LPG Cylinder Prices: రూ.103.50 పెరిగిన కమర్షియల్ సిలిండర్ల ధర.. నేటి నుంచి అమల్లోకి..

కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను బుధవారం రూ.103.50 పెంచారు. పెరిగిన ధర నేటి నుంచి అమల్లోకి రానుంది. ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ల ధర ఈరోజు నుంచి రూ. 2,104గా ఉంది...

LPG Cylinder Prices: రూ.103.50 పెరిగిన కమర్షియల్ సిలిండర్ల ధర.. నేటి నుంచి అమల్లోకి..
Cylinder

Updated on: Dec 01, 2021 | 9:51 AM

కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను బుధవారం రూ.103.50 పెంచారు. పెరిగిన ధర నేటి నుంచి అమల్లోకి రానుంది. ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ల ధర ఈరోజు నుంచి రూ. 2,104గా ఉంది. ఇంతకు ముందు రూ. 2000.50గా ఉంది. కోల్‌కతాలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.101 పెరిగి రూ.2,174.5కి చేరుకుంది.

గతంలో దీని ధర రూ. 2073.5గా ఉంది. ముంబైలో వాణిజ్య గ్యాస్ ధర రూ.2,051కి పెరిగింది. గతంలో ధర రూ.1,950 ఉండగా ఇప్పుడు రూ.101 పెరిగింది. అదే సమయంలో చెన్నైలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.2,234.50కి చేరుకుంది. ఇంతకు ముందు ధర రూ.2,133గా ఉంది.

అయితే పెట్రోలియం కంపెనీలు గృహవినియోగ ఎల్‌పీజీ సిలిండర్ల ధర పెంచకపోవడం ఉపశమనాన్ని కలిగించింది. ఢిల్లీలో సబ్సిడీ లేని 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధర రూ. 899.50 కాగా, కొత్త 5 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధర రూ. 502గా ఉంది. చమురు మార్కెటింగ్ కంపెనీ వారు ప్రతి నెలా కొత్త రేట్లు జారీ చేస్తారు. ఎల్‌పీజీ సిలిండర్ ధరను తనిఖీ చేయడానికి, మీరు వెబ్‌సైట్‌కి వెళ్లాలి. మీరు https://iocl.com/Products/IndaneGas.aspx లింక్‌లో మీ నగరం యొక్క గ్యాస్ సిలిండర్‌ల ధరను తనిఖీ చేయవచ్చు.

 

Read Also.. Gold Bonds: గోల్డ్ బాండ్స్‎లో పెట్టుబడి పెట్టడం మంచిదేనా.. దీని వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే..