Jio Tele OS: స్మార్ట్ టీవీల విషయంలో జియో షాకింగ్ నిర్ణయం.. ప్రత్యేక ఓఎస్ విడుదలకు సన్నాహాలు

టెలివిజన్ అనేది చాలా ఏళ్లుగా ప్రజలు బాగా ఇష్టపడే ప్రసార సాధనంగా ఉంది. ముఖ్యంగా బయట కష్టపడి వచ్చి టీవీ చూస్తూ సేదతీరే వాళ్లు చాలా మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో పెరిగిన టెక్నాలజీకు అనుగుణంగా టీవీల్లో చాలా మార్పులు వచ్చాయి. ఇటీవల కాలంలో స్మార్ట్ టీవీలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ నేపథ్యంలో స్మార్ట్ టీవీల విషయంలో ప్రముఖ టెలికం కంపెనీ జియో సంచలన నిర్ణయం తీసుకుంది.

Jio Tele OS: స్మార్ట్ టీవీల విషయంలో జియో షాకింగ్ నిర్ణయం.. ప్రత్యేక ఓఎస్ విడుదలకు సన్నాహాలు
Jio Tele Os

Updated on: Feb 21, 2025 | 3:15 PM

రిలయన్స్ జియో స్మార్ట్ టీవీల కోసం కొత్తగా అభివృద్ధి చేసిన ఆపరేటింగ్ సిస్టమ్ అయిన జియోటెలి ఓఎస్ ఆవిష్కరించింది. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. ముఖ్యంగా భారతదేశం కోసమే జియోటెలి ఓఎస్‌ను రూపొందించినట్లు కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఏఐ సేవలను కూడా స్మార్ట్ టీవీల్లో అందించేలా జియోటెలి ఓఎస్ ఏఐ ఆధారిత సిఫార్సులను అందిస్తుందని చెబుతున్నారు. ఇది వినియోగదారులకు ఆసక్తి అనుగుణంగా వారి సెర్చ్ చేసే అంశాలను సులభంగా అందిస్తుంది. కానీ ఆయా సిఫార్సులు వినియోగదారు వ్యూ హిస్టరీకు చరిత్ర ఆధారంగా ఉంటాయా లేదా ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న సినిమాలు, టీవీ షోలను చూపిస్తాయా అని స్పష్టం చేయలేదు.

రిలయన్స్ జియో టెలీ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్  సాఫ్ట్ 4 కే స్ట్రీమింగ్‌తో వస్తుందని టెక్ నిపుణులు చెబతున్నారు. సాధారణ ఛానెల్‌లతో పాటు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ వంటి ప్రసిద్ధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు కూడా యాక్సెస్‌ను అందిస్తుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా లోకల్‌తో పాటు వరల్డ్ కంటెంట్‌ను సమగ్రపరుస్తుందని చెబుతున్నారు. అయితే జియో తాజా ఓఎస్‌కు సంబంధించిన మిగిలిన వివరాలను జియో అధికారికంగా వెల్లడించలేదు. అయితే జియోటెలి ఓఎస్ యాడెడ్ రిమోట్‌తో ఆడేలా క్లౌడ్ ఆధారిత గేమ్‌లకు మద్దతు ఇస్తుందని నిపునులు చెప్పడం విశేషం.

రిలయన్స్ జియో కూడా సకాలంలో ఓఎస్ అప్‌డేట్‌లు, భద్రతా ప్యాచ్‌లను అందిస్తామని హామీ ఇచ్చింది. కానీ ఈ స్మార్ట్ టీవీలు ఎన్ని సంవత్సరాల అప్‌డేట్‌లను పొందుతాయో వివరాలు లేవు. జియో టెలీ ఓఎస్‌తో నడుస్తున్న స్మార్ట్ టీవీలు శుక్రవారం నుంచి కొనుగోలు అందుబాటులోకి రానున్నాయి. కోడాక్, జేవీసీ, బీపీఎల్, థాంప్సన్ వంటి వివిధ కంపెనీల మోడల్స్‌లో జియో ఓఎస్ ఉండనుంది. రాబోయే నెలల్లో మరిన్ని మార్కెట్లోకి వచ్చే మోడల్స్‌లో జియో ఓఎస్ ఉండే  అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి