LPG Cylinder Delivery: మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ వాడుతున్నారా..? అయితే మీరు గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకున్న తర్వాత డెలివరీ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే మోసపోవాల్సి వస్తుంది. గ్యాస్ సిలిండర్ సీలు చూసి కొత్త సిలిండర్ కదా అని అనుకోవడానికి వీలు లేదు. కొన్ని సందర్భాలలో త్వరగా గ్యాస్ అయిపోతుంది. ఇదేంటి కొత్త సిలిండరు తక్కువ రోజులు వచ్చింది. ఎందుకు త్వరగా అయిపోయిందని కొందరికి అనుమానం రావచ్చు. అందుకు కారణం సిలిండర్‌లో గ్యాస్ తక్కువగా వచ్చిందని అర్థం. ఎందుకంటే గ్యాస్ సిలిండర్ వచ్చిన తర్వాత ఎంత గ్యాస్ ఉందని విషయం పెద్దగా పట్టించుకోము.
మీరు గ్యాస్ సిలిండర్ తీసుకునే సమయంలో ఎల్‌పీజీ సిలిండర్ బరువు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. డెలివరీ బాయ్ వద్ద బరువు చూసే మెషీన్ ఉంటుంది. గ్యాస్ సిలిండర్‌లో గ్యాస్ బరువు 14.2 కేజీలు ఉంటుంది. సిలిండర్ బరువు 15.3 కేజీలు ఉంటుంది. అంటే మొత్తంగా సిలిండర్ బరువు 29.5 కేజీలు ఉండాలి. మీ ఇంటికి వచ్చే సిలింబర్ ఈ బరువు కన్నా తక్కువ ఉంటే మీరు డెలివరీ బాయ్‌పైనా గ్యాస్ ఏజెన్సీకి ఫిర్యాదు చేయవచ్చు. బరువు తక్కువగా ఉన్న సిలిండర్ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు. లేకపోతే మీరు నష్టపోతారు. అలాగే 1800 2333 555 నెంబర్‌కు కాల్ చేసి కూడా మీరు ఫిర్యాదు చేయవచ్చు. ఈ నెంబర్ ఇండేన్ గ్యాస్ కస్టమర్లకు వర్తిస్తుంది.