Jio Recharge Plans: ప్రస్తుతం దేశ టెలికాం రంగంలో తీవ్రమైన పోటీ నెలకొంది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు నెట్‌వర్క్ ప్రొవైడర్స్ ఒకరు మించి ఒకరు ఆకట్టుకునే ఆఫర్స్‌ను ప్రకటిస్తున్నారు. ఇదిలా ఉంటే టెలికాం రంగంలోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి సంచలనాలను సృష్టిస్తూ రిలయన్స్ జియో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. యూజర్ల కోసం ఎన్నో రకాల ఆఫర్స్ సైతం ప్రకటించింది. ఈ క్రమంలోనే వినియోగదారులకు రూ.3.5కే 1జీబీ డేటాను అందిస్తోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..
రిలయన్స్ జియో రూ.599 రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం విదితమే. ఈ ప్లాన్‌తో 84 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 2జీబీ డేటా కూడా లభిస్తుంది. అంటే 84 రోజులకు గానూ మొత్తం 168 జీబీ డేటాను అందిస్తోంది. ఈ లెక్కన చూస్తే 1 జీబీ డేటాకు అయ్యే ఖర్చు కేవలం రూ.3.5 మాత్రమే.
ఇతర ప్లాన్‌లతో పోలిస్తే ఈ ప్లాన్ చాలా చౌక అనే చెప్పాలి. ప్రతి రోజూ 2జీబీ డేటా అందించే రూ.249, రూ.444ను పరిశీలిస్తే.. 56 రోజుల వ్యాలిడిటీతో ఉన్న ఈ ప్లాన్‌లో మొత్తం 112 జీబీ డేటా కస్టమర్లకు లభిస్తుంది. అంటే 1 జీబీ డేటాకు దాదాపు రూ.4 వరకు చెల్లించాల్సి ఉంటుంది. కాగా, రూ.599 ప్లాన్‌తో కస్టమర్లు అపరిమిత ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడమే కాకుండా జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్ తదితర యాప్‌లకు ఉచితంగా సబ్ స్క్రిప్షన్ పొందవచ్చు.
Also Read:
ఏటీఎంలో డబ్బును ఇలా కూడా డ్రా చేయొచ్చా.. యువతి చేసిన పనికి నెటిజన్లు ఫిదా.. వైరల్ వీడియో..
అద్భుతమైన పోస్టాఫీస్ స్కీమ్.. ప్రతీ నెలా రూ. 5042 కడితే.. రూ. 7.25 లక్షలు పొందొచ్చు..