AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Pan Link: మీ ఆధార్ – పాన్ కార్డు లింక్ చేసుకునేందుకు గడువు ఇక కొన్ని రోజులే.. లేకపోతే రూ.10 వేల జరిమానా

పాన్ కార్డ్ హోల్డర్లకు ముఖ్యమైన సమాచారం. ఇంకా తమ పాన్ కార్డ్‌ని ఆధార్ కార్డ్‌తో లింక్ చేయని పాన్ కార్డ్ హోల్డర్‌లు మార్చి 31, 2023లోపు దాన్ని లింక్ చేయాలి.

Aadhaar Pan Link: మీ ఆధార్ - పాన్ కార్డు లింక్ చేసుకునేందుకు గడువు ఇక కొన్ని రోజులే.. లేకపోతే రూ.10 వేల జరిమానా
Pan Aadhar Card
Madhavi
| Edited By: |

Updated on: Mar 25, 2023 | 1:49 PM

Share

పాన్ కార్డ్ హోల్డర్లకు ముఖ్యమైన సమాచారం. ఇంకా తమ పాన్ కార్డ్‌ని ఆధార్ కార్డ్‌తో లింక్ చేయని పాన్ కార్డ్ హోల్డర్‌లు మార్చి 31, 2023లోపు దాన్ని లింక్ చేయాలి. లేకపోతే, మీరు ఏప్రిల్ 1, 2023 నుండి మీ పాన్ కార్డ్‌ని ఉపయోగించలేరు. మీ పాన్ కార్డ్ పనిచేయడం ఆగిపోతుంది. ఆ తర్వాత, మీరు బ్యాంకులోనూ, ఇతర పనుల్లోనూ పాన్ కార్డ్‌ను ఉపయోగించలేరు. ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన సర్క్కులర్ ప్రకారం పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయడాన్ని తప్పనిసరి చేసింది.

ఆదాయపు పన్ను శాఖ సలహా ప్రకారం, మార్చి 31, 2023లోపు రెండు గుర్తింపు కార్డులను లింక్ చేయకపోతే, అప్పుడు పాన్ కార్డ్ డీయాక్టివ్ గా మారుతుంది. ఆ తర్వాత వినియోగదారులు ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయకుండా లేదా పాన్ సంబంధిత సేవలను యాక్సెస్ చేయకుండా నియంత్రించబడతారు. అయితే ప్రస్తుతం ఆధార్, ప్యాన్ కార్డు లింకును మీరు రూ.1000 పెనాల్టీతో చేయాల్సి ఉందనే సంగతి గుర్తుంచకోండి.

IT డిపార్ట్‌మెంట్ జారీ చేసిన పబ్లిక్ అడ్వైజరీ ప్రకారం “పాన్-హోల్డర్‌లందరూ మార్చి 31, 2023లోపు తమ శాశ్వత ఖాతా సంఖ్య (పాన్)ని ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి.” ఏప్రిల్ 1, 2023 నుండి, మీ పాన్ మరియు ఆధార్ లింక్ చేయకుంటే, మీ పాన్ కార్డు డియాక్టివేట్ అవుతుంది. అంతేకాదు రూ.10 వేల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. PAN డీయాక్టివేట్ అయితే ఏమి జరుగుతుంది?పాన్ కార్డ్ డీయాక్టివేట్ అయితే IT చట్ట ప్రకారం జరిగే అన్ని పరిణామాలకు బాధ్యత వహించాలి. వివిధ చిక్కులను ఎదుర్కోవలసి ఉంటుంది. PAN పని చేయకపోతే, కార్డ్ హోల్డర్ IT రిటర్న్‌లను ఫైల్ చేయలేరు. అదే సమయంలో, రిటర్న్ ప్రాసెస్ చేయబడనందున, పెండింగ్ రిటర్న్‌లు కూడా ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు కష్టంగా మారతాయి.

ఇవి కూడా చదవండి

పాన్ కార్డ్‌ని ఆధార్ కార్డ్‌తో లింక్ చేయడం ఎలా:

-భారత ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి: incometaxindiaefiling.gov.in

– మీ IDని ఇప్పటికే నమోదు చేయకపోతే నమోదు చేసుకోండి.

– మీ యూజర్ ఐడి, పాస్‌వర్డ్ మరియు పుట్టిన తేదీని ఉపయోగించి పోర్టల్‌కి లాగిన్ చేయండి.>> లాగిన్ చేయడానికి వినియోగదారు ID మీ PAN (శాశ్వత ఖాతా సంఖ్య) అవుతుంది.

– మీ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి మీకు పాప్-అప్ విండో కనిపిస్తుంది.>> లింక్ చేయడానికి, మెనూ బార్‌లోని ‘Profile Settings’కి వెళ్లి, హోమ్‌పేజీలో ‘Link Aadhaar’పై క్లిక్ చేయండి.

– మీ ఆధార్ కార్డ్‌లో పేర్కొన్న విధంగా మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్ మీ పేరును నమోదు చేయండి.>> ఆధార్ కార్డులో బర్త్ డే లేకపోతే “I have only Year of Birth in Aadhaar Card” అనే ఆప్షన్ ను టిక్ చేయండి.

-నమోదు చేసుకోవడానికి స్క్రీన్‌పై ప్రదర్శించబడే క్యాప్చా కోడ్‌ను నమోదు చేయండి.

– “లింక్ ఆధార్” బటన్ పై క్లిక్ చేయండి.

– మీరు నమోదు చేసిన వివరాలు మీ పాన్ మరియు ఆధార్ రికార్డులతో సరిపోలితే, “లింక్ నౌ” బటన్‌పై క్లిక్ చేయండి. మీ పాన్ కార్డ్ మీ ఆధార్ కార్డ్‌తో విజయవంతంగా లింక్ అవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి