Post Office: మీకు పోస్టాఫీసులో ఏదైనా పని ఉందా ? మీరు పోస్టాఫీసుకు వెళ్ళాలి అనుకుంటున్నారా ? అయితే మీరు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాల్సిందే.. పోస్టాఫీసుల టైమింగ్స్ మారాయి. ఇందుకు కారణం కరోనా సెకండ్ వేవ్ వలన లాక్ డౌన్ విధానాన్ని అమలు పరచడమే. ఈ నేపథ్యంలో పోస్టాఫీసుల పనివేళల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇక మీరు పోస్టాఫీసు కొత్త టైమింగ్స్ తెలుసుకోకుండా వెళితే కచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ముందుగా తపాలా కార్యాలయాల నూతన పనివేళలు తెలుసుకొని వెళ్ళడం కారణంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. తెలంగాణలో లాక్ డౌన్ నిబంధనలకు అనుగుణంగా పోస్టాఫీస్ పనివేళలను కుదించారు. పెద్ద పోస్ట్ ఆఫీసుల్లో కౌంటర్లు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి.
ఇక చిన్న పోస్టాఫీసులు మాత్రం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు పనిచేయనున్నాయి. ఈ కొత్త వర్క్ టైమింగ్స్ మే 13 నుంచి అమలులోకి వచ్చాయి. ఈ మేరకు సీనియర్ సూపరింటెండెంట్, సికింద్రాబాద్ డివిజన్ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ ప్రభావం రోజు రోజూకీ మరింత పెరుగుతుండంతో కార్యాలయాలు తక్కువ మంది సిబ్బందితో పనిచేస్తాయని.. డెలివరీ సహా ఇతర సేవలు గతంలో మాదిరిగానే కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఏదైనా పని కోసం పోస్టాఫీసుకు వెళ్ళాలనుకుంటే మాత్రం కొత్త టైమింగ్స్ తెలుసుకోవడం మంచిది. ఇదిలా ఉంటే అటు దేశవ్యాప్తంగా బ్యాంకుల పనివేళల్లో మార్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఇక తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ దృష్ట్యా ఆయా రాష్ట్ర నిబంధనలకు అనుగుణంగా బ్యాంకు టైమింగ్స్ మారాయి.
Also Read: అదిరిపోయే స్కీమ్.. ప్రతి నెల రైతుల ఖాతాల్లోకి రూ.3 వేలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..
మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్ చేసుకున్నారా ? లేకపోతే.. మీరు రూ. 2 లక్షలు రానట్లే.. ఎలాగో తెలుసా..