Best smartphones: ఈ రెండు బెస్ట్ ఫోన్లలో ఏది మంచిదో చెప్పడం కష్టం.. ప్రత్యేకతలు, ధర వివరాలు ఇవే..!

|

Dec 08, 2024 | 8:00 AM

మొబైల్ మార్కెట్ లో నిత్యం వివిధ రకాల మోడల్ ఫోన్లు విడుదలవుతూ ఉంటాయి. పనితీరులో ఒకదానితో మరొకటి పోటీ పడుతూ ఉంటాయి. బ్యాటరీ, చిప్ సెట్, కెమెరా తదితర విషయాలలో చాలా మెరుగ్గా సేవలు అందిస్తాయి. వీటిలోంచి మనకు నచ్చిన ఫోన్ ను ఎంచుకోవడం ఓ రకంగా సవాలే.

Best smartphones: ఈ రెండు బెస్ట్ ఫోన్లలో ఏది మంచిదో చెప్పడం కష్టం.. ప్రత్యేకతలు, ధర వివరాలు ఇవే..!
Iqoo 13, Realme Gt 7 Pro
Follow us on

స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ చిప్ సెట్ తో వచ్చిన ఐక్యూ 13, రియల్ మీ జీటీ 7 ప్రో ఫోన్లు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. వీటి పనితీరుపై ఎలాంటి సందేహాలు లేవు. కానీ ధర, ఇతర విషయంలో స్వల్ప తేడాలున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు ఫోన్ల మధ్య ఉన్న తేడాలు, ప్రత్యేకతలను తెలుసుకుందాం. ఐక్యూ 13 ఫోన్ కు సంబంధించి 12 జీబీ ర్యామ్, 256 స్టోరేజీ మోడల్ ను రూ.54,999కి విడుదల చేశారు. దీనిలోనే 16 జీబీ ర్యామ్, 512 స్టోరేజీ మోడల్ రూ.59,999కి అందుబాటులో ఉంది. అలాగే ఎస్ బీఐ, హెచ్ డీఎఫ్ సీ కార్డులున్న వారికి మరో 3 వేలు తక్షణ తగ్గింపు లభిస్తుంది. దీనిలో వీటిని రూ.51,999, రూ.56,999 చొప్పున కొనుగోలు చేసే అవకాశం ఉంది. రియల్ మీ జీటీ 7 ప్రో కు సంబంధించి 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ మోడల్ రూ.59,999, అలాగే 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజీ మోడల్ రూ.65,999 ధర పలుకుతున్నాయి. లాంచ్ ఆఫర్ లో భాగంగా స్టాండర్డ్ వేరియంట్ రూ.56,999, అధిక 16 జీబీ ర్యామ్ వేరియంట్ రూ.62,999కి అందుబాటులో ఉన్నాయి.

డిజైన్

  • ఐక్యూ 13 లుకింగ్ పరంగా ఐక్యూ 12 మాదిరిగానే కనిపిస్తోంది. బ్యాక్ కెమెరా మాడ్యూల్ ను ఎనర్జీ హాలో లెడ్ తో భర్తీ చేశారు. ఆరు డైనమిక్ ఎఫెక్టులు, 12 కలర్ కాంబినేషన్లకు మద్దతు ఇస్తుంది. మొత్తానికి కొత్త రంగులతో ఆకర్షణీయంగా ఉంది.
  • స్పోర్ట్స్ స్లీక్ గ్లాస్ బ్యాక్, స్లిమ్ ప్రొఫైల్ తో రియల్ మీ జీటీ 7 ప్రో ఎంతో ఆకట్టుకుంటోంది. మార్స్ ఆరెంజ్, గెలాక్సీ గ్రే అనే రెండు రంగులలో లభిస్తుంది. వెనుక వైపు కెమెరా మాడ్యూల్, మూడు సెన్సార్లు, ఎల్ ఈడీ లైట్ ఉన్నాయి. స్లైలిష్ లుక్ టచ్ తో సూపర్ గా కనిపిస్తోంది.

డిస్ ప్లే

  • ఐక్యూ 13 ఫోన్ లో 6.82 అడుగుల అమోలెడ్ డిస్ ప్లే ఏర్పాటు చేశారు. ఇది 4500 నిట్స్ గరిష్ట ప్రకాశంతో విజువల్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రపంచంలోనే మొట్టమొదటి క్యూ 10 2 కె 144 హెచ్ జెడ్ అల్ట్రా ఐకేర్ డిస్ ప్లేగా పేరు పొందింది.
  • రియల్ మీ జీటీ 7 ప్రో ఫోన్ లో 6.78 అంగుళాల ఓలెడ్ డిస్ ప్లే అమర్చారు. ఇది 120 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్ తో అందిస్తుంది. అనుకూల టోన్, ఐ కేర్, స్క్రీన్ కలర్ మోడ్ లలో అందుబాటులో ఉంది.

ప్రాసెసర్

ఐక్యూ 13, రియల్ మీ జీటీ 7 ప్రో ఫోన్లు క్వాల్కమ్ కొత్త గా రూపొందించిన స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ చిప్ సెట్ తో వచ్చాయి. అలాగే సరికొత్త ఆండ్రాయిడ్ 15 సాఫ్ట్ వేర్ తో పనిచేస్తాయి.

కెమెరా

  • ఐక్యూ 13 స్మార్ట్ ఫోన్ లో 20 మెగా పిక్సల్ సోనీ ప్రైమరీ సెన్సార్, 50 మెగా పిక్సల్ టెలిఫోటో లెన్స్, 50 మెగా పిక్సల్ అల్ట్రా వైడ్ లెన్స్ తో ట్రిపుల్ కెమెరా సెటప్ ఏర్పాటు చేశారు. ముందు భాగంలో 32 ఎంపీ సెల్పీ కెమెరా ఉంది. రాత్రి సమయంలో కూడా స్పష్టమైన ఫొటోలు తీసుకోవచ్చు. దీనిలో ఏఐ ఫీచర్లు కూడా ఉన్నాయి.
  • రియల్ మీ జీటీ 7 ప్రో.. 50 ఎంపీ సోనీ ప్రైమరీ కెమెరా, 50 ఎంపీ సోనీ టెలిఫొటో కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరాతో వస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 16 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ షూటర్ ఏర్పాటు చేశారు.

బ్యాటరీ

  • ఐక్యూ 13 లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. దీన్ని 120 డబ్ల్యూ చార్జర్ తో అరగంటలోనే పూర్తిగా చార్జింగ్ చేసుకోవచ్చు.
  • రియల్ మీ జీటీ 7 ప్రో కూడా 5800 ఎంఏహెచ్ బ్యాటరీతో లభిస్తుంది. దీన్ని కూడా 120 డబ్ల్యూ చార్జర్ తో అరగంటలోనే చార్జింగ్ చేసుకోవచ్చు.

మొత్తానికి రియల్ మీ జీటీ 7 ప్రో కంటే ఐక్యూ 13 అన్ని విధాలుగా మెరుగ్గా ఉంది. పెద్ద డిస్ ప్లే, మెరుగైన కెమెరా లెన్స్, పెద్ద బ్యాటరీ ఉన్నాయి. అలాగే ధర కూడా తక్కువగానే ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి