AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tata Nexon: ఆ టాటా ఈవీ కారుపై మతిపయే డిస్కౌంట్.. ఏకంగా రూ.3.15 లక్షల తగ్గింపు

మార్కెట్‌లో పెరిగిన పోటీ నేపథ్యంలో కొన్ని కంపెనీలు ఈవీ కార్ల కొనుగోలుపై కూడా ఆఫర్లను అందిస్తున్నాయి. తాజాగా టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకు సంబంధించిన ఫేస్లిఫ్ట్, ప్రీ-ఫేస్లిఫ్ట్ వెర్షన్లకు తగ్గింపులను ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ ఎంవై 2023తో పరిమిత సంఖ్యలో యూనిట్లకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది.

Tata Nexon: ఆ టాటా ఈవీ కారుపై మతిపయే డిస్కౌంట్.. ఏకంగా రూ.3.15 లక్షల తగ్గింపు
Tata Nexon Ev
Nikhil
|

Updated on: Mar 11, 2024 | 5:00 PM

Share

భారతదేశంలో ఇటీవల కాలంలో ఈవీ కార్ల అమ్మకాలు పెరిగాయి. పెరిగిన అనూహ్య డిమాండ్ మేరకు అన్ని కంపెనీలు సరికొత్త ఈవీ కార్లను రిలీజ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్‌ను ఎక్కువగా ఈవీ కార్లు ముంచెత్తుతున్నాయి. మార్కెట్‌లో పెరిగిన పోటీ నేపథ్యంలో కొన్ని కంపెనీలు ఈవీ కార్ల కొనుగోలుపై కూడా ఆఫర్లను అందిస్తున్నాయి. తాజాగా టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకు సంబంధించిన ఫేస్లిఫ్ట్, ప్రీ-ఫేస్లిఫ్ట్ వెర్షన్లకు తగ్గింపులను ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ ఎంవై 2023తో పరిమిత సంఖ్యలో యూనిట్లకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. అనేక బ్రాండ్లు తమ మోడల్ పై డిస్కౌంట్లను అందిస్తున్నందున ఈ ప్రమోషన్ ముఖ్యమైన సమయంలో వస్తుంది. ఈ తగ్గింపుల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

టాటా నెక్సాన్ ఈవీకు సంబంధించిన ప్రీ-ఫేస్క్రిఫ్ట్ వెర్షన్ రూ. 3.15 లక్షల భారీ తగ్గింపును పొందుతోంది. ప్రైమ్ రూ. 2.30 లక్షల తగ్గింపుతో లభిస్తుంది. ఇందులో రూ. 50,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఉంటుంది. అలాగే నెక్సాన్ ఈవీ మ్యాక్స్ రూ. 50,000 ఎక్స్చేంజ్ బోనస్‌తో పాటు రూ. 2.65 లక్షల మరింత ఎక్కువ తగ్గింపును పొందుతుంది. టాటా నెక్సాన్ ఈవీకు సంబంధించిన ప్రీ-ఫేస్క్రిఫ్ట్ వెర్షన్ 30.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. అలాగే ఈ కారు 129 హెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటారుకు శక్తినిస్తుంది. దీని వల్ల వాహనం ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 312 కి.మీ వరకు ప్రయాణించవచ్చు. మరోవైపు, ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన మాక్స్ వేరియంట్ పెద్ద 40.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఈ కారు 143 హెచ్‌పీ ఎలక్ట్రిక్ మోటారుతో పనిచేస్తుంది. అలాగే ఒక ఛార్జ్‌పై  436 కిమీల పరిధిని అందించగలదు. అలాగే టాటా నెక్సాన్ ఈవీ 2023 మోడల్ పై రూ. 50,000 వరకు తగ్గింపును అందిస్తోంది. అలాగే ఎంవై 2024 యూనిట్లు రూ.20,000 గ్రీన్ బోనస్‌తో అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ మోడల్‌కు ప్రస్తుతం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకు సంబంధించఫేస్లిఫ్ట్ వెర్షన్‌పై ఎలాంటి క్యాష్ డిస్కౌంట్ లేదా ఎక్స్చేంజ్ బోనస్ లేదు.

టాటా నెక్సాన్ ఈవీకు సంబంధించిన ఆధునిక డిజైన్, అప్‌డేటెడ్ ఫీచర్లతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విభిన్న బ్యాటరీ ప్యాక్ తో రెండు వేరియంట్లలో లభిస్తుంది. మీడియం రేంజ్ (ఎంఆర్), లాంగ్ రేంజ్ (ఎల్ఆర్) వెర్షన్లు అందుబాటులో ఉన్నాయి. మీడియం రేంజ్ మోడల్స్‌లో 30.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. అలాగే ఈ కారు 325 కి.మీల పరిధిని అందిస్తుంది. మరోవైపు లాంగ్ రేంజ్ వేరియంట్లో 40.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. అలాగే 465 కిమీ పరిధిని అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!