Maruti Suzuki: 17,362 కార్లను రీకాల్ చేసిన మారుతీ సుజుకి.. ఆ సమస్యను ఫిక్స్ చేయకుండా బయట తిరగొద్దని హెచ్చరిక..

| Edited By: Anil kumar poka

Jan 18, 2023 | 6:35 PM

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకి కి సంబంధించిన కార్లలో ఈ ఎయిర్ బ్యాగ్ కంట్రోలర్ల వ్యవస్థలో ఏదో సాంకేతిక లోపం వచ్చింది. దీంతో ఆ కంపెనీకి చెందిన దాదాపు 17,362 యూనిట్లను వెనక్కి పిలిచింది.

Maruti Suzuki: 17,362 కార్లను రీకాల్ చేసిన మారుతీ సుజుకి.. ఆ సమస్యను ఫిక్స్ చేయకుండా బయట తిరగొద్దని హెచ్చరిక..
Maruti Suzuki
Follow us on

కార్లలో సెఫ్టీకి ఎయిర్ బ్యాగ్ సదుపాయం ఉంటుంది. ఎప్పుడైన అనుకోని సందర్భంలో కారు క్రాష్ అయినప్పుడు లోపల ఉండే ప్రయాణికుల ప్రాణాలను కాపాడటంలో ఈ ఎయిర్ బాగ్స్ కీలకంగా వ్యవహరిస్తాయి. అన్ని కంపెనీలు కూడా ఈ ఎయిర్ బ్యాగ్స్ పనితీరును క్షుణ్ణంగా తనిఖీ చేసాకే మార్కెట్లోకి విడుదల చేస్తాయి. అయితే దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకి కి సంబంధించిన కార్లలో ఈ ఎయిర్ బ్యాగ్ కంట్రోలర్ల వ్యవస్థలో ఏదో సాంకేతిక లోపం వచ్చింది. దీంతో ఆ కంపెనీకి చెందిన దాదాపు 17,362 యూనిట్లను వెనక్కి పిలిచింది. వాటిని తనిఖీ చేసి, మళ్లీ రీ ఫిట్ చేసేలా తన వినియోగదారులకు సమాచారాన్ని పంపింది.

దాదాపు అన్ని ప్రధాన మోడళ్లు..

లోపభూయిష్టంగా ఉన్న ఎయిర్ బ్యాగ్ కంట్రోలర్లను తనిఖీ చేసి, వాటిని ఆధునికీకరించేందుకు మారుతి సుజుకి నుంచి ప్రత్యేకమైన ప్రకటన బుధవారం వెలువడింది. ఆల్టో కే10, బ్రెజ్జా, బాలెనో, గ్రాండ్ విటారా, ఎస్ ప్రెసో, ఈకో, వంటి దాదాపు 17,362 యూనిట్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. 2022 డిసెంబర్ 8 నుంచి 2023 జనవరి 12 మధ్య తయారైన మోడళ్లలో ఈ లోపం తలెత్తినట్లు వివరించింది.

ఉచితంగానే..

ఆయా కార్లలో తలెత్తిన సమస్యను ఉచితంగానే తనిఖీ చేసి, ఫిక్స్ చేస్తామని మారుతీ సుజుకి కంపెనీ తమ వినియోగదారులకు తెలిపింది.

ఇవి కూడా చదవండి

అప్పటి వరకూ నడపవద్దు..

కంట్రోలర్ సమస్యలతో ఉన్నమోడళ్లను తనిఖీ చేసి తిరిగి ఫిక్స్ చేసే వరకూ బయట నడపవద్దని తమ వినియోగదారులను ఆ కంపెనీ కోరింది. ఎయిర్ బ్యాగ్ సమస్యతో బయటకు వెళ్తే అనుకోని విధంగా కారు క్రాష్ అయితే ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవని.. తద్వారా ప్రాణాలకు ప్రమాదం ఏర్పడవచ్చని హెచ్చరించింది. వినియోగదారులు తమకు సమీపంలోని మారుతీ సుజుకి అధీకృత వర్క్ షాపుల నుంచి సమాచారం వస్తుందని, వెంటనే కారు ఆ సెంటర్ లో సరండెర్ చేయాలిన సూచిస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..