AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold vs Real Estate: పెట్టుబడులు పెట్టడానికి బంగారం, స్థిరాస్తులలో ఏది బెటర్.. పూర్తి వివరాలు తెలుసుకోండి..

పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నో మార్గాలున్నాయి. అయినా చాలా మంది రిస్క్ లేకుండా భవిష్యత్తులో ఆదాయం వచ్చే మార్గాలను ఎంచుకుంటారు. అంటే సంప్రదాయబద్ధమైన పెట్టుబడులపై ఎక్కువమంది ఆసక్తి చూపిస్తుంటారు....

Gold vs Real Estate: పెట్టుబడులు పెట్టడానికి బంగారం, స్థిరాస్తులలో ఏది బెటర్.. పూర్తి వివరాలు తెలుసుకోండి..
House and Gold
Ganesh Mudavath
| Edited By: Amarnadh Daneti|

Updated on: Nov 15, 2022 | 2:32 PM

Share

పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నో మార్గాలున్నాయి. అయినా చాలా మంది రిస్క్ లేకుండా భవిష్యత్తులో ఆదాయం వచ్చే మార్గాలను ఎంచుకుంటారు. అంటే సంప్రదాయబద్ధమైన పెట్టుబడులపై ఎక్కువమంది ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా బంగారం, రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టడానికి మక్కువ చూపిస్తారు. గత కొన్ని సంవత్సరాల నుంచి బంగారంలో పెట్టుబడులు ఫర్వాలేదనిపిస్తున్నా.. రియల్ ఎస్టేట్ తో పోల్చినప్పుడు బంగారం కంటే భూమిపై పెట్టుబడి బెటర్ అంటున్నారు రియల్ ఎస్టేట్ నిపుణులు. లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ మెంట్ చేయాలంటే బంగారం మీద పెట్టుబడి పెట్టినా పెద్దగా లాభాలు రావని ఇన్వెస్టర్లు సలహా ఇస్తున్నారు. కరోనా తర్వాత ప్రతి ఒక్కరూ సొంతిల్లు ఉండాలని అనుకుంటున్నారు. మరోవైపు కరోనా ప్రభావం తగ్గినా ఈ ఏడాది ప్రారంభంలో సెన్సెక్స్‌ రికార్డు స్థాయికి చేరింది. ఇదే సమయంలో ప్రపంచ ఆర్ధిక సంక్షోభం, భౌగోళిక రాజకీయ ప్రతికూలతలు, సరఫరాలో సమస్యల కారణంగా బంగారం పెట్టుబడులు మళ్లీ క్షీణించాయి. కరోనా కాలంలో గృహ సముదాయ విపణి స్థిరంగా ఉండి, ప్రస్తుతం వృద్ధి బాటలో పయనిస్తుందని నిపుణులు అంటున్నారు.

దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో సగటు ధర పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా అన్ని పెట్టుబడి విభాగాలు కరోనా కంటే ముందు స్థాయిని మించిపోయాయి. 2019 నవబంర్ తో పోలిస్తే సెన్సెక్స్‌లో 52 శాతం, బంగారం ధరలో 34 శాతం, గృహ సముదాయ ధరలు 9 శాతం మేర పెరిగాయి. అయితే ప్రపంచ అనిశ్చితులు, ద్రవ్యోల్భణ వృద్ధి వంటి ప్రతికూలతలు ఉన్నప్పటికీ ఆయా పెట్టుబడి విభాగాలు బలంగానే ఉండే సూచనలున్నాయని నిపుణులు చెబుతున్నారు. కరోనా గృహ అవసరాన్ని పెంచింది. కోవిడ్‌తో ఇళ్లు కేవలం వసతి మాత్రంగానే కాకుండా ఎన్నో అవసరాలను తీర్చింది. ఆర్థిక అస్థిరత సమయంలో భద్రతను ఇస్తుందని ఇన్వెస్టర్లు చెబుతున్నారు.

బంగారం, స్టాక్‌ మార్కెట్లు అస్థిరంగా ఉండటంతో పాటు నష్టాలకు లోబడి ఉంటాయి. ప్రస్తుతం స్థిరాస్తి సరఫరా, డిమాండ్‌ కార్యకలాపాలు శరవేగంగా పరుగులు పెడుతున్నాయి. గతంలో పోలిస్తే ప్రస్తుతం గృహ ప్రాజెక్ట్‌ల లాంచింగ్‌లు 76 శాతం, విక్రయాలు 61శాతం మేర పెరిగాయి. రానున్న పండుగ సీజన్‌లో హౌసింగ్‌ మార్కెట్‌లో లావాదేవీలు పెరిగే అవకాశం ఉంది.

అసలు హైదరాబాద్ లో స్థిరాస్తి రేట్లు ఎలా ఉన్నాయి.. భవిష్యత్తులో ధరలు ఎలా ఉండబోతున్నాయి. హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల కొత్త కొత్త వెంచర్ల వివరాలు.. సరసమైన ధరల్లో లభించే స్థిరాస్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈనెల 18వ తేదీ నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్ లోని హైటెక్స్ లో నిర్వహించే TV9 స్వీట్ హోమ్ అండ్ ఇంటీరియర్ ఎక్స్‌పోను సందర్శించండి. అత్యంత విశ్వసనీయమైన దిగ్గజ రియల్ ఎస్టేట్ డెవలపర్‌లు ఈ ఎక్స్‌పోలో పాల్గొంటారు.

మరిన్ని బిజిెనెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి