AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea: కేవలం రూ.10 వేల కంటే తక్కువ పెట్టుబడి.. నెలకు రూ.40 వేలు అందించే బిజినెస్‌లు!

మీ వ్యాపార కలను వదులుకోవద్దు! లక్షల ఖర్చు లేకుండా కేవలం రూ.10 వేల లోపు పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించవచ్చు. ఊరగాయల వ్యాపారం, మొబైల్ రిపేర్, క్లౌడ్ కిచెన్ వంటి లాభదాయకమైన ఐడియాలతో నెలకు రూ.20- 40 వేలు సంపాదించే అవకాశం ఉంది.

Business Idea: కేవలం రూ.10 వేల కంటే తక్కువ పెట్టుబడి.. నెలకు రూ.40 వేలు అందించే బిజినెస్‌లు!
Indian Currency 2
SN Pasha
|

Updated on: Jan 30, 2026 | 11:31 PM

Share

మీ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తుంటే ఈ ఐడియాలు మీకు ఉపయోగపడొచ్చు. లక్షల రూపాయలు ఖర్చవుతుందని భావించి చాలా మంది తమ బిజినెస్‌ కలలను వదులుకుంటారు. మీరు కూడా అదే కారణంతో మీ వ్యాపార కలను వదులుకుంటున్నట్లయితే.. ఆగండి. మీరు కేవలం రూ.10 వేల కంటే తక్కువ ఖర్చుతో వ్యాపారాలను ప్రారంభించవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

పిక్కిల్స్‌

రుచి అనే మాయాజాలం మీ చేతుల్లో ఉంటే, దేశీ ఊరగాయల వ్యాపారం బెస్ట్‌ ఆప్షన్‌. మీరు ఈ వ్యాపారాన్ని రూ.5 నుంచి రూ.7 వేలతోనే ప్రారంభించి నెలకు రూ.30, 40 వేలు సంపాదించవచ్చు. అయితే దీని కోసం మీరు ఊరగాయలను తయారు చేయాలో తెలుసుకోవాలి. ఈ రోజుల్లో దేశీ రుచిగల ఉత్పత్తులు మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి.

మొబైల్ రిపేర్‌

మీకు మొబైల్స్ గురించి అవగాహన ఉండి, వాటిని రిపేర్ చేయగలిగితే, ఈ వ్యాపారం మీకు ఉత్తమమైనది. దీనిలో మీరు నెలకు రూ.20 నుంచి రూ.30 వేలు సంపాదించవచ్చు. దీని కోసం మీకు పెద్ద దుకాణం అవసరం లేదు.

క్లౌడ్ కిచెన్

మీరు వంటను ఇష్టపడితే ఈ అభిరుచిని వ్యాపారంగా కూడా మార్చుకోవచ్చు. దీని కోసం మీకు ఏ దుకాణం లేదా హోటల్ అవసరం లేదు. మీరు మీ ఇంటి వంటగది నుండి ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఈ రోజుల్లో చాలా మంది క్లౌడ్ కిచెన్ వ్యాపారంలో రాణిస్తున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి