
ITR Deadline Extension: 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్నులు (ITRలు) దాఖలు చేయడానికి సెప్టెంబర్ 15 చివరి రోజు. అంటే ఈ రోజే చివరి గడువు. ఈ గడువు దాటిన తర్వాత ఐటీఆర్ ఫైల్ చేసినట్లయితే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా రిటర్నులు దాఖలు చేయని చాలా మంది పన్ను చెల్లింపుదారులు చివరి నిమిషంలో పొడిగింపు కోసం ఆశిస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో ఓ పుకారు వైరల్ అవుతోంది. ఐటీఆర్ గడువు సెప్టెంబర్ 30 వరకు పొడిగించినట్లు వైరల్ అవుతోంది. అయితే, గడువును ఇకపై పొడిగించబోమని ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది .
ఈ తప్పుడు సమాచారాన్ని ఆదాయపు పన్ను శాఖ తీవ్రంగా ఖండించింది. పన్ను చెల్లింపుదారులు @IncomeTaxIndia నుండి అధికారిక అప్‌డేట్‌లపై మాత్రమే ఆధారపడాలని గుర్తు చేసింది. అధికారిక చివరి తేదీ సెప్టెంబర్ 15, 2025. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వార్త అబద్దమని స్పష్టం చేసింది. ఇలాంటి నమ్మి ఐటీఆర్ ఫైల్ చేయకుండా నిర్లక్ష్యంగా ఉండకూడదని, ఇప్పటి వరకు ఎలాంటి గడువు పొడిగించలేదని చెప్పింది.
“CBDT సెప్టెంబర్ 15, 2025 నాటికి దాఖలు చేయాల్సిన ITRల దాఖలు గడువును పొడిగించింది” అని తప్పుగా పేర్కొంటూ ఆన్‌లైన్‌లో సర్క్యులేట్ చేయబడిన ఒక నకిలీ నోటీసుది. అటువంటి నకిలీ సందేశాలను విస్మరించాలని ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులను కోరింది.
ఇది కూడా చదవండి: Viral Video: నా జోలికొస్తే తాట తీస్తా.. చిరుతలనే రఫ్పాడించిన చిన్న పంది.. ముచ్చెమటలు పట్టించే వీడియో వైరల్!
ఇంకా ఫైల్ చేయని వారి కోసం మీ ITR ఫైల్ చేయడానికి సులభమైన దశల అనుసరించాలని సూచించింది.
పన్ను చెల్లింపుదారులకు సహాయం చేయడానికి ఆదాయపు పన్ను శాఖ 24×7 హెల్ప్‌డెస్క్ మద్దతును కూడా అందిస్తుంది. ఫోన్ కాల్స్, లైవ్ చాట్‌లు, వెబ్‌ఎక్స్ సెషన్‌లు, ట్విట్టర్/ఎక్స్ ద్వారా మద్దతు లభిస్తుంది.
ఇది కూడా చదవండి: Diabetes: అందరికి అందుబాటులో ఉండే ఈ ఆకులు నమిలితే చాలు షుగర్ అస్సలు పెరగదు!
గడువు తర్వాత దాఖలు చేస్తే రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారికి రూ.5,000 జరిమానా, సెక్షన్ 234F కింద తక్కువ ఆదాయం ఉన్నవారికి రూ. 1,000 జరిమానా విధించబడుతుందని గమనించడం ముఖ్యం . పన్ను చెల్లింపుదారులు డిసెంబర్ 31, 2025 వరకు ఆలస్యంగా లేదా సవరించిన రిటర్న్‌లను దాఖలు చేయవచ్చు. అప్‌డేట్ చేసిన రిటర్న్‌లు (ITR-U) మార్చి 31, 2030 వరకు అంగీకరిస్తారు. అదనంగా సెక్షన్ 234A ప్రకారం.. గడువు తేదీ నుండి పన్ను చెల్లించే వరకు చెల్లించని పన్నుపై నెలకు 1% వడ్డీ వర్తిస్తుంది.
ఇది కూడా చదవండి: iPhone 16 Pro: రూ.1.1 లక్షల ఐఫోన్ 16 ప్రో కేవలం రూ.69,000కే.. ఎప్పుడు లేనంత డిస్కౌంట్!
సెప్టెంబర్ 13, 2025 నాటికి ఆరు కోట్లకు పైగా ఐటీఆర్‌లు దాఖలు అయ్యాయని ఆదాయపు పన్ను శాఖ నివేదించింది. గత అసెస్‌మెంట్ సంవత్సరం (2024-25)లో, జూలై 31, 2024 వరకు 7.28 కోట్ల రిటర్న్‌లు దాఖలు అయ్యాయి. ఇది గత సంవత్సరంలో 6.77 కోట్లతో పోలిస్తే, ఇది 7.5% వృద్ధిని సూచిస్తుంది.
ఇది కూడా చదవండి: TRAI: జియో, ఎయిర్‌టెల్ రూ.249 ప్లాన్ తొలగింపుపై స్పందించిన ట్రాయ్.. ఏం చెప్పిందో తెలుసా?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి