LLaMA 2: ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా దూకుడు.. గూగుల్‌, చాట్‌జీపీటీలకు పోటీగా కొత్త వెర్షన్‌ విడుదల

|

Jul 19, 2023 | 1:17 PM

ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా మంగళవారం తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త మోడల్‌ను పరిచయం చేసింది. గూగుల్‌, చాటీజీపీటీలకు పోటీగా ఉచిత-ఛార్జ్ వెర్షన్‌ 'లామా-2'ను విడుదల చేసింది. ఓపెన్‌ఏఐ, గూగుల్‌ సంస్థలు అభివృద్ధి చేసిన..

LLaMA 2: ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా దూకుడు.. గూగుల్‌, చాట్‌జీపీటీలకు పోటీగా కొత్త వెర్షన్‌ విడుదల
Llama 2
Follow us on

శాన్‌ఫ్రాన్సిస్కో, జులై 19: ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా మంగళవారం తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త మోడల్‌ను పరిచయం చేసింది. గూగుల్‌, చాటీజీపీటీలకు పోటీగా ఉచిత-ఛార్జ్ వెర్షన్‌ ‘లామా-2’ను విడుదల చేసింది. ఓపెన్‌ఏఐ, గూగుల్‌ సంస్థలు అభివృద్ధి చేసిన చాట్‌జీపీటీ, బార్డ్ చాట్‌బాట్‌లు మానవ సృజనాత్మకత, నైపుణ్యాన్ని అనుకరిస్తూ ఇప్పటికే మంచి గుర్తింపు పొందాయి.

ఐతే మెటా ఇందుకు భిన్నంగా జెనరేటివ్‌ ఏఐ ప్రొడక్ట్స్‌ను నేరుగా వినియోగదారునికి అందుబాటులోకి తీసుకురావడానికి నిరాకరించింది. బదులుగా ‘లామా (Llama)’ అనే ల్యాంగ్వేజ్‌ మోడల్‌ను ప్రత్యేకంగా పరిశోధకుల కోసం మెటా అభివృద్ధి చేసింది. వారు దీనిని ఉచితంగా వినియోగించుకోవచ్చు. లామా అనేది ఓపెన్-సోర్స్. దాని అంతర్గత పనితీరు ఓపెన్‌ఏఐ, గూగుల్‌ అభివృద్ధి చేసిన హెడ్‌లైన్-గ్రాబింగ్ ఏఐలకు భిన్నంగా ఉంటుంది. దీనిలో అంతర్గతంగా జరిగే సాంకేతిక విస్తృత శ్రేణి వినియోగదారులకు అందుబాటులో ఉంచడం దీని ప్రధాన లక్ష్యం.

‘ఇది ఓపెన్ సోర్స్ ఇన్నోవేషన్‌ను ప్రోత్సహిస్తుంది. ఇది ఎక్కువ మంది డెవలపర్‌లకు కొత్త టెక్నాలజీతో మమేకం అవ్వడానికి వీలు కల్పిస్తుందని మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్ పోస్ట్‌లో తెలిపారు. కాగా లామా 2ను తీసుకురావడానికి ఇటీవల మైక్రోసాప్ట్‌తో మెటా పార్ట్‌నర్‌షిప్‌ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

లామా2 రీసెర్చ్‌, వాణిజ్యం వంటి వివిధ రంగాలకు అవసరమైన వనరులను అందుబాటులోకి తీసుకురానుంది. అంతేకాకుండా భద్రత విషయంలో ఇది భిన్నమైన ప్రత్యేకత కలిగి ఉంది. దీనిని ఎవరైనా డౌన్‌లోడ్‌ చేసుకునేలా త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.