Maruti Suzuki: మారుతి సుజుకీ కారు కొనుగోలు చేసిన వారికి అదిరిపోయే శుభవార్త.. గడువు పొడిగిస్తూ నిర్ణయం..!

Maruti Suzuki: దేశీ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకీ ఇండియా తాజాగా తన వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త వినిపించింది. ఉచిత సర్వీస్‌, వారంటీ గడువును..

Maruti Suzuki: మారుతి సుజుకీ కారు కొనుగోలు చేసిన వారికి అదిరిపోయే శుభవార్త.. గడువు పొడిగిస్తూ నిర్ణయం..!
Maruti Suzuki

Edited By: Shaik Madar Saheb

Updated on: Jul 02, 2021 | 9:17 AM

Maruti Suzuki: దేశీ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకీ ఇండియా తాజాగా తన వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త వినిపించింది. ఉచిత సర్వీస్‌, వారంటీ గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో మారుతి కారు కొన్నవారికి ఊరట కలుగనుంది. 2021 మార్చి 15 నుంచి జూన్‌ 30వ తేదీ వరకు ఉచిత సర్వీసు, వారంటీ గడువు ముగిసిన వారికి మాత్రమే ఈ ప్రయోజనం చేకూరనుంది. 2021 జూలై 31 వరకు వారంటీ, వెహికల్ సర్వీస్ పీరియడ్‌ను పొడిగించినట్లు మారుతి సుజుకీ ప్రకటించింది. వినియోగదారుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పార్థో బెనర్జీ తెలిపారు. కరోనా వైరస్, లాక్ డౌన్ వంటి ప్రతికూల పరిస్థితుల్లో మారుతి సుజుకీ కంపెనీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల చాలా మంది కస్టమర్లకు ప్రయోజనం కలుగనుంది. ఈ నిర్ణయం వల్ల కార్లు కొనుగోలు చేసిన వారికి మేలు జరుగనుంది.

అలాగే వర్క్‌షాప్స్‌కు వెళ్లలేని వారు ఉంటే కంపెనీ వారికి ఉచిత పికప్‌, డ్రప్‌ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంచిందని ఆయన తెలిపారు. ఇకపోతే కంపెనీ జూన్ నెలలో 1,47,368 యూనిట్లను విక్రయించింది.

ఇవీ కూడా చదవండి:

Food Oil: సామాన్యులకు భారీ ఊరట.. మరింత దిగిరానున్న వంట నూనె ధరలు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

Electric Wheeler: కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. ఎల‌క్ట్రిక్ వాహ‌నాలకు ఇచ్చే స‌బ్సిడీ గ‌డువు పెంపు

SBI Alert: ఎస్‌బీఐ వినియోగదారులకు షాకింగ్‌ న్యూస్‌.. నేటి నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలు