LIC Scheme: రోజుకు కేవలం రూ.45 పొదుపుతో రూ.25 లక్షల రిటర్న్స్.. జీవితాంతం ఉచిత బీమా!
LIC Scheme: సామాన్యులు తమ డబ్బు సురక్షితంగా ఉంటూనే, భారీ లాభాలను అందించే పథకాల కోసం వెతుకుతుంటారు. అలాంటి వారి కోసం ఎల్‌ఐసి అందిస్తున్న అద్భుతమైన పథకమే ‘న్యూ జీవన్ ఆనంద్’ పాలసీ అందుబాటులో ఉంది. ఈ పాలసీ కేవలం పొదుపు..

LIC Scheme: భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) దశాబ్దాలుగా కోట్ల మంది భారతీయులకు నమ్మకమైన పెట్టుబడి మార్గంగా ఉంది. నేటి కాలంలో మార్కెట్లో ఎన్ని పెట్టుబడి ఆప్షన్ ఉన్నప్పటికీ, సామాన్యులు తమ డబ్బు సురక్షితంగా ఉంటూనే, భారీ లాభాలను అందించే పథకాల కోసం వెతుకుతుంటారు. అలాంటి వారి కోసం ఎల్‌ఐసి అందిస్తున్న అద్భుతమైన పథకమే ‘న్యూ జీవన్ ఆనంద్’ పాలసీ అందుబాటులో ఉంది. ఈ పాలసీ కేవలం పొదుపు మార్గం మాత్రమే కాదు, మీ కుటుంబానికి ఆర్థిక భరోసానిచ్చే ఒక బలమైన కవచం. తక్కువ ప్రీమియంతో దీర్ఘకాలంలో పెద్ద మొత్తాన్ని పొందాలనుకునే వారికి ఇది సరైన ఎంపిక.
ఇది కూడా చదవండి: Gold Price Today: మళ్లీ పుంజుకుంటున్న బంగారం ధర.. వెండి మాత్రం తగ్గింది!
చిన్న మొత్తంతో భారీ నిధి:
చాలామంది ఒక పెద్ద మొత్తాన్ని కూడబెట్టాలంటే నెలకు వేల రూపాయలు పెట్టుబడి పెట్టాలని అనుకుంటారు. కానీ, జీవన్ ఆనంద్ పాలసీ ఆ నమ్మకాన్ని మారుస్తుంది. ఈ లెక్కను ఒకసారి గమనించండి.
వయస్సు: 35 ఏళ్లు అనుకుందాం.
- బీమా మొత్తం (Sum Assured): రూ.5 లక్షలు.
- పాలసీ కాలపరిమితి: 35 ఏళ్లు.
- వార్షిక ప్రీమియం: సుమారు రూ.16,300.
- నెలవారీ పొదుపు: రూ.1,359 (అంటే రోజుకు కేవలం రూ.45 మాత్రమే).
ఈ 35 ఏళ్ల కాలంలో మీరు మొత్తం రూ.5.70 లక్షలు జమ చేస్తారు. కానీ మెచ్యూరిటీ సమయంలో మీకు లభించే మొత్తం అక్షరాలా రూ.25 లక్షలు. ఇందులో రూ.5 లక్షల మూల బీమా మొత్తం రూ.8.60 లక్షల రివిజనరీ బోనస్, రూ.11.50 లక్షల ఫైనల్ అడిషనల్ బోనస్ కలిసి ఉంటాయి.
మెచ్యూరిటీ తర్వాత కూడా ఉచిత బీమా!
ఈ పాలసీలోని అత్యంత ప్రత్యేకమైన ఫీచర్ ‘హోల్ లైఫ్ రిస్క్ కవర్’. సాధారణ బీమా పాలసీల్లో మెచ్యూరిటీ సమయం ముగిసి డబ్బులు తిరిగి రాగానే బీమా రక్షణ కూడా ముగిసిపోతుంది. కానీ జీవన్ ఆనంద్‌లో అలా కాదు. 35 ఏళ్ల తర్వాత మీరు రూ.25 లక్షల మెచ్యూరిటీ సొమ్ము తీసుకున్నప్పటికీ, మీ రూ.5 లక్షల ఉచిత బీమా జీవితాంతం కొనసాగుతుంది. పాలసీదారుడు ఎప్పుడు మరణించినా (వయస్సుతో సంబంధం లేకుండా), వారి కుటుంబానికి లేదా నామినీకి ఆ రూ.5 లక్షల అదనపు మొత్తం అందుతుంది.
పన్ను ప్రయోజనాలు, లోన్ సౌకర్యం:
- ఆర్థిక భద్రతతో పాటు, ఈ పథకం పన్ను ఆదా చేయడంలో కూడా ఎంతో సహాయపడుతుంది:
- సెక్షన్ 80C: మీరు చెల్లించే ప్రీమియంపై ఆదాయపు పన్ను మినహాయింపు పొందవచ్చు.
- సెక్షన్ 10(10D): మెచ్యూరిటీ సమయంలో వచ్చే మొత్తం, మరణానంతరం లభించే ప్రయోజనాలు పూర్తిగా పన్ను రహితం.
- లోన్ సౌకర్యం: పాలసీ తీసుకున్న రెండు సంవత్సరాల తర్వాత అత్యవసర పరిస్థితుల్లో మీ డిపాజిట్ పై లోన్ పొందే అవకాశం ఉంది.
ఎవరు తీసుకోవచ్చు?
- వయోపరిమితి: 18 నుండి 50 సంవత్సరాల మధ్య ఉన్న భారతీయులెవరైనా ఈ పాలసీ తీసుకోవచ్చు.
- టర్మ్: 15 నుండి 35 ఏళ్ల వరకు మీకు నచ్చిన కాలపరిమితిని ఎంచుకోవచ్చు.
- అదనపు రక్షణ: అవసరమైతే యాక్సిడెంటల్ డెత్, ఇతర రైడర్లను కూడా జోడించుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




