భారతదేశపు అత్యంత పొడవైన రైలు వీడియోను పంచుకుంటూ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ దాని ప్రత్యేకతలను తెలియజేశారు. ఇది 3.5 కిలోమీటర్ల పొడవైన రైలు. ఈ ట్రైన్ 6 ఇంజన్లతో నడుస్తుంది. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే భారతదేశపు అతి పొడవైన రైలును గత ఏడాది ఆగస్టు 15న ప్రారంభించింది. ఈ రైలుకు 295 వ్యాగన్లు జోడించారు. ఈ రైలు పొడవు 3.5 కిలోమీటర్లు. ఇది సూపర్ వాసుకి అనే సరుకు రవాణా రైలు, అలాగే ఇది 25,962 టన్నుల బరువుతో నడుస్తుంది.
సూపర్ వాస్కీ రైలుకు సంబంధించి, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఒక ట్వీట్‌లో మాట్లాడుతూ.. సూపర్ వాసుకి భారతదేశంలోనే అత్యంత పొడవైన లోడ్ చేయబడిన రైలు. ఇందులో 6 ఇంజన్లు ఉన్నాయని, 295 వ్యాగన్లు కూడా జోడించినట్లు తెలిపారు. దీనితో పాటు కొఠారి రోడ్ నుంచి ఈ రైలు ప్రయాణిస్తున్న వీడియో కూడా షేర్ చేశారు. అయితే సూపర్ వాసుకి రైలులోని ఇతర విశేషాలు ఏమిటో తెలుసుకుందాం.
ఐదు గూడ్స్ రైళ్లను కలిపి ఈ రైలును తయారు చేశారు. సూపర్ వాసుకి తీసుకువచ్చే బొగ్గు మొత్తం 3,000 మెగావాట్ల పవర్ ప్లాంట్‌ను రోజంతా ఉపయోగించడానికి సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. ఇది 90 కార్ల గూడ్స్ రైలు సామర్థ్యం కంటే మూడు రెట్లు ఎక్కువ. ఇది ఒకేసారి 9,000 టన్నుల బొగ్గును మోసుకెళ్లగలదు.
267 కి.మీ దూరాన్ని కేవలం 11.20 గంటల్లో చేరుకోవడం ఈ రైలు ప్రత్యేకత. అదే సమయంలో ఈ రైలు వేగం కూడా సాధారణ సరుకు రవాణా రైళ్ల కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ రైలు చాలా వేగంగా నడుస్తుంది. సరుకు రవాణా పరంగా ఇది గొప్ప ఉపశమనం కలిగిస్తుందని చెప్పారు.
Super Vasuki – India’s longest (3.5km) loaded train run with 6 Locos & 295 wagons and of 25,962 tonnes gross weight.#AmritMahotsav pic.twitter.com/3oeTAivToY
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) August 16, 2022
భారతదేశ అభివృద్ధిలో రైల్వే పెద్ద పాత్ర పోషిస్తుందని తెలిపారు. దీంతో ప్రజల ప్రయాణం సుఖంగా ఉండటమే కాకుండా ఒక చోట నుంచి మరో చోటికి సరుకు రవాణా కూడా సులువుగా మారింది. అభివృద్ధిని వేగవంతం చేసేందుకు దేశవ్యాప్తంగా గూడ్స్ రైళ్లను నడుపుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి