AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ration Card: రేషన్ కార్డులో మీ పేరు ఉందా..? లేదా..? సింపుల్‌గా ఎలా తెలుసుకోవాలంటే..?

తెలంగాణలో మీకు రేషన్ కార్డు ఉందా.. అయితే ప్రభుత్వం బిగ్ అలర్ట్ జారీ చేసింది. జులై 31వ తేదీలోగా ఈకేవైసీ పూర్తి చేయాలని డెడ్ లైన్ విధించింది. ఆలోగా కార్డులో పేరు ఉన్న ప్రతీఒక్కరూ కేవైసీ పూర్తి చేయాలి. ఎలా అంటే..

Ration Card: రేషన్ కార్డులో మీ పేరు ఉందా..? లేదా..? సింపుల్‌గా ఎలా తెలుసుకోవాలంటే..?
Ration Card
Venkatrao Lella
|

Updated on: Jul 30, 2026 | 5:41 PM

Share

తెలంగాణలోని రేషన్ కార్డు లబ్దిదారులకు బిగ్ అలర్ట్. ఒక్కరోజు మాత్రమే ఈకేవైసీకి గడువు మిగిలి ఉంది. రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతీఒక్కరూ తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేయడాన్ని రేవంత్ సర్కార్ తప్పనిసరి చేసింది. రేషన్ సరఫరాలో జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టడం, నిజమైన లబ్దిదారుడికి మాత్రమే అందించడం, కార్డుల్లో మెరుగైన పారదర్శకత కోసం ఈ నిబంధన విధించింది. జులై 31వ తేదీ వరకు తెలంగాణ ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. ఆలోపు పూర్తి చేయనివారికి రేషన్ సరుకులు కట్ చేయడంతో పాటు కార్డు కూడా రద్దు చేసే అవకాశముంది. రేషన్ కార్డు లేకపోతే మీరు ఎలాంటి ప్రభుత్వ పథకాలు పొందలేరు.

రేషన్ కార్డులో ఎవరెవరి పేర్లు ఉన్నాయో చూడటం ఎలా..ఝ

https://epds.telangana.gov.in/FoodSecurityAct/ పోర్టల్ తెరవండి

-హోమ్ పేజీలో FSC సెర్చ్ ఆప్షన్ ఎంచుకోండి

-రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయండి

-అనంతరం సెర్చ్ బటన్ క్లిక్ చేయండి

-రేషన్ కార్డులో ఉన్న అందరి పేర్లు స్క్రీన్‌పై కనిపిస్తాయి.

కేవైసీ ఎలా పూర్తి చేయాలి..?

రేషన్ కార్డులో పేరు ఉన్నవారందరూ కేవైసీ పూర్త చేయాలి లబ్దిదారులు ఎక్కడైనా ఈకేవైసీ పూర్తి చేయవచ్చు. మీ సేవ సెంటర్ లేదా మీ సమీపంలోని రేషన్ దుకాణానికి వెళ్లి ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ఉచితంగా కేవైసీ చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరు. ఇంటి వద్ద ఉన్నవారు తమ పరిధిలోని మీ సేవ కేంద్రం లేదా రేషన్ షాపు దగ్గరికి వెళ్లి ఈ పోస్ మెషిన్‌లో బయోమెట్రిక్స్ అందించడం ద్వారా కేవైసీ పూర్తవుతుంది. ఇక మీసేవ కేంద్రాల్లో ఆధార్ ధృవీకరణ ద్వారా ఈకేవైసీ పూర్తి చేయవచ్చు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు వెంట తీసుకెళితే సరిపోతుంది. ఇక ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు తమ సమీపంలోని మీ సేవ లేదా రేషన్ షాపుకు వెళ్లి ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.

Follow Us