Jio Phone Offer 2021: యూజర్లకు బంపరాఫర్.. రెండేళ్ల అన్‌లిమిటెడ్‌ కాల్స్‌తో రూ. 2 వేలకు జియో ఫోన్..

|

Feb 27, 2021 | 1:06 PM

Jio Phone Offer: భారత టెలికాం రంగంలో సంచలనం సృష్టిస్తున్న రిలయన్స్ జియో తాజా సంచలన ప్రకటన చేసింది. సుమారు 300 మిలియన్ల...

Jio Phone Offer 2021: యూజర్లకు బంపరాఫర్.. రెండేళ్ల అన్‌లిమిటెడ్‌ కాల్స్‌తో రూ. 2 వేలకు జియో ఫోన్..
Follow us on

Jio Phone Offer: భారత టెలికాం రంగంలో సంచలనం సృష్టిస్తున్న రిలయన్స్ జియో తాజా సంచలన ప్రకటన చేసింది. సుమారు 300 మిలియన్ల ఫీచర్ ఫోన్ యూజర్ల కోసం రెండు రకాల ఆఫర్లను ‘న్యూ జియో ఫోన్ 2021’ పేరిట విడుదల చేసింది. ఆ ఆఫర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

మొదటి ఆఫర్ ఇలా ఉంది… కేవలం రూ. 1,999కి జియో ఫోన్‌తో పాటు రెండేళ్ల వరకు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు ప్రతీ నెలా 2 జీబీ డేటాను యూజర్లకు అందించనున్నట్లు ప్రకటించింది. రెండో ఆఫర్ ఇలా ఉంది… రూ. 1499 ధరకు కొనుగోలు చేసే ఫీచర్ ఫోన్ యూజర్లకు 12 నెలల పాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు ప్రతీ నెలా 2 జీబీ డేటాను అందించనుంది. ఈ రెండు ఆఫర్లు మార్చి 1వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయని.. మీ దగ్గరలోని రిలయన్స్ రిటైల్, జియో రిటైలర్లలో ఆఫర్ లభిస్తుందని పేర్కొంది.

కాగా, జియో డైరెక్టర్ ఆకాష్ అంబానీ మాట్లాడుతూ.. ప్రపంచం 5జీకి తొందర్లోనే అడుగుపెడుతున్న వేళ.. సుమారు 300 మిలియన్ సబ్‌స్క్రైబర్లు 2జీ తరంలోనే ఉన్నారని.. వారు ఇంటర్నెట్ సదుపాయం పొందలేకపోతున్నారని అన్నారు. ప్రతీ భారతీయుడికి ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకొచ్చే దిశలో భాగంగా ఈ ఆఫర్ మరో ముందడుగు అని వ్యాఖ్యానించారు. తమ ప్రత్యర్ధులు ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియాల కంటే 2.5 రెట్ల చౌక ధరకే యూజర్లకు జియో ఫోన్ 2021ను ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.

జియో యూజ‌ర్ల ఆఫర్:

రూ.749 ప్లాన్‌పై ఏడాది పాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు ప్రతీ నెలా 2 జీబీ డేటా

కొత్త యూజర్ల కోసం న్యూ జియో ఫోన్ 2021 ఆఫ‌ర్:

కేవలం రూ. 1,999కి జియో ఫోన్‌తో పాటు రెండేళ్ల వరకు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు ప్రతీ నెలా 2 జీబీ డేటా

రూ. 1499 ధరకు కొనుగోలు చేసే ఫీచర్ ఫోన్ యూజర్లకు 12 నెలల పాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు ప్రతీ నెలా 2 జీబీ డేటా

మరిన్ని ఇక్కడ చదవండి:

కస్టమర్‌పై అరిస్తే.. డెలివరీ బాయ్‌ను మంచి పని చేశావంటున్నారు.. కారణం ఏంటంటే.. వీడియో వైరల్..!

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అగ్రస్థానానికి టీమిండియా.. అదే జరిగితే టోర్నీ నుంచి ఔట్.!

న్యూడ్ ఫోటో అడిగిన నెటిజన్‌కు యాంకర్ శ్రీముఖి అదిరిపోయే కౌంటర్.. ఏం షేర్ చేసిందంటే.!

హైదరాబాద్‌లోని బాలానగర్‌ ఫ్లైఓవర్‌ కుప్పకూలిందా.? వైరల్ అవుతున్న వీడియో.! ఎప్పటిదంటే..!!