ఐపీఎల్ 2021 షెడ్యూల్‌ను బీసీసీఐ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీ మొత్తం 60 రోజుల పాటు సాగనుంది. అహ్మదాబాద్ మొతేరా స్టేడియం వేదికగా మే 30న టోర్నీ ఫైనల్ జరగనుంది. ఇక ఐపీఎల్ మ్యాచ్‌లన్నీ కూడా డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రసారం కానున్నాయి. మాములుగా అయితే ఇందులో మ్యాచ్‌లను లైవ్‌లో చూడాలంటే ప్రతీ నెలా రూ. 399 చెల్లించాల్సిందే. కానీ జియో యూజర్లు ఐపీఎల్ మ్యాచ్‌లను ఉచితంగా చూడవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
టెలికాం దిగ్గజం జియో తమ యూజర్ల కోసం అనేక ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రీఛార్జ్ ప్లాన్స్‌లో డిస్నీ హాట్‌స్టార్ ఉచిత సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంది. తద్వారా మీరు ఐపీఎల్ మ్యాచ్‌లను ఉచితంగా చూడవచ్చు. దీనితో పాటు, మీకు ఉచిత కాలింగ్, డేటా, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. మరి ఆ రీఛార్జ్ ప్లాన్స్ ఏంటో తెలుసుకుందాం..
ఈ రీఛార్జ్ ప్లాన్ ద్వారా, మీకు 28 రోజులకు 90GB డేటాను పొందుతారు. దీనిలో రోజుకు 3GB, 6GB అదనపు డేటా లభిస్తుంది. రోజువారీ డేటా పూర్తయిన తర్వాత ఇంటర్నెట్‌ను 64 Kbps వేగంతో ఉపయోగించవచ్చు. ఇవే కాకుండా, మీరు అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు కూడా పొందుతారు.
ఈ రీఛార్జ్ ప్లాన్ ద్వారా, మీరు రోజుకు 1.5GB డేటాను పొందుతారు. రోజువారీ డేటా పూర్తయిన తర్వాత ఇంటర్నెట్‌ను 64 Kbps వేగంతో ఉపయోగించవచ్చు. 56 రోజులు వ్యాలిడిటీ ఉన్న ఈ ప్లాన్‌కు ఎలాంటి వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్ సౌకర్యం లభించదు.
ఈ రీఛార్జ్ ప్లాన్ ద్వారా, రోజుకు 2GB డేటా లభిస్తుంది. 56 రోజులు వ్యాలిడిటీ ఉన్న ఈ ప్లాన్‌కు అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS పొందవచ్చు. ఇక రోజువారీ డేటా అయిపోయిన తర్వాత మీరు 64 Kbps వేగంతో ఇంటర్నెట్‌ను ఉపయోగించవచ్చు.
ఈ రీఛార్జ్ ప్లాన్ ద్వారా, మీరు 84 రోజుల పాటు మొత్తం 131GB డేటాను పొందుతారు. దీనిలో, మీరు రోజుకు 1.5GB డేటా, 5GB అదనపు డేటా లభిస్తుంది. రోజువారీ డేటా అయిపోయిన తర్వాత మీరు 64 Kbps వేగంతో ఇంటర్నెట్‌ను ఉపయోగించవచ్చు. ఇవే కాకుండా, మీరు అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS పొందవచ్చు.
ఈ రీఛార్జ్ ప్లాన్ ద్వారా, రోజుకు 2GB డేటా, 10GB అదనపు డేటా లభిస్తుంది. రోజువారీ డేటా అయిపోయిన తర్వాత మీరు 64 Kbps వేగంతో ఇంటర్నెట్‌ను ఉపయోగించవచ్చు. వ్యాలిడిటీ సంవత్సరం. అంతేకాకుండా రోజుకు 100SMS, అపరిమిత వాయిస్ కాల్స్ కూడా పొందవచ్చు. ఈ అన్ని ప్లాన్స్‌కు డిస్నీ + హాట్‌స్టార్‌తో పాటు జియోటివి, జియో సినిమా, జియోన్యూస్, జియో సెక్యూరిటీ, జియోక్లౌడ్‌ను కూడా ఉచితంగా పొందవచ్చు.
కన్న కొడుకు కోసం తండ్రి పోరాటం.. మొసలి పొట్ట కోసి బాలుడిని బయటికి తీశాడు.. కానీ.!
కోతిని అమాంతం మింగేసిన రాకాసి బల్లి.! ఒళ్లుగగుర్పొడిచే వీడియో.. నెట్టింట్లో వైరల్.!