Pension Scheme: ఒక్కసారి డిపాజిట్ చేస్తే.. ప్రతినెలా రూ. 9250 పెన్షన్.. ఈ ప్రభుత్వ పథకం గురించి మీకు తెలుసా?

|

Aug 22, 2022 | 12:14 PM

ప్రధాన మంత్రి వయ వందన యోజన కింద ఏ సీనియర్ సిటిజన్ అయినా రూ. 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. పెట్టుబడి మొత్తం ప్రకారం, సీనియర్ సిటిజన్లు నెలవారీ పెన్షన్ రూ.1 వేయి నుంచి రూ. 9250ల వరకు పొందుతారు.

Pension Scheme: ఒక్కసారి డిపాజిట్ చేస్తే.. ప్రతినెలా రూ. 9250 పెన్షన్.. ఈ ప్రభుత్వ పథకం గురించి మీకు తెలుసా?
Money
Follow us on

LIC PMVVV Scheme: దేశంలోని ప్రజలందరూ తమ సంపాదనలో కొంత భాగాన్ని పొదుపు రూపంలో పెట్టుబడి పెట్టుకోవాలని ఆశపడుతుంటారు. తద్వారా వారి భవిష్యత్తు ఆర్థికంగా సురక్షితంగా ఉంటుందని భావిస్తుంటారు. కానీ, చాలా మంది తమ డబ్బును సకాలంలో ఏ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టలేక పదవీ విరమణ వయస్సును చేరుకోలేకపోతున్నారు. అటువంటి వ్యక్తుల కోసం భారత ప్రభుత్వం ఒక గొప్ప పథకాన్ని అమలు చేస్తోంది. ఇందులో 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు పెట్టుబడిపై అనేక ప్రయోజనాలను పొందుతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం పేరు ప్రధాన మంత్రి వయ వందన యోజన. ఇది పెన్షన్ స్కీమ్. దీని కింద నెలవారీ పెన్షన్ లబ్ధిదారుడు వారి పెట్టుబడిపై 10 సంవత్సరాల పాటు వార్షికంగా 7.40 శాతం వడ్డీని పొందుతాడు.

ప్రధాన మంత్రి వయ వందన యోజనను లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా (LIC) నిర్వహిస్తోంది. అయితే, ఈ పథకం భారత ప్రభుత్వానికి చెందినది. ఈ పథకం కింద, ఏ సీనియర్ సిటిజన్ అయినా రూ. 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. గతంలో గరిష్ట పెట్టుబడి పరిమితి రూ.7.50 లక్షలుగా ఉండేది.

ప్రధాన మంత్రి వయ వందన యోజన పథకం కీ పాయింట్స్..

ఇవి కూడా చదవండి

వయ వందన యోజనలో ఆదాయపు పన్ను మినహాయింపు అందుబాటులో లేదు

ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 31 మార్చి 2023

ఈ పథకంలో GST మినహాయింపు అందుబాటులో ఉంది

ఈ పథకంలో నెలవారీ, వార్షిక పెన్షన్ ఆఫ్షన్స్ ఉన్నాయి

ఎంత పెట్టుబడిపై ఎంత పెన్షన్..

60 ఏళ్ల సీనియర్ సిటిజన్ నెలవారీ రూ. వేయి పెన్షన్ కావాలనుకుంటే, అతను 1.62 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాలి. ఈ పథకం కింద గరిష్టంగా రూ.9250 పెన్షన్ పొందవచ్చు. ఇందుకోసం సీనియర్ సిటిజన్లు రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. వయ వందన పథకం ప్రధాన లక్ష్యం దేశంలోని సీనియర్ సిటిజన్లకు పెన్షన్ అందించడం.

ఎలా దరఖాస్తు చేయాలి..

వయ వందన యోజన కోసం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండింటిలోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం కోసం ఆన్‌లైన్ దరఖాస్తును LIC వెబ్‌సైట్ ద్వారా చేయవచ్చు. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి LIC బ్రాంచ్‌కి వెళ్లాలి.

వయ వందన యోజన కోసం దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాలు..

ఆధార్ కార్డు

పాన్ కార్డ్

జనన ధృవీకరణ పత్రం

చిరునామా రుజువు

ఐ సర్టిఫికేట్

బ్యాంక్ ఖాతా పాస్‌బుక్

దరఖాస్తుదారు పాస్‌పోర్ట్ సైజు ఫోటో

పదవీ విరమణ ధృవీకరణ పత్రం

వయ వందన యోజన సరెండర్ రూల్స్..

ఈ స్కీమ్ కొనుగోలు చేసిన తర్వాత సులభంగా సరెండర్ చేయవచ్చు. మీరు స్కీమ్ తీసుకున్న 15 రోజులలోపు స్కీమ్‌ని వాపసు చేయవచ్చు. అదే సమయంలో, ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన పాలసీని 30 రోజులలోపు వాపసు చేయవచ్చు.