Mahindra Ties With Jio-bp: జియో బీపీతో జత కట్టిన మహీంద్రా.. అందుకేనా..
ఎలక్ట్రిక్ వాహనాల (EV) కోసం కలిసి పని చేయాలని దిగ్గజ సంస్థలైన రిలయన్స్, మహీంద్రా గ్రూపులు నిర్ణయించాయి...

ఎలక్ట్రిక్ వాహనాల (EV) కోసం కలిసి పని చేయాలని దిగ్గజ సంస్థలైన రిలయన్స్, మహీంద్రా గ్రూపులు నిర్ణయించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, యూకే బీపీపీఎల్‌సీ మధ్య మొబిలిటీ జాయింట్ వెంచర్ అయిన జియో-బిపితో మెమోరాండం-ఆఫ్-అండర్స్టాండింగ్ (ఎంఓయు) సంతకం చేసినట్లు మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) బుధవారం ప్రకటించింది. ఈ మేరకు ఈవీ సెగ్మెంట్‌లో ఈ రెండు సంస్థలు పరస్పర సహకారం అందించుకుంటాయి.
నారిలయన్స్ ఇండస్ట్రీస్ సబ్సిడరీగా జియో బీపీ పేరుతో ఫ్యూయల్ స్టేషన్లు నడిపిస్తోంది. ఇక్కడ పెట్రోలు, డీజిల్‌తో పాటు ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఛార్జింగ్ చేసుకునే అవకాశం ఉంది. తొలి ఫ్యూయల్ స్టేషన్‌ని ఇటీవల మహారాష్ట్రలో ప్రారంభించింది. ఈరోజు స్టాక్ ఎక్స్ఛేంజీలకు మహీంద్రా & మహీంద్రా (M&M) రెగ్యులేటరీ ఫైలింగ్ అందజేసింది. ఈ డీల్ ఎలక్ట్రిక్ వాహనాలు, ఆపరేషన్స్ సపోర్ట్ సిస్టమ్స్, సాఫ్ట్‌వేర్ కోసం డేటాబేస్ సహకరించుకోనున్నాయి.
ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా ఇటీవలే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్రారంభించింది. ఆటో మొదలు బస్సుల వరకు మహీంద్రా పలు రకాల వాహనాలను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. అయితే ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి ఛార్జింగ్ పాయింట్ల కొరత దేశ వ్యాప్తంగా అతి పెద్ద సమస్యగా ఉంది. ఈ ఒప్పందంతో ఆ సమస్యకు పరిష్కారం లభించనుంది. మహీంద్రా గ్రూప్, దాని ఛానెల్ పార్టనర్ లొకేషన్‌లు జియో-బీపీ మొబిలిటీ స్టేషన్‌లు, EV ఛార్జింగ్, స్వాపింగ్ పాయింట్‌ల ఏర్పాటు కోసం ఇప్పటికే ఉన్న Jio-bp స్టేషన్‌లను ఉపయోగించుకుంటారు. అక్టోబర్‌లో భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఛార్జింగ్, బ్యాటరీ మార్పిడి కోసం సేవలను అందించడం ప్రారంభించినట్లు Jio-bp తెలిపింది. బుధవారం M&M షేర్లు BSEలో 1.83 శాతం పెరిగింది.
Read Also.. Amazon: ఐదు గంటలపాటు నిలిచిపోయిన అమెజాన్ వెబ్ సర్వీసులు.. ఎక్కడంటే..