AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Car AC maintenance: ఎండల్లో హాయ్ హాయ్.. ఈ చిట్కాలతో కారులో కూల్‌కూల్

వేసవి కాలంలో మండుతున్న ఎండల్లో ప్రయాణం చేయాలంటే అందరికీ హడలే. ఉక్కబోత, ఎండ కారణంగా తీవ్ర ఇబ్బందులు తప్పవు. అయితే కార్లలో ప్రయాణం చేసేవారికి మాత్రం దానిలోని ఏసీ కారణంగా కొంచెం ఉపశమనం లభిస్తుంది. ప్రస్తుతం ప్రతి కారులోనూ ఏసీలు అందుబాటులోకి వచ్చాయి. వాటిని ఆన్ చేసుకుని ఎండల్లోనూ చక్కగా ప్రయాణం చేసుకోవచ్చు.

Car AC maintenance: ఎండల్లో హాయ్ హాయ్.. ఈ చిట్కాలతో కారులో కూల్‌కూల్
Auto Maintenance
Nikhil
|

Updated on: May 27, 2025 | 5:15 PM

Share

వేసవి కాలంలో ఏసీ అనేది ప్రయాణ సమయంలో అత్యంత అవసరంగా మారింది. ఈ నేపథ్యంలో కారులో ఎయిర్ కండీషనింగ్ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దాని వల్ల చక్కని చల్లదనంతో పాటు నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి. ఈ కింది తెలిపిన చిట్కాలు పాటించడం వల్ల చాలా ప్రయోజనం కలుగుతుంది.

కారు తలుపులు తెరవండి

  • ఏసీని ఆన్ చేసే ముందుగా కారులోని అన్ని తలుపులూ తెరవండి. లోపలి వేడి గాలి బయటకు పోతుంది.
  • ఏసీ టు రీసర్క్యూలేషన్ మోడ్ ను ఉపయోగించాలి. తద్వారా వేగంగా చల్లబడుతుంది.
  • ఏసీలో ఉష్ణోగ్రతను 22 నుంచి 25 సెల్సియస్ మధ్య సెట్ చేసుకోవాలి. దీని వల్ల చల్లదనం చక్కగా అందడంతో పాటు నిర్వహణలో ఇబ్బందులు రావు.
  • మన ముఖం మీద డైరెక్ట్ గా ఏసీ గాలి తగలకుండా చర్యలు తీసుకోవాలి. దాని కోసం వెంట్లను వినియోగించాలి. దాని వల్ల అన్ని దిశలకు గాలి సక్రమంగా ప్రసరిస్తుంది.

నిర్వహణ

  • ఏసీ సక్రమంగా పనిచేయాలంటే దాన్ని నిర్వహణ బాగుండాలి. ముఖ్యంగా క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్ ను క్రమం తప్పకుండా మార్చాలి. మూసుకుపోయిన ఫిల్టర్ గాలి ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. తద్వారా ఏసీ సామర్థ్యం తగ్గిపోతుంది. మూసుకుపోయిన, మురికిగా ఉండే ఏసీ ఫిల్టర్ వల్ల చల్లదనం స్థాయి కూడా తగ్గిపోతుంది.
  • రిఫ్రిజెరాంట్ స్థాయిలను తరచూ తనిఖీ చేసుకోవాలి. ఏసీ కంప్రెసర్ సక్రమంగా పని చేస్తుందో, లేదో పరిశీలించాలి. రిఫ్రిజెరాంట్ స్థాయి తక్కువగా ఉంటే చల్లదనం తగ్గిపోతుంది. అలాగే కంప్రెసర్ పై ఒత్తిడి పెరిగిపోతుంది.
  • కండెన్సర్లను తరచూ శుభ్రం చేయడం వల్ల రిఫ్రిజెరాంట్ చల్లదనం పెరుగుతుంది. చల్లని నెలల్లో ఏసీని క్రమం తప్పకుండా నడపాలి.

శుభ్రత

  • కారు క్యాబిన్ ను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఏసీ పనితీరు సమర్థంగా ఉంటుంది. గాలి ప్రవాహానికి అడ్డంకులు ఉండవు. ఏసీ వ్యవస్థపై ఒత్తిడి తగ్గిపోతుంది.
  • క్యాబిన్ శుభ్రంగా ఉంటే ఇంధన ఖర్చులు తగ్గుతాయి. తక్కువ శక్తితో చక్కగా పనిచేస్తుంది.
  • క్లట్టర్ – ఫ్రీ క్యాబిన్, మూసుకుపోయిన వెంట్లు, మండే పదార్థాల పేరుకుపోవడం తదితర సమస్యలు ఉండవు.
  • ఓవర్ లోడింగ్ వల్ల ఇంజిన్ పై ఒత్తిడి పెరిగి, వేడెక్కిపోయే అవకాశం ఉంది. దూకుడుగా డ్రైవింగ్ చేయడం వల్ల కూడా ఎయిర్ కండీషనింగ్ వ్యవస్థ దెబ్బతింటుంది.