Gold Selling Rules: బంగారం కొనుగోలు, అమ్మకాలపై కేంద్రం తెచ్చిన కొత్త రూల్స్ ఏంటో తెలుసా..?

|

Jun 12, 2023 | 1:50 PM

ఈ నిబంధనల ప్రకారం ఇళ్లలోని పాత బంగారు ఆభరణాలపై తప్పనిసరిగా హాల్‌మార్క్ వేయాలి. ఏప్రిల్ 1, 2023 నుండి, కొత్త నిబంధనల ప్రకారం అన్ని బంగారు ఆభరణాలు తప్పనిసరిగా హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ (HUID) నంబర్‌ను కలిగి ఉండాలన్నది ఇప్పటికే తెలిసిందే.. అయితే, తాజా నివేదిక ప్రకారం ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది.

Gold Selling Rules: బంగారం కొనుగోలు, అమ్మకాలపై కేంద్రం తెచ్చిన కొత్త రూల్స్ ఏంటో తెలుసా..?
Gold Price Today
Follow us on

మీ ఇంట్లో పాత ఆభరణాలు ఉండి, వాటిని విక్రయించాలనుకుంటే, లేదా కొత్త ఆభరణాలు తయారు చేయడానికి వాటిని కరిగించాలనుకుంటే ఈ కథనాన్ని జాగ్రత్తగా చదవండి. ఎందుకంటే బంగారు ఆభరణాల విక్రయానికి సంబంధించి ప్రభుత్వం కొత్త నిబంధనలను రూపొందించింది. ఈ కొత్త నిబంధన ప్రకారం ఇంట్లో ఉంచిన పాత ఆభరణాలను హాల్‌మార్క్ చేసే వరకు విక్రయించకూడదు. బంగారం హాల్‌మార్కింగ్, బంగారం కొనుగోలు, అమ్మకం కోసం ప్రభుత్వం కొత్త నిబంధనలను అమలు చేసింది. ఈ నిబంధనల ప్రకారం ఇళ్లలోని పాత బంగారు ఆభరణాలపై తప్పనిసరిగా హాల్‌మార్క్ వేయాలి. ఏప్రిల్ 1, 2023 నుండి, కొత్త నిబంధనల ప్రకారం అన్ని బంగారు ఆభరణాలు తప్పనిసరిగా హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ (HUID) నంబర్‌ను కలిగి ఉండాలన్నది ఇప్పటికే తెలిసిందే.. అయితే, తాజా నివేదిక ప్రకారం ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఇప్పుడు పాత ఆభరణాలను విక్రయించేందుకు కూడా హాల్‌మార్క్‌ను తప్పనిసరి చేశారు. సమాచారం ప్రకారం.. హాల్‌మార్క్ లేకుండా బంగారు ఆభరణాలను కలిగి ఉన్న కస్టమర్‌లు దానిని విక్రయించే ముందు లేదా కొత్త డిజైన్‌కి మార్చుకునే ముందు తప్పనిసరిగా హాల్‌మార్క్ పొందాలి.

హాల్‌మార్కింగ్ ఎలా జరుగుతుంది? :

వినియోగదారులు తాము ఉపయోగించిన ఆభరణాలను హాల్‌మార్క్ చేయడానికి 2 విధానాలున్నాయి..

– హాల్‌మార్క్ లేని ఆభరణాలను బీఐఎస్ నమోదిత నగల వ్యాపారులకు ఇవ్వాలి.

ఇవి కూడా చదవండి

-బిఐఎస్ నమోదిత నగల వ్యాపారులు హాల్‌మార్క్ చేయని బంగారు ఆభరణాలను హాల్‌మార్క్ పొందడానికి బిఐఎస్ అప్రైజల్, హాల్‌మార్కింగ్ సెంటర్‌కు తీసుకువెళతారు. ఇక్కడ మీ పాత బంగారం లేదా బంగారు ఆభరణాలు హాల్‌మార్క్ చేస్తారు.

– BIS ఆమోదించబడిన హాల్‌మార్కింగ్ కేంద్రాలలో ఆభరణాలను తనిఖీ చేసి హాల్‌మార్క్ చేయడం కస్టమర్లకు మరొక ఎంపిక.

హాల్ మార్కింగ్ కోసం ఎంత చెల్లించాలి? :

ఆభరణాల సంఖ్య 5 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే, కస్టమర్ హాల్‌మార్క్ కోసం ఒక్కో ఆభరణానికి రూ. 45 వసూలు చేస్తారు. ఒక్క ఆభరణం హాల్‌మార్క్ పొందడానికి రూ.200 చెల్లించాలి. BISచే గుర్తించబడిన హాల్‌మార్కింగ్ కేంద్రం ఆభరణాలను పరిశీలించి, దాని ధృవీకరణ పత్రాన్ని జారీ చేస్తుంది. వినియోగదారులు ఈ నివేదికను ఏదైనా బంగారు ఆభరణాల వ్యాపారికి చూపించవచ్చు.

పాత హాల్‌మార్క్ పని చేస్తుందా? :

కస్టమర్‌లు పాత హాల్‌మార్క్ బంగారు ఆభరణాలను కలిగి ఉంటే, వారు మళ్లీ HUID నంబర్‌తో రీ-హాల్‌మార్క్ చేయాల్సిన అవసరం లేదు. ఇటువంటి హాల్‌మార్క్ ఆభరణాలను సులభంగా విక్రయించవచ్చు లేదా కొత్త డిజైన్‌ల కోసం మార్చుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం..