Buying A Home: అప్పు చేసి ఇల్లు కొంటున్నారా.? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి
సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఓ చోట.. ఎవరి బడ్జెట్‌కు అనుగుణంగా వారు సొంతిల్లు కట్టుకోవాలని కోరుకుంటారు. తమ కలల ఇంటి కోసం పైసా పైసా కూడబెడుతుంటారు. అయితే ఇంటి నిర్మాణానికి కేవలం డబ్బులు ఉంటే సరిపోదు. ఇంటి కోసం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తేనే అనుకున్న టైంలో..

సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఓ చోట.. ఎవరి బడ్జెట్‌కు అనుగుణంగా వారు సొంతిల్లు కట్టుకోవాలని కోరుకుంటారు. తమ కలల ఇంటి కోసం పైసా పైసా కూడబెడుతుంటారు. అయితే ఇంటి నిర్మాణానికి కేవలం డబ్బులు ఉంటే సరిపోదు. ఇంటి కోసం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తేనే అనుకున్న టైంలో.. అనుకున్న బడ్జెట్‌లో ఇంటి నిర్మాణం పూర్తవుతుంది. అయితే చాలామంది సొంతింటి కలను నిజం చేసుకునే క్రమంలో హోం లోన్ తీసుకుంటారు. తొలిసారి ఇల్లు కొనుగోలు చేస్తున్నా.. ఇప్పటికే ఉన్నదాన్ని మార్చి, పెద్దది తీసుకోవాలనుకున్నా డబ్బులు కావాల్సి వస్తాయి. అయితే అప్పు చేసి ఇల్లు కొనుగోలు చేసేముందు కొన్ని విషయాలు గురించి అవగాహనా అవసరం. దాని అవేంటో ఇప్పుడు తెలుసుకుందామా..
ఇది చదవండి: నిద్రపోయే భంగిమను బట్టి మీ వ్యక్తిత్వాన్ని చెప్పేయొచ్చు..! ఎలాగో తెల్సా
ఇంటి రుణం ఒక దీర్ఘకాలిక ఒప్పందం. దీన్ని తీర్చేందుకు కనీసం 15 నుంచి 30 ఏళ్ళ సమయం పడుతుంది. ఇంతకాలం పాటు క్రమం తప్పకుండ వాయిదాలు చెల్లిస్తూ, మరోవైపు ఇతర ఆర్ధిక లక్ష్యాలకూ ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. దీనికి సిద్దంగా ఉన్నప్పుడే ఇంటి రుణం తీసుకునేందుకు ప్రయత్నించాలి. హోం లోన్ తీసుకునే ముందు ప్రస్తుత ఆర్ధిక పరిశితిని అంచనా వేయడం ముఖ్యం. ప్రధానంగా మీ ఆదాయం, పొదుపు, ఇప్పటికే ఉన్న అప్పులను లెక్కించండి. మీ నెలవారీ నగదు రాకపోకలను గుర్తించండి. మీ ఆర్ధిక లక్ష్యాలు, ఖర్చులపై స్పష్టమైన అవగాహనకు రావాలి. వీటన్నింటినీ లెక్కలు వేసుకున్నాకే మీ ఆర్ధిక స్తోమతకు అనుగుణంగా ఇంటి కొనుగోలు బడ్జెట్‌ను నిర్ణయించుకోవాలి.
బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు ఇంటి రుణ దరఖాస్తును ఆమోదించే ముందు చూసే ముఖ్యమైన విషయం.. మీ ఆదాయంలో రుణ నిష్పత్తి ఎంత అనేది. ఇది మీ ఆదాయంలో నుంచి రుణాలకు ఎంత మొత్తం చెల్లిస్తున్నారన్నది చెబుతుంది. తక్కువ నిష్పత్తి ఉంటే.. మంచి రుణగ్రహీత అని అర్ధం. సాధారణంగా బ్యాంకులు ఆదాయంలో రుణాల నిష్పత్తి 35 శాతం కన్నా తక్కువ ఉన్నప్పుడు అప్పు ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తాయి. మీకు ఇతర ఆదాయాలున్నప్పుడు వాటిని తెలియజేయడం ద్వారా రుణం వచ్చే అవకాశాలు మెరుగుపరుచుకోవచ్చు. అలాగే ఇల్లు కొన్న తర్వాత ఖర్చులు ఎన్నో ఉంటాయి. ఆస్తి పన్ను, నెలవారీ నిర్వహణ రుసుములు, ఇంటి మరమ్మతులు, బిల్లులు ఇలా పలు ఖర్చులు ఉంటాయి. వీటిన్నింటికి కొంత మొత్తం విడిగా ఉండేలా చూసుకోవాలి. లేకపోతే ఆర్ధికంగా చిక్కులు తప్పవు.
ఇంటి కొనుగోలు కోసం ముందుగా కొంత మొత్తాన్ని డౌన్ పేమెంట్‌గా చెల్లించాల్సి వస్తుంది. దీన్ని ఇంటి కొనుగోలు ధరలో దాదాపు 20 శాతం వరకూ చేయడం మంచిది. కొంతమంది రుణదాతలు మొత్తం ఇంటి విలువకు రుణం ఇస్తారు. ఇందులో ఏది ఎంచుకోవాలన్నది సొంతంగా అలోచించి నిర్ణయం తీసుకోవాలి. వీలైనంత ఎక్కువ మొత్తాన్ని డౌన్ పేమెంట్‌గా చెల్లించి, రుణం తీసుకోవడం మంచిది. దీనివల్ల దీర్ఘకాలంలో వడ్డీ భారం తగ్గుతుంది. హోంలోన్ తీసుకోవాలనుకున్నప్పుడు ముందుగా మీ దీర్ఘకాలిక లక్ష్యాలను పరిశీలించండి. ఒక్కసారి ఋణం తీసుకున్నా తర్వాత మీ ఆదాయంలో అధిక భాగం ఈ రుణ వాయిదాకే వెళ్తుంది. కాబట్టి. ఈ విషయంలో ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబానికి ఎమర్జెన్సీ సమయంలో సహాయానికి తగిన ఆర్ధిక భరోసా కల్పించాలి. ఇందుకోసం లోన్ కవర్ టర్మ్ పాలసీని ఎంచుకోవాలి. దీంతో పాటు మీ వార్షికాదాయానికి 10-12 రెట్ల వరకూ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి.
ఇది చదవండి: ఆషాడంలో భార్యాభర్తలు కలిస్తే ఏమవుతుందో తెల్సా.? ఎందుకు కలిసి ఉండకూడదంటే
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








