Maruti Suzuki: దీపావళికి ముందు ఈ కారు ధర భారీగా తగ్గింది.. ఎంతంటే..

Maruti Suzuki: మారుతి సుజుకి ఎర్టిగా పెట్రోల్, పెట్రోల్- CNG వేరియంట్లలో లభిస్తుంది. ఇది VXi CNG, ZXi CNG ట్రిమ్ ఆప్షన్లలో వస్తుంది. ఈ MPV యొక్క CNG వేరియంట్ల ధర వరుసగా రూ.10.76 లక్షలు ( ఎక్స్ - షోరూమ్ )..

Maruti Suzuki: దీపావళికి ముందు ఈ కారు ధర భారీగా తగ్గింది.. ఎంతంటే..

Updated on: Oct 11, 2025 | 2:40 PM

Maruti Suzuki: కేంద్రం జీఎస్టీ తగ్గిన తర్వాత కార్ల ధరలు భారీగా తగ్గిన విషయం తెలిందే. అలాగే ఇప్పుడు దీపావళి పండగ వస్తోంది. ఇందులో భాగంగా కార్ల ధరలపై మరింతగా డిస్కౌంట్ అందిస్తున్నాయి కంపెనీలు. ఎర్టిగా మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న MPV లలో ఒకటి. అరీనా రిటైల్ నెట్‌వర్క్ ద్వారా విక్రయిస్తున్న మారుతి సుజుకి ఎర్టిగా గత కొన్ని సంవత్సరాలుగా డిమాండ్ పెరుగుతున్న విభాగంలోకి వస్తుంది. సెప్టెంబర్ 22 నుండి భారతదేశం అంతటా అమల్లోకి వచ్చిన కొత్త GST కింద పన్ను మార్పుల తర్వాత మారుతి సుజుకి MPV ధరలను తగ్గించింది . ఈ GST తగ్గింపుతో మారుతి సుజుకి ఎర్టిగా అన్ని వేరియంట్‌లు రూ. 47,000 వరకు చౌకగా మారాయి.

ఇది కూడా చదవండి: New Electric Scooters: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 212 కి.మీ.. ధర ఎంతో తెలుసా?

మారుతి సుజుకి ఎర్టిగా ధర:

మారుతి సుజుకి ఎర్టిగా ధరలను వేరియంట్లను బట్టి రూ.32,000 నుండి రూ. 47,000 వరకు తగ్గించారు. ఇది మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికలలో లభిస్తుంది. మారుతి సుజుకి ఎర్టిగా ఇప్పుడు రూ.8.80 లక్షల ( ఎక్స్-షోరూమ్ ) ప్రారంభ ధరకు వస్తుంది. ఇది GST తగ్గింపుకు ముందు రూ. 9.12 లక్షలు ( ఎక్స్-షోరూమ్ ) ఉండేది. మారుతి సుజుకి ఎర్టిగా MPV టాప్ – ఎండ్ ధర ఇప్పుడు రూ.12.94 లక్షలు ( ఎక్స్-షోరూమ్ ). ఇది మునుపటి టాప్-ఎండ్ ధర రూ.13.41 లక్షల ( ఎక్స్-షోరూమ్ ) నుండి పెరిగింది.

ఇవి కూడా చదవండి

మారుతి సుజుకి ఎర్టిగా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ధర:

GST 2.0 తగ్గింపుతో మారుతి సుజుకి ఎర్టిగా మాన్యువల్ వేరియంట్ల ధర ఇప్పుడు వేరియంట్‌ను బట్టి రూ.8.80 లక్షలు (ఎక్స్-షోరూమ్), రూ.11.83 లక్షలు (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. ధర తగ్గింపు వేరియంట్‌ను బట్టి రూ.32,000,రూ.42,000 మధ్య ఉంటుంది.

మరోవైపు మారుతి సుజుకి ఎర్టిగా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ -ఎక్విప్డ్ వెర్షన్‌ల ధర ఇప్పుడు రూ.11.20 లక్షలు ( ఎక్స్-షోరూమ్ ), రూ.12.94 లక్షలు ( ఎక్స్-షోరూమ్ ) మధ్య ఉంది. ఇది రూ.న11.61 లక్షలు – రూ.13.41 లక్షలు ( ఎక్స్-షోరూమ్ ) నుండి తగ్గింది. మారుతి సుజుకి ఎర్టిగా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్‌ల ధర తగ్గింపు రూ.41,000 -రూ. 47,000 మధ్య ఉంటుంది.

ఇది కూడా చదవండి: School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. దీపావళికి భారీగా సెలవులు.. ఎన్ని రోజులో తెలుసా?

మారుతి సుజుకి ఎర్టిగా ఇంజిన్:

మారుతి సుజుకి ఎర్టిగా పెట్రోల్, పెట్రోల్- CNG వేరియంట్లలో లభిస్తుంది. ఇది VXi CNG, ZXi CNG ట్రిమ్ ఆప్షన్లలో వస్తుంది. ఈ MPV యొక్క CNG వేరియంట్ల ధర వరుసగా రూ.10.76 లక్షలు ( ఎక్స్ – షోరూమ్ ) రూ.11.83 లక్షలు ( ఎక్స్-షోరూమ్ ) గా ఉంది. జీఎస్టీ తగ్గింపు తర్వాత వరుసగా రూ.40,000, రూ.42,000.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి