
ప్రతీ మధ్యతరగతి వ్యక్తికి సొంతింటి కల, ఓ బైక్ లేదా కారు.. ఇలాంటి కలలు ఉంటాయి. వాటిని నెరవేర్చుకునేందుకు సరైన ప్రణాళికలతో పొదుపు చేస్తే సరిపోతుందని బిజినెస్ నిపుణులు అంటున్నారు. ధనవంతులు కావాలనే ప్రతి ఒక్కరి కలను నిజం చేసుకోవడానికి, ముఖ్యంగా రిటైర్‌మెంట్ కోసం పది కోట్ల సంపదను సృష్టించుకునేందుకు సరైన పెట్టుబడి వ్యూహాల చాలా ముఖ్యమని అన్నారు. పెట్టుబడులు వీలైనంత త్వరగా ప్రారంభించడం వల్ల దీర్ఘకాలంలో అద్భుతమైన రాబడిని చూడొచ్చునని చెప్పారు.
ఇది చదవండి: అప్పులు కాదు.. మీ ఇంటి నిండా డబ్బులే.! ఈ 8 సూత్రాలు పాటిస్తే మీరే కోటీశ్వరులు..
ఉదాహరణకు ఒక వ్యక్తి నెలకు రూ. 15 వేలు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(SIP)లో 15 శాతం రాబడితో 15 సంవత్సరాలు పెట్టుబడి పెడితే, అతడి పోర్ట్‌ఫోలియో రూ. 1 కోటి అవుతుంది. ఈ పెట్టుబడిని మరో 15 సంవత్సరాలు.. అంటే మొత్తం 30 సంవత్సరాల పాటు కొనసాగిస్తే, పోర్ట్‌ఫోలియో విలువ రూ. 10.5 కోట్లకు చేరుతుందని బిజినెస్ నిపుణులు అంటున్నారు. ఇది వినడానికి అసాధ్యంగా అనిపించినా, ఏ SIP క్యాలిక్యులేటర్‌లోనైనా ఇది స్పష్టంగా ఉంటుందన్నారు.
ద్రవ్యోల్బణం అనేది మన నియంత్రణలో ఉండదు. పెట్టుబడి పెట్టడం, ఎంత కాలం పెట్టుబడి పెట్టాలి, ఎప్పుడు ప్రారంభించాలి లాంటివి మన నియంత్రణలో ఉంటాయి. గత 25 ఏళ్లలో భారత సెన్సెక్స్ స్టాక్ మార్కెట్ 16.2 శాతం రాబడిని ఇవ్వగా, మ్యూచువల్ ఫండ్స్ 70 నుంచి 100 రెట్లు పెరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. కనీసం 15-20 సంవత్సరాల పాటు మార్కెట్‌లో ఉంటే 12-15 శాతం రాబడి సాధించడం పెద్ద కష్టమేమీ కాదని చెప్పారు. పెట్టుబడులలో సమయం ‘టైమ్ ఈజ్ మనీ’ అనే రూల్ కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకుంటే భవిష్యత్తులో టెన్షన్ లేని జీవితాన్ని గడపవచ్చు.
ఇది చదవండి: ‘ఆ సినిమా పూర్తయ్యాక.. తారక్.! నాలుగేళ్లు నీ మొహం ఇక చూపించకు అన్నాడు..’
గమనిక: షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. పెట్టుబడి పెట్టే ముందు దయచేసి మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించండి. నష్టాలకు టీవీ9 బాధ్యత వహించదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి