
జియో మరో అదిరిపోయే ప్లాన్ తీసుకొచ్చింది. స్మార్ట్ టీవీ వాడే వినియోగదారులకు సూపర్ ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది. మీ ఇంట్లో స్మార్ట్ టీవీ వాడుతుంటే దీని గురించి తెలుసుకోవాల్సిందే. జియోహోమ్ టీవీ పేరుతో సరికొత్త ప్యాక్‌ను జియో అందుబాటులోకి తెచ్చింది. కేవలం రూ.400 నుంచే ఈ హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్ మొదలవుతోంది. ఇందులో 1,000కుపైగా లైవ్ టీవీ ఛానళ్లతో పాటు ప్రీమియం OTT యాప్‌లు, హై-స్పీడ్ వై-ఫై సేవలు ఒకే ప్లాన్‌లో పొందవచ్చు. కేవలం నెలకు రూ.400 (అన్ని పన్నులతో కలిపి) చెల్లిస్తే చాలు.. 1,000కు పైగా లైవ్ టీవీ ఛానళ్ల యాక్సెస్ లభిస్తుంది. ఈ ఆఫర్ పరిమిత కాలం పాటు అందుబాటులో ఉంటుందని జియో తెలిపింది. వెల్‌కమ్ ఆఫర్లో భాగంగా ఈ ప్యాక్‌ను తీసుకున్నవారికి మొదటి నెలకు 30 Mbps వేగంతో అన్‌లిమిటెడ్ ఉచిత వై-ఫై పొందవచ్చు. అలాగే 12 ప్రీమియం OTT సబ్‌స్క్రిప్షన్లు ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా లభిస్తాయి.
ఈ ప్యాక్‌ను రూ.2,400 (GSTతో కలిపి) ఫస్ట్ రీఛార్జ్ (FRC) ద్వారా పొందవచ్చు. ఆరు నెలల సబ్‌స్క్రిప్షన్‌కు ఈ రీఛార్జ్ వర్తిస్తుంది. నెలకు కేవలం రూ.400 మాత్రమే అవుతుంది. ఒకేసారి చెల్లిస్తే ధరల ప్రయోజనం వినియోగదారులకు లభిస్తుంది. ఎలాంటి ఇన్‌స్టాలేషన్, సెక్యూరిటీ ఛార్జీలు ఉండవు. దీంతో ఎలాంటి ముందస్తు ఆర్థిక భారం లేకుండా ప్రీమియం హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఇంట్లోనే ఆస్వాదించవచ్చని జియో స్పష్టం చేసింది.
ఈ ప్రత్యేక ప్యాక్‌లో లైవ్ టీవీతో పాటు హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్, ప్రీమియం OTT కంటెంట్‌ను ఒకే ప్యాక్‌లో పొందవచ్చు. కనెక్టెడ్ హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు దీని ద్వారా జియో కొత్త నిర్వచనం ఇస్తోంది. దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికీ సులభమైన, విలువ ఆధారిత డిజిటల్ సేవలను అందించాలనే లక్ష్యంతో జియో ఆఫర్ ప్రవేశపెట్టిందని చెప్పవచ్చు. ఇంటర్నెట్‌తో పాటు టీవీ, ఓటీటీ చానళ్లు ప్రత్యేకంగా సబ్‌స్కైబ్ చేసుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. కానీ ఈ ప్యాక్ తీసుకుంటే అన్నీ ఒకే ప్యాక్‌లో పొందవచ్చు. దీని వల్ల డబ్బులు ఆదా అవుతాయి.