Ola S1 Air: ఓలా.. అదిరిపోలా..! బుకింగ్స్‌లో దుమ్మురేపుతున్న ఓలా ఎస్ 1 ఎయిర్..

ఓలా ఎస్‌ 1 ఎయిర్‌ పేరుతో తక్కువ ధరలోనే ఈవీ అందుబాటులోకి తీసుకువస్తుంది. ఈ స్కూటర్‌పై అనూహ్యమైన డిమాండ్‌ ఏర్పడింది. ఎంతలా అంటే బుకింగ్స్‌ ఓపెన్‌ చేసిన గంటలోనే ఏకంగా 1000 ఈవీలు వినియోగదారులు బుక్‌ చేసుకున్నారు. కాబట్టి ఓలా ఎస్‌ 1 ఎయిర్‌ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

Ola S1 Air: ఓలా.. అదిరిపోలా..! బుకింగ్స్‌లో దుమ్మురేపుతున్న ఓలా ఎస్ 1 ఎయిర్..
Ola S1 Air
Follow us
Srinu

|

Updated on: Jul 29, 2023 | 3:58 PM

ప్రపంచ వ్యాప్తంగా ఈవీ వాహనాలకు డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా భారతదేశంలో ఈ వాహనాలకు క్రేజ్‌ మామూలుగా లేదు. ప్రారంభంలో కేవలం పట్టణ ప్రాంత ప్రజలు మాత్రమే ఈవీ వాహనాలను వాడేవారు. క్రమేపి పెట్రోల్‌ ధరల పెరుగుదల నేపథ్యంలో గ్రామీణులు కూడా ఈవీ వాహనాల కొనుగోలు ముందుకు వస్తున్నారు. ఇటీవల కాలంలో ఈవీ స్కూటర్లల్లో ఓలా కంపెనీ తన మార్క్‌ను చూపించింది. స్టైలిష్‌ డిజైన్‌తో పాటు వినియోగదారులను ఆకట్టుకునేలా అనేక ఫీచర్లు ఉండడం ఈ వాహనానికి విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. రిలీజ్‌ చేసిన కొన్ని నెలల తర్వాత ఓలా బైక్స్‌పై కొన్ని ఆరోపణలు వచ్చినా క్రమేపి అవి తగ్గాయి. ముఖ్యంగా టైర్‌-3 సిటీల్లో ఓలా కొనుగోళ్లు పుంజుకున్నాయి. దీంతో కంపెనీ కూడా బడ్జెట్‌ ఫ్రెండ్లీ ఈవీ రిలీజ్‌లపై దృష్టి పెట్టింది. ఓలా ఎస్‌ 1 ఎయిర్‌ పేరుతో తక్కువ ధరలోనే ఈవీ అందుబాటులోకి తీసుకువస్తుంది. ఈ స్కూటర్‌పై అనూహ్యమైన డిమాండ్‌ ఏర్పడింది. ఎంతలా అంటే బుకింగ్స్‌ ఓపెన్‌ చేసిన గంటలోనే ఏకంగా 1000 ఈవీలు వినియోగదారులు బుక్‌ చేసుకున్నారు. కాబట్టి ఓలా ఎస్‌ 1 ఎయిర్‌ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

ఓలా తన స్కూటర్లను ఆల్‌రెడీ కొన్ని కస్టమర్ల కోసం ఓలా ఎస్‌1 ఎయిర్‌ బుకింగ్స్‌లో ప్రాధాన్యతను ఇచ్చింది. వారి కోసం 3 రోజుల పాటు ప్రత్యేక విండోను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు ఎస్‌ 1 ఎయిర్‌ సాధారణ ధర కంటే రూ.10,000 తక్కువ బుక్‌ చేసుకోవచ్చని చెప్పడంతో డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. అయితే బుకింగ్స్‌ విండో నిర్ణీత తేదీ కంటే ఓ రోజు ముందే ఓపెన్‌ చేశారు. దీంతో బుకింగ్‌ విండో ఓపెన్‌ చేసిన గంటలోనే వినియోగదారులు 1000 స్కూటర్లను బుక్‌ చేశారు. బుకింగ్‌ విండో ఓపెన్‌ చేసిన మూడు గంటల్లో 3000 స్కూటర్లను బుక్‌ ఓలా సీఈఓ భవిష్‌ అగర్వాల్‌ చెబుతున్నారు.

ఓలా ఎస్‌ 1 ఎయిర్‌ ధర రూ.1.19 లక్షలు. అయితే ఓలా ఎగ్జిస్టింగ్‌ కస్టమర్లు ప్రత్యేక విండో ద్వారా బుక్‌ చేసుకుంటే రూ.1.09 లక్షలకే ఓలా ఎస్‌ 1 ఎయిర్‌ డిస్కౌంట్‌లో లభించింది. ఈ బుకింగ్‌ విండో జూలై 27నే ఓపెన్‌ చేశారు. అలాగే జూలై 30 వరకూ విండో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఓలా ఎస్‌ 1 ఫీచర్ల విషయానికి వస్తే ఓలా తన మిగిలిన స్కూటర్లలాగానే ఈ స్కూటర్‌కు కూ 3 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీను అందించింది. ఈ స్కూటర్‌ను ఓ సారి చార్జ్‌ చేస్తే 125 కిలో మీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. అలాగే గంటకు 90 కిలో మీటర్ల గరిష్ట వేగంతో దూసుకుపోతుంది. ఈ స్కూటర్‌ కేవలం 3.3 సెకన్లలో 40 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ ఓలా ఎస్‌ 1 ఎయిర్‌ ఇప్పటికే మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఎథర్‌450 ఎస్‌, టీవీఎస్‌ ఐక్యూబ్‌ స్కూటర్లకు మంచి పోటీనివ్వనుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే