Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Loan: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

గత కొద్ది రోజులుగా అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో.. బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయిల్లో ట్రేడవుతున్నాయి. రోజురోజుకూ పెరుగుతూ కొత్త గరిష్టాల్ని నమోదు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే గోల్డ్ లోన్లు తీసుకునేందుకు కూడా ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఆ వివరాలు

Gold Loan: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 11, 2025 | 9:24 PM

గత కొద్ది రోజులుగా అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో.. బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయిల్లో ట్రేడవుతున్నాయి. రోజురోజుకూ పెరుగుతూ కొత్త గరిష్టాల్ని నమోదు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే గోల్డ్ లోన్లు తీసుకునేందుకు కూడా ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అయితే బంగారంపై లోన్లు తీసుకునేముందు ఈ విషయాలు తెలుసుకోవాలి. ఇతర పర్సనల్ లోన్, వెహికిల్ లోన్, హోం లోన్‌తో పోలిస్తే.. బంగారంపైనే బ్యాంకులు, ఇతర బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల వద్ద లోన్ వేగంగా లభిస్తుందని చెప్పొచ్చు. ఇతర లోన్లతో పోలిస్తే గోల్డ్ లోన్ల వడ్డీ రేట్లు తక్కువగా ఉండటమే కాకుండా.. ఇతర నియమ నిబంధనలు కూడా సరళంగా ఉంటాయి. ఇంకా అత్యవసర సమయంలో డబ్బు అవసరం పడినప్పుడు బంగారంపై రుణం అనేది వేగంగా ఆదుకుంటుందని చెప్పొచ్చు. ఇతర లోన్లు రావాలంటే కాస్త సమయం ఎక్కువ పడుతుంది. అదే గోల్డ్‌ లోన్ల కోసం బ్యాంకులు ఎక్కువ సమయం తీసుకోవు. ఇక్కడ బంగారు ఆభరణాలు తాకట్టు పెడతారు కాబట్టి దానికి తగిన విలువతో బ్యాంకులు లోన్లు మంజూరు చేస్తాయి.

గోల్డ్ లోన్లు సాధారణంగానే అధిక లోన్ టు వేల్యూ రేషియోను కలిగి ఉంటాయని చెప్పొచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల ప్రకారం తాకట్టు పెట్టిన బంగారం విలువపై 75 శాతం వరకు రుణ మొత్తం పొందొచ్చు. ఇది బ్యాంకులు, రుణ సంస్థల్ని బట్టి మారుతుంటుంది. ఉదాహరణకు రూ.10 లక్షల విలువైన బంగారంపై రూ. 7.50 లక్షల వరకు లోన్ పొందొచ్చు. మీ అవసరాల్ని బట్టి బంగారం తాకట్టు పెట్టి లోన్ పొందొచ్చు. ఇంకా ప్రతీ లోన్‌పైనా ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. బంగారు రుణాలపై కూడా 0-2 శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. దీనికి జీఎస్టీ అదనం. ప్రస్తుతం గోల్డ్ రేట్లు జీవన కాల గరిష్ట స్థాయిల వద్ద ట్రేడవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన నిర్ణయాలతో అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు ఇందుకు కారణం. ట్రంప్ వరుసగా టారిఫ్స్ పెంచుకుంటూ పోవడం వల్ల పసిడి ధరలు పెరుగుతూ పోతున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి