త్వరపడండి.. అదిరిపోయే ఆఫర్.. రూ. 1.82 లక్షలకే మారుతీ వ్యాగన్R‌ని ఇంటికి తెచ్చుకోవచ్చు.!

|

Apr 18, 2023 | 4:52 PM

ప్రముఖ ఆన్‌లైన్ సెకండ్ హ్యాండ్ కార్ల విక్రయించే వెబ్‌సైట్లలో ఈ మారుతి వ్యాగన్ ఆర్‌పై అదిరిపోయే డీల్స్ ఉన్నాయి. మారుతి వ్యాగన్ R ఎక్స్-షోరూమ్ ధర రూ.5.51 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. దాన్ని మీరు చౌకైన ధరకే కొనుగోలు చేయవచ్చు.. అదెలాగో ఈ వార్త చూసేయండి..

త్వరపడండి.. అదిరిపోయే ఆఫర్.. రూ. 1.82 లక్షలకే మారుతీ వ్యాగన్R‌ని ఇంటికి తెచ్చుకోవచ్చు.!
Maruti Wagon R
Follow us on

దేశంలో ఎక్కువగా అమ్ముడయ్యే కార్లలో ఒకటి మారుతీ వ్యాగన్ ఆర్. ఈ కారుకు మార్కెట్‌లో భలే డిమాండ్ ఉంది. మార్చి 2023 నాటికి, వ్యాగన్ R భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన రెండవ కారు. గత నెలలో 17,305 యూనిట్లను విక్రయించింది ఆ సంస్థ. మరి మీరు కూడా ఈ కారును కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే.. మీకోసం ఓ అదిరిపోయే ఆఫర్‌ను తీసుకొచ్చేశాం. ప్రముఖ ఆన్‌లైన్ సెకండ్ హ్యాండ్ కార్ల విక్రయించే వెబ్‌సైట్లలో ఈ మారుతి వ్యాగన్ ఆర్‌పై అదిరిపోయే డీల్స్ ఉన్నాయి. మారుతి వ్యాగన్ R ఎక్స్-షోరూమ్ ధర రూ.5.51 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అంత డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కేవలం రూ. 1.82 లక్షలకు మాత్రమే కొనుగోలు చేయవచ్చు. మరి ఆ ఆఫర్లు ఏంటో తెలుసుకుందామా..!

  1. మారుతి వ్యాగన్ ఆర్ Carwale ఆఫర్: ఈ మారుతీ వ్యాగన్ ఆర్ మొదటి డీల్ కార్‌వేల్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ఇక్కడ ఈ కారును మీరు కేవలం రూ. 2 లక్షలకే కొనుగోలు చేయవచ్చు. 2012 మోడలయిన ఈ వ్యాగన్ ఆర్.. ఇప్పటివరకు 66,000 కిలోమీటర్లు ప్రయాణించింది. ఈ కారు నోయిడా సర్కిల్‌లో లభిస్తుంది.
  2. మారుతి వ్యాగన్ ఆర్ OLX ఆఫర్: ఓఎల్‌ఎక్స్‌లో మారుతి వ్యాగన్ ఆర్‌పై మంచి డీల్ అందుబాటులో ఉంది. 2012 మోడల్ వ్యాగన్ ఆర్‌ను రూ. 1.85 లక్షలకే కొనుగోలు చేయవచ్చు. పెట్రోల్‌తో నడిచే ఈ కారు నోయిడా సర్కిల్‌లో 82,000 కిలోమీటర్లు ప్రయాణించింది.
  3. మారుతి వ్యాగన్ ఆర్ Cars 24 ఆఫర్: కార్స్24లో మారుతి వ్యాగన్ R 2010 మోడల్‌ కేవలం రూ.1.82 లక్షలకే లభిస్తోంది. ఈ కారు ఇప్పటివరకు 14,629 కిలోమీటర్లు ప్రయాణించింది. అదే సమయంలో, దీని బీమా సెప్టెంబర్ 2023 వరకు చెల్లుబాటు అవుతుంది. కారు ఢిల్లీలో రిజిస్టర్ చేయబడింది.
  4. కాగా, సెకండ్ హ్యాండ్ బైక్‌లు లేదా కార్లు కొనేటప్పుడు బైక్ యజమానిని కలవకుండా, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ స్వయంగా ధృవీకరించకుండా ఆర్ధిక లావాదేవీలు చేయకండి. పైన సమాచారం కేవలం సదరు వెబ్‌సైట్‌లోని వివరాల మేరకు ఇచ్చినది మాత్రమే.
  5. ఇవి కూడా చదవండి