AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cars Exports: భారతీయ కార్లకు పెరుగుతున్న డిమాండ్..ఆ దేశానికి పెరిగిన ఎగుమతులు

భారతదేశంలో తయారీ రంగం వేగంగా విస్తరిస్తుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పీఎల్ఐ పథకం ద్వారా అన్ని రకాల ఉత్పత్తుల తయారీలో దూసుకుపోతుంది. అయితే ఇటీవల దేశంలో కార్ల తయారీ బాగా పెరిగింది. తయారీకు తగినట్లే ఎగుమతులు పెరిగాయి. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల నుంచి భారతీయ కార్లకు డిమాండ్ పెరిగింది.

Cars Exports: భారతీయ కార్లకు పెరుగుతున్న డిమాండ్..ఆ దేశానికి పెరిగిన ఎగుమతులు
Car Exports
Nikhil
|

Updated on: May 27, 2025 | 4:45 PM

Share

2025 ఆర్థిక సంవత్సరంలో తొలిసారిగా భారత కార్ల ఎగుమతుల్లో టాప్-5 దేశాల్లో జపాన్ చేరింది. సుజుకి మోటార్ కార్ప్, హెూండా మోటార్ కో వంటి ప్రధాన కార్ల తయారీ కంపెనీలు భారతదేశంలో అధికంగా కార్లను ఉత్పత్తి చేయడంతో పాటు వాటిని ఎగుమతి చేస్తున్నాయి. వాణిజ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం జపాన్‌కు కార్ల ఎగుమతులు 2025 ఆర్థిక సంవత్సరంలోని మొదటి తొమ్మిది నెలల్లో 616.45 మిలియన్ల డాలర్లకు పెరిగాయి. 20224 ఆర్థిక సంవత్సరంలో 220.62 మిలియన్ల డాలర్లుగా ఉంది. మార్చి త్రైమాసికానికి సంబంధించిన అధికారిక డేటా ఇంకా వెల్లడికానప్పటికీ జపాన్‌కు ఎగుమతులు మరింత పెరుగుతాయని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా జనవరిలో మారుతి సుజుకి తన జిమ్నీ ఎస్‌యూవీను జపాన్‌కు ఎగుమతి చేయడం ప్రారంభించాక ఎగుమతులు పెరిగాయని పేర్కొంటున్నారు. 

భారతదేశంలో ఉత్పత్తి చేసిన ఈ-విటారా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను యూరోపియన్ మార్కెట్లతో పాటు జపాన్‌కు పెద్ద సంఖ్యలో ఎగుమతి చేయాలని మారుతీ సుజుకీ కంపెనీ యోచిస్తోందని ఆ కంపెనీ ప్రతినిధులు చెబతున్నారు. మారుతీ సుజుకీ  2024లో 5.12 మిలియన్ వాహనాలను జపాన్‌కు ఎగుమతి చేసింది.హెూండా కార్స్ ఇండియా 45,167 యూనిట్ల ఎస్‌యూవీ ఎలివేటు ఎగుమతి చేసింది. ప్రధానంగా జపాన్‌కు దేశీయ అమ్మకాలు 22,321 యూనిట్లను అధిగమించాయి. మారుతి సుజుకి జపాన్‌లో ఫ్రాంక్స్, జిమ్నీ ఎస్‌యూవీలను అందిస్తోంది. అయితే మారుతీ సుజుకీ కొత్త జిమ్నీ ఫైవ్ – డోర్ బుకింగ్లను తాత్కాలికంగా నిలిపివేసింది. లాంచ్ తర్వాత అధిక డిమాండ్ కారణంగా జపాన్‌లో నాలుగు రోజుల్లోనే దాదాపు 50,000 ఆర్డర్లను అందుకుంది.

భారతీయ ఓఈఎంలు ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి కీలక మార్కెట్లలోకి విస్తరించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వ మోడళ్లతో అభివృద్ధి చెందిన మార్కెట్లలోకి ప్రవేశించడం ప్రారంభించాయని నిపుణులు చెబుతున్నారు. ద్విచక్ర వాహన రంగంలో యమహా త్వరలో జపాన్‌కు ప్రీమియం మోటార్ సైకిళ్లను ఎగుమతి చేయడం ప్రారంభించాలని యోచిస్తోంది. యమహా మోటార్ ఇండియా గ్రూప్ చైర్మన్ ఇటారు ఒటాని మాట్లాడుతూ ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో సోర్సింగ్ ఖర్చు, లేబర్ ఖర్చు చాలా తక్కువగా ఉందని అన్నారు. ఇప్పటికే తమ ఉత్పత్తిలో దాదాపు మూడింట ఒక వంతును 58 దేశాలకు ఎగుమతి చేస్తున్నామని చెప్పారు గత సంవత్సరంలో భారతదేశం నుంచి యూరప్‌కు ఎగుమతులు ప్రారంభించాము. తదుపరి జపాన్, యుఎస్ వంటి ఇతర అధునాతన మార్కెట్లకు రవాణా చేస్తామని పేర్కొన్నారు. 

ఇవి కూడా చదవండి

గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆటోమొబైల్ ఎగుమతులు 15 శాతం పెరిగి 770,364 వాహనాలకు చేరుకున్నాయి. దేశీయ అమ్మకాల వృద్ధి 2 శాతం కంటే గణనీయంగా ఎక్కువగా 4.3 మిలియన్ వాహనాలను విక్రయించింది. కాంపాక్ట్ ప్యాసింజర్ వాహనాలు ఎగుమతుల్లో 27 శాతం కంటే ఎక్కువ వాటా కలిగి ఉన్నాయి. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..