LIC Scheme: ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్ రాబడి పెంచుకునేందుకు రకరకాల పథకాలను ప్రవేశపెట్టారు. అటు సామాన్యుల నుంచి రైతుల వరకు, అలాగే సీనియర్ సిటిజన్ల కోసం అద్భుతమైన పథకాలను రూపొందించారు. సీనియర్ సిటిజన్స్‌కు అండగా నిలిచేందుకు ప్రధాన మంత్రి వయో వందన యోజన స్కీమ్ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే చాలా మందికి ఈ స్కీమ్ గురించి పెద్దగా అవగాహన లేదు. దీంతో సీనియర్ సిటిజన్స్ చాలా మంది ఈ స్కీమ్‌ను పొందలేకపోతున్నారు. ‘ప్రధాన మంత్రి వయో వందన యోజన’ పథకం అనేది ఒక సామాజిక భద్రత కల్పించే స్కీమ్. ఇందులో నెలనెలా పెన్షన్ పొందు సదుపాయం ఉంటుంది. ఈ పథకాన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) నిర్వహిస్తోంది.
ఈ పథకంలో చేరేందుకు భార్యాభర్తలిద్దరికీ 60 సంవత్సరాలు దాటాలి. గరిష్టంగా రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. గతంలో రూ.7.5 లక్షల వరకు మాత్రమే ఉన్న పెట్టుబడి లిమిట్‌ను రూ.15 లక్షలకు పెంచారు. 60 సంవత్సరాలు పైబడిన వారు ఈ పథకానికి అర్హులు.
ఇందులో భార్యాభర్తలిద్దరూ చేరి రూ.15 లక్షలు కట్టాలి. అంటే ఇద్దరికి రూ.30 లక్షలు అవుతుంది. ఈ ఇన్వెస్ట్‌మెంట్‌పై 7.40 శాతం వార్షిక వడ్డీ పొందుతారు. ఏడాదికి రూ.2,22000 వడ్డీని లబ్దిదారులు పొందుతారు. అంటే ఈ మొత్తాన్ని నెలకు రూ.18,500 పెన్షన్ రూపంలో పొందే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్‌లో భార్యాభర్తల్లో ఒక్కరే చేరి రూ.15 లక్షలు ఇన్వెస్ట్‌మెంట్ చేసినట్లయితే సంవత్సరానికి రూ.1,11000 అవుతుంది. ఈ వడ్డీని లబ్దిదారుడు నెలకు రూ.9,250 పెన్షన్ రూపంలో పొందవచ్చు.
స్కీమ్ కాలపరిమితి 10 ఏళ్లు:
ఈ స్కీమ్ కాలపరిమితి 10 ఏళ్లు. ఈ స్కీమ్‌లో చేరేందుకు మార్చి 31, 2023 వరకు మాత్రమే ఉంది. ఇందులో అర్హులైన సీనియర్ సిటిజన్స్ చేరవచ్చు. ఇందులో పొందే పెన్షన్ త్రైమాసికం, ఆరు నెలలు, వార్షిక పద్దతిలో పొందవచ్చు. ఒక వేళ ప్రమాదవశాత్తు పదేళ్లలోపు లబ్దిదారుడు మరణిస్తే ఆ స్కీమ్‌లో పెట్టిన పెట్టుబడి మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తారు. ఈ పథకంలో గడువు ఉన్నంత వరకు పెట్టుబడి పెడితే పెన్షన్‌తో పాటు మొత్తాన్ని కూడా కలిపి చెల్లిస్తారు.
గరిష్టంగా ఎంత పెట్టుబడి పెట్టవచ్చు..?
ప్రధాన మంత్రి వయో వందన యోజన స్కీమ్‌లో గరిష్టంగా రూ.15 లక్షలు కట్టవచ్చు. కనిష్టంగా రూ.1,62,162, రూ.1,61,074, రూ1,59,574, రూ.1,56,658 ప్లాన్స్ లబ్దిదారుడికి అందుబాటులో ఉన్నాయి. ఇందులో రూ.15 లక్షలకు మించి ఇన్వెస్ట్ చేయలేరు. 2017 జులైలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ‘ప్రధాన్ మంత్రి వయ వందన యోజన (PMVVY) పెన్షన్ పథకాన్ని ప్రారంభించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి