Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maruti Suzuki: డీజిల్ వాహనాల ఉత్పత్తిని నిలివేయనున్న మారుతీ..! కాలుష్య నిబంధనలే కారణమా..

మారుతీ సుజుకి ఇండియా.. డీజిల్ వాహనాలను ఉత్పత్తి  చేసే ఆలోచన లేదని తెలిపింది. 2023లో అమల్లోకి రానున్న కాలుష్య ఉద్గారాల నూతన నిబంధనల వల్ల డీజిల్‌ వాహనాల ధరలు పెరిగి, వాటి వినియోగం మరింత తగ్గుతుందని కంపెనీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు....

Maruti Suzuki: డీజిల్ వాహనాల ఉత్పత్తిని నిలివేయనున్న మారుతీ..! కాలుష్య నిబంధనలే కారణమా..
Maruthi
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Nov 22, 2021 | 8:27 AM

మారుతీ సుజుకి ఇండియా.. డీజిల్ వాహనాలను ఉత్పత్తి  చేసే ఆలోచన లేదని తెలిపింది. 2023లో అమల్లోకి రానున్న కాలుష్య ఉద్గారాల నూతన నిబంధనల వల్ల డీజిల్‌ వాహనాల ధరలు పెరిగి, వాటి వినియోగం మరింత తగ్గుతుందని కంపెనీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా మార్కెట్ పెట్రోల్ కార్ల వైపు క్రమంగా మారుతుందని చెప్పారు. ” మేము డీజిల్ వాహనాల ఉత్పత్తి నిలిపివేయాలనికుంటున్నాం కస్టమర్ డిమాండ్ ఉంటే ఆలోచిస్తాం” MSI చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ సీవీ రామన్ చెప్పారు. అధిక మైలేజీ ఇచ్చే పెట్రోల్‌ ఇంజిన్‌తో నడిచే కార్ల ఉత్పత్తిపైనే కంపెనీ దృషి సారిస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికే సెలెరియోకు అమర్చిన కే10-సి ఇంజిన్‌ ఈ తరహాలో రూపొందించిందేనని, లీటరుకు 26.68 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని వివరించారు. కాలుష్య ఉద్గారాల తగ్గింపు కోసం తన వంతు బాధ్యతగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

భవిష్యత్తులో హైబ్రిడ్‌, విద్యుత్తు వాహనాలను సంస్థ ఆవిష్కరిస్తుందని తెలిపారు. ఇప్పుడు 10 శాతం ఇథనాల్‌ కలిపిన ఇంధనానికి అనువైన ఇంజిన్లున్నాయని, 2023 నాటికి 20 శాతం ఇథనాల్‌ కలుస్తుంది కనుక, అందుకు తగిన ఇంజిన్‌ రూపొందిస్తామన్నారు. మొత్తం ప్రయాణికుల వాహనాల్లో డీజిల్‌ విభాగం వాటా 17 శాతమన్నది పరిశ్రమ అంచనా. 2013-14లో ఇది 60 శాతం కావడం గమనార్హం.2020 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చిన బీఎస్‌ 6 ఉద్గార ప్రమాణాల వల్ల, దేశీయంగా వాహన తయారీ సంస్థలు, డీజిల్‌ వాహనాలను తగ్గించుకోగా, ఎంఎస్‌ఐ పూర్తిగా దూరమైంది. ప్రస్తుతం బీఎస్‌ 6 ప్రమాణాల 1 లీటర్‌, 1.2 లీటర్‌, 1.5 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్లతోనే ఎంఎస్‌ఐ వాహనాలు రూపొందుతున్నాయి. 7 మోడళ్లను సీఎన్‌జీ ఇంజిన్లతోనూ సంస్థ ఉత్పత్తి చేస్తున్నారు.

“మేము ఇప్పటికే జరుగుతున్న మా పవర్‌ట్రెయిన్‌లను మెరుగుపరుస్తామని మేము చెప్పాం. మేము ఇప్పటికే అధిక స్థాయిలో తేలికపాటి హైబ్రిడ్ సాంకేతికతను కలిగి ఉన్నాము. భవిష్యత్తులో సాంకేతికతతో మరిన్ని బ్రాండ్లు వస్తాయి.” అని రామన్ చెప్పాడు.

Read Also.. Multibagger Stock: లక్ష రూపాయలు పెడితే ఆరు కోట్లు వచ్చాయి.. ఆ స్టాక్ ఏంటో తెలుసా..