప్రదాయ సేవింగ్స్ లేదా ఎండోవ్మెంట్ పాలసీల్లో పరిస్థితి కొంత భిన్నంగా ఉంటుంది. కొన్ని సంవత్సరాల పాటు కనీస ప్రీమియంలు చెల్లించి ఉంటే, పాలసీ పెయిడ్-అప్ స్థితికి మారుతుంది. అంటే పూర్తి కవరేజీ లేకపోయినా, కొంత ప్రయోజనం కొనసాగుతుంది. కానీ కనీస ప్రీమియం కాలం పూర్తికాకముందే చెల్లింపులు ఆగిపోతే పాలసీ పూర్తిగా రద్దయ్యే అవకాశం ఉంది. అయితే చాలా బీమా సంస్థలు గడువు ముగిసిన పాలసీలను తిరిగి పునరుద్ధరించుకునే అవకాశాన్ని కూడా ఇస్తున్నాయి. బకాయి ప్రీమియంలను వడ్డీతో చెల్లించడం ద్వారా పాలసీని మళ్లీ యాక్టివ్ చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఆరోగ్య పరీక్షలు లేదా తాజా వైద్య వివరాలు కూడా అవసరం కావచ్చు.

ఆర్థిక నిపుణుల సూచన ప్రకారం ఆటో-డెబిట్ సదుపాయాలు, మొబైల్ రిమైండర్లు, పాలసీ స్టేటస్‌ను తరచుగా చెక్ చేయడం వంటి అలవాట్లు ప్రీమియం మిస్ కాకుండా సహాయపడతాయి. ఎందుకంటే జీవిత బీమా కేవలం పెట్టుబడి మాత్రమే కాదు, కుటుంబానికి ఆర్థిక భద్రతను అందించే కీలక రక్షణ వ్యవస్థ కూడా.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ రద్దు..? ఐపీఎల్‌ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు..!
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ రద్దు..? ఐపీఎల్‌ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు..!
ఉదయం లేవగానే నిమ్మరసం నీళ్లు తాగుతున్నారా? ఇది తెలుసుకోండి!
ఉదయం లేవగానే నిమ్మరసం నీళ్లు తాగుతున్నారా? ఇది తెలుసుకోండి!
LG స్మార్ట్ టీవీలు మన మాటల్ని రికార్డ్ చేస్తున్నాయా? నిజమెంత?
LG స్మార్ట్ టీవీలు మన మాటల్ని రికార్డ్ చేస్తున్నాయా? నిజమెంత?
వేళ్ల మధ్య ఖాళీ ఉందా? మీ వ్యక్తిత్వం, ఆర్థిక పరిస్థితి ఇలా..
వేళ్ల మధ్య ఖాళీ ఉందా? మీ వ్యక్తిత్వం, ఆర్థిక పరిస్థితి ఇలా..
గూగుల్ మ్యాప్స్‌కు ట్రాఫిక్ ఎలా తెలుస్తుంది? GPS ఎలా పనిచేస్తుంది
గూగుల్ మ్యాప్స్‌కు ట్రాఫిక్ ఎలా తెలుస్తుంది? GPS ఎలా పనిచేస్తుంది
ఇల్లు కడుతున్నారా? పిల్లర్ సైజు ఎంత ఉండాలో తెలుసుకోండి.. పొరపాటున
ఇల్లు కడుతున్నారా? పిల్లర్ సైజు ఎంత ఉండాలో తెలుసుకోండి.. పొరపాటున
బుద్ధుని తలపై ఉన్నది జుట్టు అనుకుంటున్నారా.. 108 నత్తల త్యాగం..
బుద్ధుని తలపై ఉన్నది జుట్టు అనుకుంటున్నారా.. 108 నత్తల త్యాగం..
8 జట్లతో హెచ్‌సీఏ మహిళల అండర్-19 టీ20 టోర్నీకి రంగం సిద్ధం..!
8 జట్లతో హెచ్‌సీఏ మహిళల అండర్-19 టీ20 టోర్నీకి రంగం సిద్ధం..!
Numerology: ఈ తేదీల్లో పుట్టన వారు నిజాయితీకి కేరాఫ్..!
Numerology: ఈ తేదీల్లో పుట్టన వారు నిజాయితీకి కేరాఫ్..!
WPL 2027: జనవరి 14 నుంచి డబ్ల్యూపీఎల్ సమరం..
WPL 2027: జనవరి 14 నుంచి డబ్ల్యూపీఎల్ సమరం..