LPG Cylinder Charges: మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేశారా? డెలివరీ బాయ్ అదనంగా డబ్బు వసూలు చేస్తున్నాడా? ఇలా ఫిర్యాదు చేయండి
ప్రతి ఒక్కరికి వంట గ్యాస్ సిలిండర్ అవసరమే. ప్రస్తుత రోజుల్లో అందరి ఇళ్లల్లో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ఉంటుంది. గ్యాస్ సిలిండర్ ధర ఎంత పెరిగినా కొనక తప్పదు. సామాన్యుడి ఇంట్లో కూడా గ్యాస్ సిలిండర్..
ప్రతి ఒక్కరికి వంట గ్యాస్ సిలిండర్ అవసరమే. ప్రస్తుత రోజుల్లో అందరి ఇళ్లల్లో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ఉంటుంది. గ్యాస్ సిలిండర్ ధర ఎంత పెరిగినా కొనక తప్పదు. సామాన్యుడి ఇంట్లో కూడా గ్యాస్ సిలిండర్ ఉంటుంది. సిలిండర్ అయిపోగానే బుక్ చేసుకోవడం అనేది తప్పనిసరి. సామాన్యుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని కొందరు సిలిండర్ డెలివరీ వ్యక్తులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ సిలిండర్ డెలివరీ కస్టమర్ల నుంచి అదనపు డబ్బులు వసూలు చేస్తున్నట్లు కంపెనీకి ఇప్పటికే చాలా ఫిర్యాదులు అందుతున్నట్లు సమాచారం.ఒక కస్టమర్ నుంచి రూ.25-30 అదనంగా వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే ఈ విధంగా అదనపు డబ్బు అడగడం చట్టవిరుద్ధం. డెలివరీ చేసే వ్యక్తి అదనంగా డబ్బులు అడిగినట్లయితే ఫిర్యాదు చేయాలని గ్యాస్ కంపెనీలు వినియోగదారులకు సూచిస్తున్నాయి. ఈ విషయాన్ని గతంలో నుంచి కూడా వినియోగదారులకు సూచిస్తున్నాయి.
గ్యాస్ సేవలను భారత్ గ్యాస్, ఇండెన్ గ్యాస్, హిందుస్థాన్ పెట్రోలియం (హెచ్‌పీ) అందిస్తున్నాయి. అందులో భారత్ గ్యాస్, హిందుస్థాన్ పెట్రోలియం కస్టమర్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ సిలిండర్లను ఇంటింటికీ పంపిణీ చేసే ఉద్యోగులకు నెలవారీ జీతం చెల్లిస్తారు. ఆ తర్వాత కూడా కస్టమర్ల నుంచి అదనంగా డబ్బులు డిమాండ్ చేస్తారని, ఎవరైనా అలాంటి డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నంబర్‌లో ఫిర్యాదు చేయవచ్చని గ్యాస్ ఏజెన్సీ ఉద్యోగి తెలిపారు. ఇంకో విషయం ఏంటంటే అదనపు డబ్బులు అడిగిన గ్యాస్ డెలివరి చేసే వ్యక్తి పేరును అడగడం మర్చిపోవద్దని గ్యాస్ కంపెనీలు సూచిస్తున్నాయి.
టోల్ ఫ్రీ నంబర్:
భారత్ గ్యాస్ – 1800224344
ఇండన్ గ్యాస్ – 18002333555
హిందుస్థాన్ పెట్రోలియం (హెచ్‌పీ) – 18002333555
అయితే ఫిర్యాదు చేసే వినియోగదారుడు ముందుగా ఈ టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలి. వారి కస్టమర్ నంబర్, చిరునామా, అదనపు డబ్బును అభ్యర్థించిన ఉద్యోగి పేరును పేర్కొనాలి. గ్యాస్ కంపెనీ ఈ విషయాన్ని పరిశీలించి వినియోగదారులకు డబ్బు అదనంగా చెల్లించేలా చూస్తుంది. అలాగే సంబంధిత ఉద్యోగిపై తగు చర్యలు తీసుకుంటామని గ్యాస్ కంపెనీలు చెబుతున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..