AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business idea: ఈ వ్యాపారం చేస్తే నష్టం అనేదే ఉండదు.. భారీగా ఆదాయం పొందొచ్చు.

బిజినెస్‌ అనగానే చాలా మంది ఎక్కడ నష్టం వస్తుందోనన్న అనుమానంతో వెనకడుగు వేస్తుంటారు. అయితే మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా వ్యాపారాన్ని ప్లాన్‌ చేసుకుంటే లాభాలు పొందొచ్చు. అలాంటి ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రపంచాన్ని భయపెడుతోన్న వాటిలో ప్లాస్టిక్‌ ప్రధానమైంది. రోజురోజుకీ పెరిగిపోతున్న..

Business idea: ఈ వ్యాపారం చేస్తే నష్టం అనేదే ఉండదు.. భారీగా ఆదాయం పొందొచ్చు.
Business Idea
Narender Vaitla
|

Updated on: Jan 11, 2024 | 7:58 PM

Share

దేశంలో యువత ఆలోచన మారుతోంది. 9 టూ 5 జాబ్‌ బోర్‌గా ఫీలవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఏదైనా ఛాలెంజింగ్‌గా ఉండాలని ఆశిస్తున్నారు. కెరీర్‌ను కూడా ఛాలెంచింగ్‌గా ఉండేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు. అందుకే చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి మరీ బిజినెస్ ప్లాన్ చేస్తున్నారు.

అయితే బిజినెస్‌ అనగానే చాలా మంది ఎక్కడ నష్టం వస్తుందోనన్న అనుమానంతో వెనకడుగు వేస్తుంటారు. అయితే మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా వ్యాపారాన్ని ప్లాన్‌ చేసుకుంటే లాభాలు పొందొచ్చు. అలాంటి ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రపంచాన్ని భయపెడుతోన్న వాటిలో ప్లాస్టిక్‌ ప్రధానమైంది. రోజురోజుకీ పెరిగిపోతున్న ప్లాస్టిక్‌ భూతం పర్యావరణంతో పాటు మనిషి ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతోంది. దీంతో ప్లాస్టిక్‌ రహిత సమాజాన్ని నిర్మించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగానే పేపర్‌ గ్లాసులు పెద్ద ఎత్తున అందుబాటులోకి వస్తున్నాయి. ఈ అవసరాన్ని మంచి వ్యాపారంగా మార్చుకోవచ్చు. ఇంతకీ పేపర్‌ కప్‌ తయారీ యూనిట్‌ను ఎలా ఏర్పాటు చేసుకోవాలి.? ఇందుకు ఎంత ఖర్చు అవుతుంది.? ఎంత ఆదాయం పొందొచ్చు.? ఇప్పుడు తెలుసుకుందాం..

పేపర్‌ కప్‌ తయారీ యూనిట్‌ను తక్కువ బడ్జెట్‌తో ప్రారంభించవచ్చు. ఇందుకోసం పెద్దగా పెట్టుబడి కూడా అవసరం లేదు. పేపర్‌ కప్స్‌ తయారీకి స్మాల్‌ స్కేల్ సైజ్‌ మిషిన్స్‌ అవసరపడతాయి. వీటి ధర రూ. 1 లక్ష నుంచి అందుబాటులో ఉంటాయి. ఎక్కువ కప్స్‌ను తయారు చేసే పెద్ద మిషన్‌ అయితే రూ. 10.70 లక్షల వరకు ఉంటుంది. వీటితో పాటు పేపర్‌ కప్‌ తయారీ యూనిట్‌కు కొంత ఖాళీ స్థలం, విద్యుత్‌ సదుపాయం ఉండాలి.

ఇదిలా ఉంటే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న ముద్ర లోన్స్‌ ద్వారా మన పెట్టుబడిలో 75 శాతం తక్కువ వడ్డీకే రుణం పొందొచ్చు. మిగతా 25 శాతం మనం సొంతంగా పెట్టుబడి పెట్టుకోవాల్సి ఉంటుంది. మొదట్లో వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే చిన్న మిషిన్లతో ప్రారంభించడం బెటర్‌గా చెప్పొచ్చు. ఇక పేపర్‌ కప్స్‌ తయారీకి రా మెటిరీయల్ అవసరపడుతుంది. పేపర్‌ రీల్స్‌తో పాటు బాటమ్‌ రీల్స్‌ అవసరపడుతాయి. పేపర్‌ రీల్స్‌ కిలో ధర రూ.10, బాటమ్‌ రీల్స్‌ కిలోకు రూ. 80 వరకు పలుకుతోంది. ఇక ప్రతీ ఏటా సరాసరి 2 కోట్లకుపైగా పేపర్‌ కప్‌లను తయారు చేయొచ్చు. ఒక్క పేపర్‌ కప్‌ 30 పైసలు అనుకున్న ఏడాదికి ఎంత ఆదాయం ఆర్జించవచ్చో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!