Maruti Suzuki: మారుతీ సుజుకీ కీలక నిర్ణయం.. అక్కడ తయారీ ప్లాంట్ ఏర్పాటు.. రూ.35వేల కోట్ల పెట్టుబడి
తయారీ పరిశ్రమలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బలమైన నాయకత్వం, నిరంతర మద్దతు కారణంగా భారత ఆటోమోటివ్ మార్కెట్ నిరంతరం విస్తరిస్తోందని తోషిహిరో అన్నారు. దీని ఆధారంగా భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మోటారు వాహనాల మార్కెట్‌గా అవతరించిందన్నారు. భారత్‌లో ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా గణనీయంగా పెంచామని తోషిహిరో తెలిపారు. 10 సంవత్సరాల క్రితంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2023-24లో వాహన ఉత్పత్తిలో..
మారుతీ సుజుకీ ఇండియా గుజరాత్‌లో రెండో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు రూ. 35,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు సుజుకీ మోటార్ కార్పొరేషన్ చైర్మన్ తోషిహిరో సుజుకీ బుధవారం తెలిపారు. 2030-31 నాటికి వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 40 లక్షల యూనిట్లకు పైగా పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ (VGGS) 10వ ఎడిషన్‌లో మాట్లాడుతూ, తోషిహిరో ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం సంవత్సరానికి 10 లక్షల యూనిట్లుగా ఉంటుందని చెప్పారు. గుజరాత్‌లో రెండో కార్ల ప్లాంట్‌ను నిర్మించేందుకు రూ.35,000 కోట్ల పెట్టుబడులు పెడతామని, ఇది ప్రతి సంవత్సరం 10 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేస్తుందని తోషిహిరో చెప్పారు.
కొత్త ప్లాంట్ 5 సంవత్సరాలలో ప్రారంభం:
2028-29 ఆర్థిక సంవత్సరంలో కొత్త ప్లాంట్ కార్యకలాపాలు ప్రారంభించాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. దీని లొకేషన్ వివరాలు, ఉత్పత్తి చేయబోయే మోడల్స్ నిర్ణీత సమయంలో షేర్ చేస్తారు. దీంతో గుజరాత్‌లో వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 20 లక్షల యూనిట్లుగా మారనుందని తోషిహిరో తెలిపారు. సుజుకి మోటార్ గుజరాత్‌లో 10 లక్షల యూనిట్లను, మరో కొత్త ప్లాంట్‌లో 10 లక్షల యూనిట్లను తయారు చేయనుంది. మారుతీ సుజుకి ఇండియాలో సుజుకి మోటార్‌కు దాదాపు 58 శాతం వాటా ఉంది.
ఉత్పత్తిలో నిరంతర పెరుగుదల:
తయారీ పరిశ్రమలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బలమైన నాయకత్వం, నిరంతర మద్దతు కారణంగా భారత ఆటోమోటివ్ మార్కెట్ నిరంతరం విస్తరిస్తోందని తోషిహిరో అన్నారు. దీని ఆధారంగా భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మోటారు వాహనాల మార్కెట్‌గా అవతరించిందన్నారు. భారత్‌లో ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా గణనీయంగా పెంచామని తోషిహిరో తెలిపారు. 10 సంవత్సరాల క్రితంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2023-24లో వాహన ఉత్పత్తిలో 1.7 రెట్లు, ఎగుమతి అమ్మకాలు 2.6 రెట్లు పెరుగుతాయని తాము ఆశిస్తున్నామని అన్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోెసం ఇక్కడ క్లిక్ చేయండి..