Income Tax: ఇందులో మీరు కూడా ఉన్నారా? ఆదాయపు పన్ను శాఖ 1.65 లక్షల మందికి నోటీసులు!

Income Tax: అధికారిక గణాంకాల ప్రకారం, ఆదాయపు పన్ను శాఖ ఇప్పటివరకు సెక్షన్ 143(2) కింద వివరణాత్మక పరిశీలన కోసం సుమారు 1.65 లక్షల కేసులను ఎంపిక చేసింది. ఈ సంఖ్య మునుపటి సంవత్సరాల కంటే చాలా ఎక్కువ. కేవలం ఐటీఆర్ దాఖలు చేయడం సరిపోదని నిపుణులు..

Income Tax: ఇందులో మీరు కూడా ఉన్నారా? ఆదాయపు పన్ను శాఖ 1.65 లక్షల మందికి నోటీసులు!

Updated on: Jul 08, 2025 | 8:01 AM

ఐటీఆర్ దాఖలు చేయడానికి చివరి తేదీ దగ్గర పడుతుండటంతో, ఆదాయపు పన్ను శాఖ కూడా మరింతగా నిఘా పెంచుతోంది. ఐటీ చట్టంలోని సెక్షన్ 143(2) ప్రకారం, 1.65 లక్షల కేసుల పరిశీలిస్తోంది. పన్ను క్లెయిమ్ వ్యత్యాసాలు, అధిక రిస్క్ లావాదేవీలు లేదా ఆదాయాన్ని తక్కువగా నివేదించడం గుర్తించినట్లయితే, నోటీసులు కూడా అందుకోవచ్చు. లక్షన్నరకుపైగా కేసులను గుర్తించిన ఆదాయపు పన్ను శాఖ వారికి నోటీసులు పంపేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

ఆదాయపు పన్ను రిటర్నులు (ITR) దాఖలు చేయడానికి సెప్టెంబర్ 15 చివరి తేదీ సమీపిస్తున్న తరుణంలో పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు పడే అవకాశాం ఉంది. ఈ సంవత్సరం ఆదాయపు పన్ను శాఖ సెక్షన్ 143(2) కింద వివరణాత్మక పరిశీలన కోసం సుమారు 1.65 లక్షల కేసులను గుర్తించింది. ఇటువంటి చర్యలు వ్యత్యాసాలు, పన్ను ఎగవేతపై పెరుగుతున్న నిఘాను ప్రతిబింబిస్తాయి. అందుకే పన్ను చెల్లింపుదారులు దాఖలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్‌ దాఖలు చేసినంత మాత్రన తమ బాధ్యత ముగిసిందని భావించవద్దని చెబుతున్నారు.

అనేక సాధారణ తప్పులు, లోపాల వల్ల ఆదాయపు పన్ను నోటీసుకు దారితీయవచ్చు. ఫారమ్ 26AS లేదా వార్షిక సమాచార ప్రకటన (AIS)లో నివేదించిన టీడీఎస్‌, ఐటీఆర్‌లో ప్రకటించిన ఆదాయం మధ్య తేడా ఉండటం వల్ల సమస్య ఎదుర్కొవచ్చు. ఇది ముఖ్యంగా జీతం పొందే వ్యక్తులు, ఫ్రీలాన్సర్లు, ఎక్కువ ఆదాయ వనరులు కలిగిన వారిలో సర్వసాధారణం. అయితే డాక్యుమెంట్స్‌ సమర్పించే ముందు క్రాస్-వెరిఫై చేయడం ద్వారా ఇటువంటి సమస్యలను సులభంగా నివారించవచ్చు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Gold Price Today: మగువలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. వెండి ఎంతంటే..

అయితే 2025-26 అసెస్‌మెంట్ సంవత్సరంలో ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఆదాయపు పన్ను శాఖ కఠినంగా దర్యాప్తు చేయబోతోంది. ఆదాయపు పన్ను శాఖ దీనికి సంబంధించి నోటీసు పంపుతుంది. ఇందులో ఐటీఆర్‌లో నమోదు చేసిన ఆదాయం, పన్ను, తగ్గింపు, పెట్టుబడి, పన్ను మినహాయింపులను పరిశీలిస్తారు.

1.65 లక్షలకు పైగా కేసుల దర్యాప్తు ప్రారంభం:

అధికారిక గణాంకాల ప్రకారం, ఆదాయపు పన్ను శాఖ ఇప్పటివరకు సెక్షన్ 143(2) కింద వివరణాత్మక పరిశీలన కోసం సుమారు 1.65 లక్షల కేసులను ఎంపిక చేసింది. ఈ సంఖ్య మునుపటి సంవత్సరాల కంటే చాలా ఎక్కువ. కేవలం ఐటీఆర్ దాఖలు చేయడం సరిపోదని నిపుణులు అంటున్నారు. ఏదైనా వ్యత్యాసం కనిపిస్తే, శాఖకు నోటీసు రావచ్చు. మీరు సమయానికి, సరిగ్గా రిటర్న్ దాఖలు చేసినప్పటికీ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నోటీసు అందుకోవచ్చు.

ఇది కూడా చదవండి: Car Mileage: మీరు కారు మైలేజీ పెరగాలా? అద్భుతమైన ట్రిక్స్‌ మీ కోసం!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి